Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెప్టెంబర్ 29వ మరియు 30వ తేదీల లో గుజరాత్ ను సందర్శించనున్నప్రధాన మంత్రి


సెప్టెంబర్ 29వ మరియు 30వ తేదీల లో గుజరాత్ ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందర్శించనున్నారు. సూరత్ లో 3,400 కోట్ల రూపాయల కు పైగా విలువైన వివిధ ప్రాజెక్టుల కు సెప్టెంబర్ 29వ తేదీ నాడు ఇంచుమించు ఉదయం 11 గంటల వేళ లో ప్రధాన మంత్రి శంకుస్థాపన చేయడం తో పాటు వాటిని ప్రజల కు అంకితం కూడా చేస్తారు. ఆ తరువాత ప్రధాన మంత్రి భావ్ నగర్ కు బయలుదేరి వెళతారు. అక్కడ మధ్యాహ్నం పూట సుమారు 2 గంటల కు ఆయన 5,200 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన అనేక అభివృద్ధి కార్యక్రమాల కు శంకుస్థాపన చేయడంతో పాటు కొన్ని కార్యక్రమాల ను ప్రారంభిస్తారు. ముప్ఫై ఆరో జాతీయ క్రీడల ను రాత్రి దాదాపు 7 గంటల వేళ లో అహమదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియమ్ లో ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. రాత్రి దాదాపు 9 గంటల వేళ లో అహమదాబాద్ లోని జిఎండిసి మైదానం లో నవరాత్రి ఉత్సవాల లో ప్రధాన మంత్రి పాలుపంచుకోనున్నారు.

గాంధీనగర్-ముంబయి వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలు కు సెప్టెంబర్ 30వ తేదీ నాడు ఉదయం సుమారు 10:30 గంటల వేళ లో గాంధీ నగర్ స్టేశన్ లో ప్రధాన మంత్రి ప్రారంభ సూచక జెండా ను చూపడం తో పాటు గా ఆ రైలు లో బయలుదేరి కాలుపుర్ రైల్ వే స్టేశన్ వరకు ప్రయాణిస్తారు. ఉదయం సుమారు 11:30 గంటల కు ప్రధాన మంత్రి అహమదాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు కు ప్రారంభ సూచక జెండా ను చూపిన తరువాత, కాలుపుర్ స్టేశన్ నుండి మెట్రో లో బయలుదేరి దూర్ దర్శన్ కేంద్ర మెట్రో స్టేశన్ వరకు ప్రయాణించనున్నారు. మిట్టమధ్యాహ్నం సుమారు 12 గంటల వేళ లో ప్రధాన మంత్రి అహమదాబాద్ లోని అహమదాబాద్ ఎడ్యుకేశన్ సొసైటీ లో ఏర్పాటైన ఒక సార్వజనిక కార్యక్రమం లో పాల్గొని, అహమదాబాద్ మెట్రో ప్రాజెక్టు ఒకటో దశ ను ప్రారంభిస్తారు. అటు తరువాత సాయంత్రం 5గంటల 45 నిమిషాల వేళ లో అంబాజీ లో 7,200 కోట్ల రూపాయల కు పైచిలుకు విలువ కలిగిన వివిధ ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేసి, వాటిని ప్రజల కు అంకితం చేయనున్నారు. రాత్రి పూట ఇంచుమించు 7 గంటల వేళ లో ప్రధాన మంత్రి అంబాజీ దేవాలయం లో దైవదర్శనం చేసుకొని, పూజ కార్యక్రమం లో పాలుపంచుకొంటారు. తదనంతరం ఇంచుమించు 7గంటల 45 నిమిషాల కు, గబ్బర్ తీర్థ లో జరిగే మహా ఆరతి కార్యక్రమాని కి ప్రధాన మంత్రి హాజరు కానున్నారు.

ఈ విధమైనటువంటి అనేక అభివృద్ధి పథకాల ప్రారంభోత్సవం మరియు శంకుస్థాపన కార్యక్రమాలు ప్రపంచ శ్రేణి మౌలిక సదుపాయాల ను అభివృద్ధి పరచే, పట్టణ ప్రాంత గతిశీలత ను వృద్ధి చెందింప చేసే, ఇంకా బహుళ విధ సంధానాన్ని మెరుగు పరచే దిశ లో ప్రధాన మంత్రి యొక్క వచనబద్ధత కు అద్దం పడుతున్నాయి. అంతేకాక సామాన్య మానవుల కు జీవన సౌలభ్యాన్ని మెరుగు పరచడం పట్ల అదే పని గా ఆయన ప్రభుత్వం వహిస్తున్న శ్రద్ధ ను కూడా పట్టి చూపుతున్నాయి.

