Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సౌత్ ఏషియా వైల్డ్ లైఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ నెట్ వర్క్


సౌత్ ఏషియా వైల్డ్ లైఫ్ ఎన్ ఫోర్స్ మెంట్ నెట్ వర్క్ (ఎస్ ఎ డబ్ల్యు ఇ ఎన్) శాసనాన్ని భారతదేశం అనుసరించడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. సమాచారం, సమన్వయం, కలిసి పనిచేయడం, సామర్ధ్య నిర్మాణం, పరస్పర సహకారం పెంపొందించుకోవడం ద్వారా వన్య ప్రాణులను సరిహద్దు దాటించడం వంటి నేరాలను నియంత్రించడానికి, ఎస్ ఎ డబ్ల్యు ఇ ఎన్ లో భారతదేశం లాంచనంగా సభ్యత్వం తీసుకుని మిగతా సభ్య దేశాలతో సంబంధాలు బలోపేతం చేసుకునేందుకు ఈ చర్య దోహద పడుతుంది.

ఎస్ ఎ డబ్ల్యు ఇ ఎన్ అనేది దక్షిణ ఆసియాలోని ఎనిమిది దేశాలు.. అఫ్గానిస్తాన్, బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, మాల్దీవులు, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక లతో కూడిన ఒక ప్రాంతీయ నెట్ వర్క్. వన్యప్రాణులకు సంబంధించి పాల్పడే నేరాలను అరికట్టడంతో పాటు ఈ ప్రాంతం లో చట్టవిరుద్ధ వ్యాపారాన్ని నియంత్రించడం వంటి ఉమ్మడి లక్ష్యాలను సాధించడం కోసం ఒక పటిష్టమైన ప్రాంతీయ అంతర్ ప్రభుత్వ సంస్థ గా పనిచేయాలన్నది దీని లక్ష్యం.

ఎస్ ఎ డబ్ల్యు ఇ ఎన్ శాసనాలను ఆమోదించడం అంటే ఈ ప్రాంతంలోనూ, ఈ ప్రాంతానికి వెలుపల వన్యప్రాణి నేరాలను అరికట్టడానికి ఏర్పాటైన అంతర్ ప్రభుత్వ సంస్థ లో భారతదేశం కూడా ఒక భాగం అవుతుందన్న మాట. ఈ కింద పేర్కొన్న ధ్యేయాలను సాధించాలని నిర్దేశించారు..:

• జంతు సంపదను, వృక్ష సంపదను పరిరక్షించాలని ఆందోళన వ్యక్తం చేస్తున్న సభ్య దేశాల చట్టాలు, విధానాలను సామరస్యంగా ప్రమాణీకరించడం కోసం తగిన చర్యలు తీసుకోవడం;

• ఈ ప్రాంతంలోని దేశాలలోనూ, దేశాల మధ్యా పెరుగుతున్న దొంగతనాలు, అక్రమ వ్యాపారం వంటి – ప్రకృతి జీవ వైవిధ్యం ఎదుర్కొంటున్న సవాళ్ళను గుర్తించడం;

• పరిశోధనలను ప్రోత్సహించడం, సమాచారం ఇచ్చి పుచ్చు కోవడం, శిక్షణ, సామర్ధ్య నిర్మాణం, సాంకేతిక సహకారం, అనుభవాలను పరస్పరం పంచుకోవడం ద్వారా – సంస్థాగతమైన స్పందనలను పఠిష్టపరచుకోవడం; ఇంకా..

• వన్యప్రాణి నేరాలను అరికట్టడం కోసం సభ్య దేశాలు తమ తమ జాతీయ స్థాయి కార్యాచరణ ప్రణాళికలను తయారుచేసుకునే విధంగా ప్రోత్సహించడం. వాటిని సమర్ధంగా అమలుచేయడానికి కలిసి పనిచేయడం.

దక్షిణాసియా ప్రాంతం – అక్రమ రవాణా, వన్యప్రాణి నేరాలకు అత్యంత అనువైనదిగా ఉంది. ఎందుకంటే – ఇక్కడ ఎంతో విలువైన జీవ వైవిధ్యం ఉంది. దక్షిణాసియా ప్రాంతంలో వన్యప్రాణి ఉత్పత్తులు రవాణా చేయడానికి అనువైన మార్గాలతో పాటు ఇక్కడ అతి పెద్ద మార్కెట్ కూడా ఉంది. ఈ ప్రాంతంలో ఉన్న జీవ వైవిధ్యాన్ని సమర్ధంగా పరిరక్షించదానికి వన్యప్రాణి సంరక్షణ అమలు చేయడంతో పాటు, సామరస్యం తో కలసి పనిచేయడం కూడా ఎంతో ముఖ్యమైనదిగా మనం భావించాలి.