Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైన్యసిబ్బంది యొక్క అసాధారణమైన ధైర్య, సాహసాలకు, వారి అచంచలమైన నిబద్ధత కు మరియు వారియొక్క ప్రాణ సమర్పణాని కి సైన్య దినం నాడు వందనాన్ని ఆచరించిన ప్రధాన మంత్రి


సైన్య సిబ్బంది యొక్క అసాధారణమైనటువంటి ధైర్య, సాహసాల కు, వారి యొక్క అచంచలమైనటువంటి నిబద్ధత కు మరియు వారి యొక్క ప్రాణ సమర్పణాని కి సైన్య దినం నాడు శ్రద్ధాంజలి ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సమర్పించారు.

 

ప్రధాన మంత్రి ఒక సందేశం లో

‘‘మన సైన్య సిబ్బంది యొక్క అసాధారణమైనటువంటి ధైర్య, సాహసాల ను, అచంచలమైనటువంటి నిబద్ధత ను మరియు వారి యొక్క త్యాగాల ను సైన్య దినం సందర్భం లో మనం గౌరవించుకొందాం. మన దేశ ప్రజల కు కాపాడుకోవడం లో మరియు మన సార్వభౌమత్వాన్ని పరిరక్షించడం లో వారు వ్యక్తపరుస్తున్నటువంటి తదేక సమర్పణ భావం వారి యొక్క వీరత్వానికి ఒక ప్రతీక గా ఉన్నది. వారు బలమైనటువంటి మరియు ఆటుపోటుల కు ఎదురొడ్డి నిలచేటటువంటి స్తంభాల వలె ఉన్నారు.’’ అని వ్రాసి, ఆ సందేశాన్ని ఎక్స్ మాధ్యం లో పోస్ట్ చేశారు.

 

 

***

DS/TS