సూరత్ లో ప్రధాన మంత్రి

ప్రధాన మంత్రి 3,400 కోట్ల రూపాయల పైచిలుకు విలువ కలిగిన వివిధ ప్రాజెక్టుల కు శంకుస్థాపన చేయడంతో పాటుగా వాటి ని దేశ ప్రజల కు అంకితం కూడా చేయనున్నారు. ఈ ప్రాజెక్టుల లో నీటి సరఫరా కు చెందిన పనులు, మురుగునీటి పారుదల పథకాలు, డ్రీమ్ సిటీ (DREAM City), బయోడైవర్సిటీ పార్కు ల తో పాటు సార్వజనిక మౌలిక సదుపాయాల కల్పన, వారసత్వ పునరుద్ధరణ, సిటీ బస్సు/బిఆర్ టిఎస్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్, ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ ల వంటి ఇతర అభివృద్ధి పనులు, ఇంకా కేంద్ర ప్రభుత్వం మరియు రాష్ట్ర ప్రభుత్వం కలసి చేపట్టేటువంటి అభివృద్ధి పనులు చేరి ఉన్నాయి.

 

రహదారి సంబంధి మౌలిక సదుపాయాల కల్పన పనుల తాలూకు ఒకటో దశ ను మరియు డాయమండ్ రిసర్చ్ ఎండ్ మర్కంటైల్ (డిఆర్ఇఎఎమ్ – డ్రీమ్) సిటీ యొక్క ప్రధాన ప్రవేశ ద్వారాన్ని ప్రధాన మంత్రి ప్రారంభించనున్నారు. డ్రీమ్ సిటీ ప్రాజెక్టు ను సూరత్ లో వజ్రాల ట్రేడింగ్ వ్యాపారం శరవేగం గా వృద్ధి చెందుతూ ఉన్న తరుణం లో వాణిజ్య భవనాలు మరియు నివాస భవనాల కు అంతకంతకు పెరుగుతూ పోతున్న గిరాకీ ని తట్టుకోవాలన్న దృష్టి తో మొదలు పెట్టడమైంది. ఈ ప్రాజెక్టు యొక్క రెండో దశ నిర్మాణాని కి కూడా ప్రధాన మంత్రి శంకుస్థాపన కూడా చేయనున్నారు.

   డాక్టర్‌ హెడ్గేవార్ వంతెన నుంచి భీమరథ్‌-బామ్రోలి వంతెన వరకు 87 హెక్టార్లకుపైగా విస్తీర్ణంలో నిర్మించే ‘బయో డైవర్సిటీ పార్కు’కు ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. అలాగే సూరత్‌లోని సైన్స్ సెంటర్‌లో ఖోజ్ మ్యూజియాన్ని కూడా ఆయన ప్రారంభిస్తారు. బాలల కోసం నిర్మించిన ఈ మ్యూజియంలో పరస్పర స్పందనాత్మక ప్రదర్శనలు, శోధనాధారిత కార్యకలాపాలు, పరిశోధనాత్మకత ఆధారిత అన్వేషణలు ఉంటాయి.

భావ్‌నగర్‌లో ప్రధానమంత్రి

   భావ్‌నగర్‌లో రూ.5200 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు ప్రధానమంత్రి ప్రారంభోత్సవం, శంకుస్థాపన చేస్తారు. ప్రపంచంలోనే తొలి సీఎన్‌జీ టెర్మినల్, బ్రౌన్‌ఫీల్డ్ రేవుకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. ఈ రేవును రూ.4,000 కోట్లకుపైగా వ్యయంతో అభివృద్ధి చేయనుండగా ఈ టెర్మినల్‌లో ప్రపంచంలో నాలుగో అతిపెద్ద లాక్ గేట్ వ్యవస్థసహా ఇతరత్రా కూడా అత్యాధునిక మౌలిక సదుపాయాలు కల్పించబడతాయి. ఈ ప్రాంతంలో రాబోయే కాలంలో ఏర్పడబోయే వివిధ ప్రాజెక్టుల అవసరాలను కూడా తీర్చగలిగేలా సీఎన్‌జీ టెర్మినల్‌, బ్రౌన్‌ఫీల్డ్‌ రేవు సిద్ధమవుతాయి. ఈ రేవులో అత్యంత అధునాతన కంటైనర్ టెర్మినల్, బహళ ప్రయోజన టెర్మినల్, లిక్విడ్ టెర్మినళ్లు కూడా ఉన్నాయి, ఇవి ప్రస్తుత రహదారి, రైల్వే నెట్‌వర్కుకు ప్రత్యక్షంగా ముడిపడి ఉండేలా అనుసంధానమవుతాయి. తద్వారా సరుకుల ఎగుమతి, దిగుమతి నిర్వహణలో ఖర్చుపరంగా పొదుపు ఆర్థిక ప్రయోజనాలకు దారితీయడమేగాక ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి కూడా సృష్టించబడుతుంది. అలాగే సీఎన్‌జీ దిగుమతి టెర్మినల్ సంబంధిత హరిత ఇంధనానికి పెరుగుతున్న డిమాండ్లను నెరవేర్చడానికి అదనపు ప్రత్యామ్నాయ శక్తిని కూడా ఇది అందిస్తుంది.

