Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైబర్ సెక్యూరిటీ రంగంలో సహకారానికి గాను భారతదేశానికి, బాంగ్లాదేశ్ కు మధ్య కుదిరిన ఎమ్ఒయు మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది


సైబర్ భద్రత రంగంలో భారతదేశం, బాంగ్లాదేశ్ పరస్పరం సహకరించుకోవడానికి వీలుగా భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ ఫర్ మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In)కు మరియు బాంగ్లాదేశ్ తపాలా, టెలీ కమ్యూనికేషన్లు మరియు సమాచార సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ ఆధీనంలోని బాంగ్లాదేశ్ కంప్యూటర్ కౌన్సిల్ ఆఫ్ ఇన్ ఫర్ మేశన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ డివిజన్ మరియు బాంగ్లాదేశ్ గవర్నమెంట్ కంప్యూటర్ ఇన్సిడెంట్ రెస్పాన్స్ టీమ్ (BGD e-Gov CIRT)కు మధ్య కుదిరిన ఒక అవగాహన పూర్వక ఒప్పందాన్ని (ఎమ్ఒయు ను) గురించి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం దృష్టికి తీసుకురావడమైంది. ఈ ఎమ్ఒయు పై 20107 ఏప్రిల్ 8వ తేదీన సంతకాలు జరిగాయి.

ఈ ఎమ్ఒయు CERT-In కు మరియు BGD e-Gov CIRT కు మధ్య సహకారాన్ని పెంపొందించడానికి ఉద్దేశించినటువంటిది. ఈ ఎమ్ఒయు పరిధిలోకి.. సైబర్ దాడులు మరియు సైబర్ భద్రతకు భంగం కలిగించే సంఘటనల తాలూకు సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకోవడం; సైబర్ భద్రతకు సంబంధించిన సాంకేతిక విజ్ఞాన సహకారం; సైబర్ సెక్యూరిటీ సంబంధిత విధానాల ఆదాన ప్రదానంతో పాటు, ఈ రంగంలో మానవ వనరుల అభివృద్ధికి సంబంధించిన ఉత్తమ పద్ధతులతో పాటు, సమానతవం, ఆదాన ప్రదానం మరియు పరస్పర ప్రయోజనాల ప్రాతిపదికన ఇరు దేశాలలోను దీనికి సంబంధించిన చట్టాలు, నియమ నిబంధనలు.. వస్తాయి.

సైబర్ సెక్యూరిటీ పై ఏర్పాటు చేసే ఒక సంయుక్త సంఘం ద్వారా CERT-In కు మరియు BGD e-Gov CIRTకు మధ్య ఎమ్ఒయు ను అమలు చేస్తారు.

పూర్వ రంగం :

CERT-In అనేది భారత ప్రభుత్వ ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధీనంలో పనిచేసేటటు వంటి ఒక జాతీయ నోడల్ ఏజెన్సీ. భారతీయ సైబర్ రంగాన్ని భద్రంగా ఉంచే లక్ష్యంతో దీనిని ఏర్పాటు ఈ కారణంగా, విదేశాలలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ ల (CERTs)తో కలిసి CERT-In పని చేస్తోంది.

ప్రభుత్వాలు, వ్యాపార సంస్థలు మరియు వినియోగదారులు రక రకాలైన సైబర్ బెదరింపులను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ ఒప్పందం తెర మీదకు వచ్చింది. అంతే కాకుండా, సైబర్ సెక్యూరిటీ సంబంధిత సన్నద్ధతను మరింత మెరుగుపరచవలసిన ఆవశ్యకత కూడా ఉంది. సిస్టమ్స్ ను మరియు సెక్యూరిటీ ప్రక్రియలను భద్రంగా ఉంచడానికి ప్రాముఖ్యం ఇవ్వవలసివుందనే చైతన్యాన్ని సైతం పెంచవలసివుంది. సైబర్ సెక్యూరిటీ రంగంలో రెండు సంస్థలకూ మధ్య సహకారం తాలూకు ప్రాముఖ్యాన్ని గ్రహించవలసివుంది.

***