గుజరాత్ లోని సోమనాథ్ లో అనేక పథకాల ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆగస్టు 20 న ఉదయం 11 గంటల కు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రారంభించనున్నారు. ఇదే సందర్భం లో మరికొన్ని పథకాల కు ఆయన శంకుస్థాపన కూడా చేస్తారు. ప్రారంభం కానున్న పథకాల లో సోమనాథ్ విహార స్థలం, సోమనాథ్ ప్రదర్శన కేంద్రం లతో పాటు పునర్ నిర్మాణం జరిగిన పాత సోమనాథ్ (జూనా) ఆలయం ఆవరణ కూడా కలసి ఉన్నాయి. ఇదే కార్యక్రమం లో భాగం గా శ్రీ పార్వతి ఆలయ నిర్మాణానికి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయనున్నారు.
సోమనాథ్ విహార స్థలాన్ని ‘పిల్ గ్రిమేజ్ రిజూవనేశన్ ఎండ్ స్పిరిచ్యువల్, హెరిటేజ్ ఆగ్ మెంటేశన్ డ్రైవ్ (పిఆర్ఎఎస్ హెచ్ఎడి) పథకం’ లో భాగం గా 47 కోట్ల రూపాయల పై చిలుకు మొత్తం వ్యయం తో అభివృద్ది పరచడమైంది. పర్యటకుల సదుపాయాల కేంద్రం ప్రాంగణం లో అభివృద్ధి పరచినటువంటి సోమనాథ్ ఎగ్జిబిశన్ సెంటర్ లో పాత సోమనాథ్ ఆలయం తాలూకు విడదీయబడిన కొన్ని భాగాల ను, పాత (జూనా) సోమనాథ్ ఆలయం తాలూకు నాగర్ శైలి లోని ఆలయ వాస్తుకళ ను కలిగివున్న శిల్పాల ను కూడా చూడవచ్చును.
పాత (జూనా) సోమనాథ్ పునర్ నిర్మిత పరిసరాల పునర్ నిర్మాణ పనుల ను శ్రీ సోమనాథ్ ట్రస్ట్ 3.5 కోట్ల రూపాయల వ్యయం తో పూర్తి చేసింది. ఈ ఆలయం శిథిలావస్థ కు చేరుకొన్నట్లు గమనించిన ఇందౌర్ రాణి అహిల్యాబాయి దీనిని ఉద్ధరించినందువల్ల ‘అహిల్యాబాయి ఆలయం’ గా కూడా ఇది వ్యవహారం లో ఉంది. తీర్థయాత్రికుల సురక్ష తో పాటు దీని సామర్థ్యాన్ని పెంచడం కోసం పాత ఆలయ సముదాయాన్ని అంతటిని సమగ్రమై రూపం లో తిరిగి అభివృద్ధిపరచడం జరిగింది.
శ్రీ పార్వతీ దేవాలయాన్ని మొత్తం 30 కోట్ల రూపాయల వ్యయం తో నిర్మించాలని ప్రతిపాదించడమైంది. దీనిలో సోమ్ పురా సలాత్ శైలి లో ఆలయం నిర్మాణం, గర్భగుడి, నృత్యమండపాన్ని అభివృద్ధిపరచడం కూడా భాగం కానుంది.
ఈ సందర్భం లో హోం శాఖ కేంద్ర మంత్రి, పర్యటన శాఖ కేంద్ర మంత్రి, గుజరాత్ ముఖ్యమంత్రి, గుజరాత్ ఉప ముఖ్యమంత్రి లు కూడా పాలుపంచుకొంటారు.
***