   భావ్‌నగర్‌లోనే 20 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు రూ.100 కోట్ల వ్యయంతో నిర్మించిన ప్రాంతీయ విజ్ఞాన కేంద్రాన్ని కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. ఈ కేంద్రంలో సముద్ర జీవజాల గ్యాలరీ, ఆటోమొబైల్ గ్యాలరీ, నోబెల్ ప్రైజ్ గ్యాలరీ – ఫిజియాలజీ-మెడిసిన్, ఎలక్ట్రో మెకానిక్స్ గ్యాలరీతోపాటు బయాలజీ సైన్స్ గ్యాలరీ వంటి అనేక ఇతివృత్త ఆధారిత గ్యాలరీలున్నాయి. యానిమేట్రానిక్ డైనోసార్‌లు, సైన్స్ థీమ్ ఆధారిత బొమ్మరైలు, ప్రకృతి అన్వేషక సందర్శన, మోషన్ సిమ్యులేటర్లు, సంచార సౌర వేధశాల తదితర అవుట్-డోర్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. వీటిద్వారా బాలలకు ఆవిష్కరణ-అన్వేషణకు తగిన సృజనాత్మక వేదికను ఈ కేంద్రం అందిస్తుంది. ఈ కార్య‌క్ర‌మం సందర్భంగా సౌని యోజ‌న లింక్ 2 ఏడో ప్యాకేజీతోపాటు 25 మెగావాట్ల ప‌లిటానా సోలార్ పీవీ ప్రాజెక్ట్, ఏపీపీఎల్‌ కంటెయిన‌ర్ (ఆవ‌ద్కృప ప్లాస్టోమెక్‌ ప్రైవేట్‌ లిమిటెడ్) సహా అనేక ఇతర ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి ప్రారంభిస్తారు; అంతేకాకుండా సౌని యోహ్నా లింక్ 2 తొమ్మిదో ప్యాకేజీ, చోర్వడ్ల జోన్ నీటి సరఫరా ప్రాజెక్ట్ తదితరాలకు శంకుస్థాపన చేస్తారు.

అహ్మదాబాద్‌లో ప్రధానమంత్రి

   హ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో 36వ జాతీయ క్రీడలకు ప్రధానమంత్రి శ్రీకారం చుడతారు. అనంతరం ఈ క్రీడల్లో పాల్గొనే దేశవ్యాప్త క్రీడాకారులతో ప్రధాని ప్రసంగిస్తారు. అదేవిధఃగా దేశార్‌లో ప్రపంచస్థాయి “స్వర్ణిమ్ గుజరాత్ స్పోర్ట్స్ యూనివర్సిటీ”ని కూడా ప్రధాని ప్రారంభిస్తారు. ఈ మైలురాయి ప్రాజెక్ట్ దేశంలోని క్రీడా విద్యారంగానికి కొత్త దిశ చూపగలదని భావిస్తున్నారు. గుజరాత్ రాష్ట్రంలో తొలిసారి నిర్వహిస్తున్న జాతీయ క్రీడలు 2022 సెప్టెంబరు 29న ప్రారంభమై అక్టోబర్ 12వ తేదీవరకూ నిర్వహించబడతాయి. దేశం నలుమూలల నుంచి దాదాపు 15,000 మంది క్రీడాకారులు, కోచ్‌లు, అధికారులు మొత్తం 36 క్రీడా విభాగాల్లో పతకాల కోసం పోటీల్లో తలపడతారు. రాష్ట్రంలో ఇదే అతిపెద్ద జాతీయ క్రీడా కార్యక్రమం కావడం ఈ సందర్భంగా గమనార్హం. రాష్ట్రంలోని అహ్మదాబాద్, గాంధీనగర్, సూరత్, వడోదర, రాజ్‌కోట్, భావ్‌నగర్‌… మొత్తం ఆరు నగరాల్లో ఈ క్రీడలు నిర్వహిస్తారు. గుజరాత్‌ పూర్వ ముఖ్యమంత్రి, ప్రస్తుత దేశ ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో అంతర్జాతీయ ప్రమాణాలతో, బలమైన క్రీడా మౌలిక సదుపాయాల నిర్మాణం దిశగా గుజరాత్ తన క్రీడా పయనం ప్రారంభించింది. దీంతో అత్యంత తక్కువ వ్యవధిలోనే రాష్ట్రం క్రీడల నిర్వహణకు సిద్ధం కాగలిగింది.

