Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సైన్యంలో చిరకాలం పనిచేసిన అనుభవజ్ఞుడు విశ్రాంత హవల్దార్ బల్‌దేవ్ సింగ్ మృతికి ప్రధానమంత్రి సంతాపం


సైన్యంలో దీర్ఘకాలం పాటు పనిచేసి, పదవీవిరమణ పొందిన హవల్దార్ బల్‌దేవ్ సింగ్ మృతికి ప్ర‌ధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంతాపాన్ని వ్యక్తం చేశారు. దేశానికి బల్‌దేవ్ సింగ్ చేసిన స్మరణీయ సేవలను రాబోయే కాలాల్లోనూ ప్రజలు గుర్తుపెట్టుకొంటారని ప్రధాని అన్నారు. బల్‌దేవ్ సింగ్ సాహసానికీ, దృఢత్వానికీ సిసలైన ప్రతీకగా నిలిచారు, దేశం పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం భావి తరాలకు సైతం ప్రేరణనిస్తూ ఉంటుందని శ్రీ మోదీ అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఇలా పేర్కొన్నారు:

‘‘హవల్దార్ బల్‌దేవ్ సింగ్ (రిటైర్డ్) మనను వీడివెళ్లారని తెలిసి బాధపడ్డాను. మన దేశానికి ఆయన అందించిన  స్మరణీయ సేవలను ప్రజలు రాబోయే సంవత్సరాల్లోనూ గుర్తుపెట్టుకొంటారు. సాహసానికీ, దృఢత్వానికీ సిసలైన ప్రతీకగా నిలిచిన బల్‌దేవ్ సింగ్, దేశం పట్ల కనబర్చిన అచంచల అంకిత భావం భావి తరాల వారికి సైతం ప్రేరణనిచ్చేదే. కొన్నేళ్ల కిందట మొదట నౌశేరాలో ఆయనను నేను కలుసుకోవడం నాకింకా జ్ఞాపకముంది. ఆయన కుటుంబానికీ, ఆయన అభిమానులకూ  సంతాపాన్ని తెలియజేస్తున్నాను.’’

 

 

 

***

MJPS/ST