Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సొరంగం ప్రారంభోత్సవం కోసం జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ వెళ్లేందుకు ఉత్కంఠతో ఎదురుచూస్తున్నాను: ప్రధానమంత్రి


జడ్-మోర్  సొరంగం ప్రారంభోత్సవం కోసం జమ్ముకశ్మీర్‌లోని సోన్‌మార్గ్ వెళ్ల‌డానికి తానెంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నాన‌ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

ఈ సొరంగం ప‌నులు ముగిసి, ప్రారంభోత్సవానికి సిద్ధం కావడంపై రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ ఒమర్ అబ్దుల్లా “ఎక్స్” ద్వారా పోస్ట్ చేసిన సందేశంపై శ్రీ మోదీ స్పందిస్తూ:-

“సొరంగం ప్రారంభోత్సవం కోసం జమ్ముక‌శ్మీర్‌లోని సోన్‌మార్గ్‌లో ప‌ర్య‌టించేందుకు నేనెంతో ఉత్సుక‌త‌తో ఎదురుచూస్తున్నాను. ఈ సొరంగం సిద్ధ‌మైన నేప‌థ్యంలో ప‌ర్యాట‌క రంగంతోపాటు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఒన‌గూడే ప్రయోజనాలను మీరెంతో చ‌క్క‌గా వివ‌రించారు…  

అలాగే, గ‌గ‌న‌త‌లం నుంచి తీసిన సొరంగం చిత్రాలు, వీడియోలు నాకెంతో నచ్చాయి!” అని పేర్కొన్నారు. 

 

***