   హ్మదాబాద్‌లో నిర్వహించే బహిరంగ కార్యక్రమంలో అహ్మదాబాద్ మెట్రో ప్రాజెక్ట్ తొలి దశను ప్రధానమంత్రి ప్రారంభిస్తారు. అపెరల్ పార్క్ నుంచి, తాల్తేజ్ వరకూ 32 కిలోమీటర్ల మేర తూర్పు-పశ్చిమ కారిడార్‌తోపాటు మోతెరా నుంచి గ్యాస్‌పూర్ మధ్య ఉత్తర-దక్షిణ కారిడార్‌ కూడా ఇందులో భాగంగా ఉంటాయి. కాగా, తూర్పు-పశ్చిమ కారిడార్‌లోని తాల్తేజ్-వస్త్రాల్ మార్గంలో 17 స్టేషన్లున్నాయి. ఈ కారిడార్‌లోని 6.6 కిలోమీటర్ల భూగర్భ మార్గ  విభాగంలో నాలుగు స్టేషన్లున్నాయి. అలాగే గ్యాస్‌పూర్‌-మోతెరా స్టేడియంలను కలిపే 19 కిలోమీటర్ల  ఉత్తర-దక్షిణ కారిడార్‌లో 15 స్టేషన్లున్నాయి. ఈ ప్రాజెక్టులో తొలి దశ కింద రూ.12,900 కోట్లతో పనులు పూర్తిచేశారు. అహ్మదాబాద్ మెట్రో అనేది భూగర్భ సొరంగాలు, వయాడక్ట్-వంతెనలు, ఎలివేటెడ్-భూగర్భ స్టేషన్ భవనాలు, కంకర రాళ్లులేని రైలుపట్టాలు, డ్రైవర్‌ రహిత రైలు-దాని రాకపోకలకు తగిన యూనిట్లు (రోలింగ్ స్టాక్) తదితరాలతో కూడిన భారీ అత్యాధునిక మౌలిక సదుపాయాల ప్రాజెక్ట్. మెట్రో రైలు సెట్‌లో ఇంధన పొదుపు ప్రొపల్షన్ వ్యవస్థ భాగంగా ఉండటంవల్ల 30-35 శాతం దాకా ఇంధనం ఆదా అవుతుంది. ఈ రైలుకు అత్యాధునిక కుదుపు నిరోధక వ్యవస్థ ఉండటం వల్ల ప్రయాణికులకు సుఖవంతమైన ప్రయాణానుభవం కలుగుతుంది. అహ్మదాబాద్‌ మెట్రో తొలిదశ ప్రాజెక్టకు ప్రారంభంతో నగర వాసులకు అంతర్జాతీయ స్థాయి బహువిధ రవాణా అనుసంధానం అందుబాటులోకి వస్తుంది. ఇందులో భారత రైల్వేలు, బస్సుల (బీఆర్‌టీఎస్‌, జీఎస్‌ఆర్‌టీసీ, సిటీబస్సులు వగైరా) వ్యవస్థ అంతర్భాగంగా ఉంటాయి. ఈ మేరకు రాణిప్‌, వదాజ్‌, ఏఈసీ స్టేషన్‌ వగైరావల వద్ద బీఆర్‌టీఎస్‌ సౌకర్యం సంధానమవుతుంది. అలాగే గాంధీధామ్‌, కాలూపూర్‌, సబర్మతి స్టేషన్ల వద్ద భారత రైల్వే వ్యవస్థ అందుబాటులోకి వస్తుంది. కాలూపూర్‌ వద్ద మెట్రో మార్గం ముంబై-అహ్మదాబాద్‌లను కలిపే హైస్పీడ్‌ రైలు వ్యవస్థకు అనుసంధానమవుతుంది.

