Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైన్య దినం సంద‌ర్భంగా శుభాకాంక్ష‌లు తెలిపిన ప్ర‌ధాన‌ మంత్రి


సైన్య దినం సంద‌ర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ శుభాకాంక్ష‌ల‌కు తెలిపారు.

‘‘సైన్య దినం నాడు జవాన్ ల‌కు, పదవీవిరమణ పొందిన సైనికులకు మరియు వారి కుటుంబాల‌కు నా శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నాను. దేశాన్ని ర‌క్షిస్తూ, ప్ర‌కృతి విపత్తులు మరియు ఇతర దుర్ఘటనల‌ తరుణాలలో మాన‌వీయ ప్రయాసలతో ముందు భాగాన నిలుస్తున్నటువంటి దేశ సైన్యం ప‌ట్ల దేశంలోని ప్ర‌తి ఒక్క పౌరుడికీ అచంచ‌ల విశ్వాసంతో పాటు గ‌ర్వంగా కూడా ఉంటోంది.

మ‌న సైన్యం ఎల్ల‌ప్పుడూ దేశానికే ప్రాధాన్యమిస్తుంది. దేశానికి సేవ‌ చేస్తూ వారి ప్రాణాలను బలిదానం చేసిన అందరు మహానుభావులైన వ్యక్తులకు నేను ప్రణామం చేస్తున్నాను. భార‌త‌దేశం తన శూర వీర నాయకులను ఎన్నటికీ మ‌రువ‌దు’’ అని ప్రధాన మంత్రి తన సందేశంలో పేర్కొన్నారు.

***