   కార్యక్రమాలతోపాటు గాంధీనగర్‌-ముంబై మధ్య వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ కొత్త, నవీకృత రైళ్లను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభిస్తారు. అనేక అత్యున్నత సౌకర్యాలున్న వందే భారత్ ఎక్స్‌ ప్రెస్ విమానం ప్రయాణం వంటి అనుభవాన్నిస్తుంది. దేశీయంగా అభివృద్ధి చేయబడిన ఈ రైలు ప్రమాద నిరోధక వ్యవస్థ- కవచ్‌ సహా అత్యాధునిక భద్రత విశేషతలు కూడా కలిగి ఉంది. ఎగ్జిక్యూటివ్ కోచ్‌లలో 180 డిగ్రీలు తిరిగే సీట్లు ఏర్పాటు చేయగా, అన్ని తరగతులలోనూ  రిక్లైనింగ్ సీట్లున్నాయి. ప్రతి బోగీలో ప్రయాణికుల సమాచారం, ఇన్ఫోటైన్‌మెంట్‌ కోసం 32 అంగుళాల తెరలుంటాయి.

అంబాజీలో ప్రధానమంత్రి

   ప్రధానమంత్రి అంబాజీలో రూ. 7200 కోట్ల‌కుపైగా విలువైన వివిధ అభివృద్ధి ప‌థ‌కాల‌కు శంకుస్థాపన, జాతికి అంకితం చేస్తారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద నిర్మించిన 45,000 ఇళ్లను జాతికి అంకితం చేయడంతోపాటు మరికొన్నిటికి ఆయన శంకుస్థాపన చేస్తారు. తరంగా హిల్-అంబాజీ-అబూ రోడ్ కొత్త బ్రాడ్ గేజ్ రైలు మార్గంతోపాటు ప్రసాద్ పథకం కింద అంబాజీ ఆలయం వద్ద తీర్థయాత్ర సౌకర్యాల అభివృద్ధికి ప్రధానమంత్రి శంకుస్థాపన చేస్తారు. ఈ కొత్త రైలు మార్గంతో 51 శక్తి పీఠాలలో ఒకటైన అంబాజీని సందర్శించే లక్షలాది భక్తులకు ప్రయోజనం చేకూరుతుంది. అలాగే ఈ యాత్రా స్థలాలన్నింటిలో ఆరాధనా అనుభవం సుసంపన్నం అవుతుంది. శంకుస్థాపన చేయబడే ఇతర ప్రాజెక్టులలో అంబాజీ బైపాస్‌ రహదారిసహా  ఎయిర్‌ఫోర్స్ స్టేషన్, డీసాలో రన్‌వే నిర్మాణం, అనుబంధ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులున్నాయి.

   శ్చిమ ప్రత్యేక రవాణా కారిడార్‌లో 62 కిలోమీటర్ల పొడవైన న్యూ పాలన్‌పూర్-న్యూ మెహసానా సెక్షన్‌తోపాటు 13 కిలోమీటర్ల పొడవైన న్యూ పాలన్‌పూర్-న్యూ చతోదర్ సెక్షన్ (పాలన్‌పూర్ బైపాస్ మార్గం) రహదారిని కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేస్తారు. ఇది పిపవావ్, దీనదయాళ్ పోర్ట్ అథారిటీ (కాండ్లా), ముంద్రా, గుజరాత్‌లోని ఇతర ఓడరేవులకు అనుసంధానాన్ని పెంచుతుంది. ఈ సెక్షన్ల ప్రారంభంతో 734 కిలోమీటర్ల పశ్చిమ ప్రత్యేక రవాణా కారిడార్‌ ప్రజలకు అందుబాటులోకి వస్తుంది. ఈ విస్తరణ ప్రాజెక్టు ప్రారంభంతో  గుజరాత్‌లోని మెహసానా-పాలన్‌పూర్‌ పరిధిలోగల పరిశ్రమలకు ప్రయోజనం చేకూరుతుంది. రాజస్థాన్‌లోని స్వరూపగంజ్, కేశవ్‌గంజ్, కిషన్‌గఢ్; హర్యానాలోని రేవారీ-మనేసర్ మరియు నార్నాల్. మిథా – థారద్ – దీసా రోడ్డు విస్తరణతో సహా పలు రహదారి ప్రాజెక్టులను కూడా ప్రధానమంత్రి జాతికి అంకితం చేయనున్నారు.

 

***