Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెంట‌ర్ ఫ‌ర్ ద ఫోర్త్ ఇండ‌స్ట్రియ‌ల్ రెవ‌లూశన్ ప్రారంభ సూచకం గా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

సెంట‌ర్ ఫ‌ర్ ద ఫోర్త్ ఇండ‌స్ట్రియ‌ల్ రెవ‌లూశన్ ప్రారంభ సూచకం గా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి

సెంట‌ర్ ఫ‌ర్ ద ఫోర్త్ ఇండ‌స్ట్రియ‌ల్ రెవ‌లూశన్ ప్రారంభ సూచకం గా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మం లో ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సెంట‌ర్ ఫ‌ర్ ద ఫోర్త్ ఇండ‌స్ట్రియ‌ల్ రెవ‌లూశన్ ప్రారంభ సూచ‌కంగా జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మానికి ఈ రోజు హాజ‌రై, ఒక ఉప‌న్యాసాన్ని ఇచ్చారు.

‘‘ఇండ‌స్ట్రి 4.0’’ యొక్క భాగాలు నిజానికి మాన‌వ జీవ‌నం యొక్క వ‌ర్త‌మానాన్ని మ‌రియు భ‌విష్య‌త్తు ను మార్చ‌గ‌ల సామ‌ర్ధ్యాన్ని క‌లిగి వున్నాయ‌ని ఆయ‌న అన్నారు. ప్ర‌పంచం లో సాన్ ఫ్రాంసిస్ కో, టోకియో, ఇంకా పేయీచింగ్ ల త‌రువాత నాలుగోదైన ఈ కేంద్రం భ‌విష్య‌త్తు లో అపార‌మైన అవ‌కాశాల‌ కు తలుపులు తెర‌వనుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు.

కృత్రిమ మేధస్సు (ఆర్టిఫిశల్ ఇంటలిజన్స్.. ఎఐ) , మశీన్ లర్నింగ్, ఇంట‌ర్ నెట్ ఆఫ్ థింగ్స్‌, బ్లాక్‌చైన్ మ‌రియు బిగ్ డేటా లు స‌హా ప్ర‌వ‌ర్ధ‌మాన‌ రంగాలు భార‌త‌దేశాన్ని అభివృద్ధి లో నూత‌న శిఖ‌రాల‌కు చేర్చ‌గ‌లుగుతాయ‌ని, అంతేకాక భార‌త‌దేశం పౌరుల జీవ‌న నాణ్య‌త‌ ను మెరుగుప‌ర‌చ‌గ‌లుగుతాయి కూడా అని ఆయ‌న అన్నారు. భార‌త‌దేశానికి సంబంధించినంత వ‌ర‌కు ఇది కేవ‌లం పారిశ్రామిక పరివ‌ర్త‌న యే కాకుండా సామాజిక ప‌రివ‌ర్త‌న కూడా అని ఆయ‌న వివ‌రించారు. ‘ఇండ‌స్ట్రి 4.0’కు భార‌త‌దేశం లో తిప్పివేయటానికి వీలు గానటువంటి స‌కారాత్మ‌క‌ మార్పు కు చోద‌క శ‌క్తి కాగ‌లిగిన సామ‌ర్ధ్యం ఉంద‌ని ఆయ‌న అన్నారు. ఇది భార‌త‌దేశం లో జ‌రుగుతున్న‌టువంటి కృషి కి త‌గిన వేగాన్ని మ‌రియు స్థాయి ని సంత‌రించ‌డం లో స‌హాయ‌కారి కాగ‌ల‌ద‌ని ఆయ‌న చెప్పారు.

డిజిట‌ల్ ఇండియా ఉద్య‌మం భార‌త‌దేశం లో ప‌ల్లె లకు స‌మాచారాన్ని ఏ విధంగా తీసుకు వ‌చ్చిందీ ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. టెలి-డెన్సిటి, ఇంట‌ర్ నెట్ క‌వ్రిజ్ మ‌రియు మొబైల్ ఇంట‌ర్ నెట్ తాలూకు స‌భ్య‌త్వాలు ఇటీవ‌ల కొంత కాలం లో ఏ విధంగా వృద్ధి చెందిందీ ఆయ‌న వివ‌రించారు. ప్ర‌పంచం లో అత్యంత భారీ మొబైల్ స‌మాచార రాశి వినియోగానికి భార‌త‌దేశం పేరెన్నిక గన్నద‌ని, అలాగే అతి త‌క్కువ ధ‌ర కు సమాచార రాశి అందుబాటు లోకి వ‌స్తున్న‌ది కూడా భార‌త‌దేశం లోనే అని ఆయ‌న వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా భార‌త‌దేశం లో డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాలను గురించి మ‌రియు ఆధార్‌, యుపిఐ, ఇ-ఎన్ఎఎమ్ (e-NAM)ల‌తో పాటు జిఇఎమ్ (GeM) త‌దిత‌ర డిజిట‌ల్ మౌలిక స‌దుపాయాల ఆధారిత‌మైన‌టువంటి ఇంట‌ర్ ఫేస్ ల‌ను గురించి ఆయ‌న చెప్పుకొచ్చారు. ఆర్టిఫిశల్ ఇంటలిజన్స్ లో ప‌రిశోధ‌న చేయ‌డం కోసం ఒక ప‌టిష్ట‌మైన‌టువంటి మౌలిక స‌దుపాయాల వ్య‌వ‌స్థ‌ ను సృష్టించ‌డం కోసం ఒక జాతీయ వ్యూహాన్ని కొన్ని నెల‌ల కింద‌ట సిద్ధం చేయ‌డం జ‌రిగింద‌ని ఆయ‌న తెలిపారు. ఈ ప్ర‌క్రియ‌ ను ఈ నూత‌న కేంద్రం బ‌లోపేతం చేయ‌గ‌ల‌ద‌ని ఆయ‌న అన్నారు. ‘ఇండ‌స్ట్రి 4.0’, మ‌రి అలాగే ఆర్టిఫిశల్ ఇంటెలిజెన్స్ యొక్క విస్త‌ర‌ణ లు ఉత్త‌మ‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ కు, ఆరోగ్యం పై పెట్టే ఖ‌ర్చు ను త‌గ్గించ‌డానికి దారి తీయ‌గ‌ల‌వ‌ని ఆయ‌న అన్నారు. ఇది రైతుల‌ కు కూడా స‌హాయ‌కారి కాగ‌ల‌ద‌ని, అలాగే వ్య‌వ‌సాయ రంగాని కి గొప్ప స‌హాయాన్ని అందిచ‌గ‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. రవాణా, ఇంకా స్మార్ట్ మొబిలిటీ ల వంటి ఇంత‌ర రంగాల‌ను ఆయ‌న ప్ర‌స్తావించి, వాటి లోను ఇది ఒక కీల‌క‌మైన భూమిక‌ ను పోషించ గ‌లుగుతుంద‌ని తెలిపారు. ఈ ఈ రంగా ల‌లో ప‌నులు పురోగ‌మించే కొద్దీ భార‌త‌దేశం లో నిర్దేశించుకొన్న ల‌క్ష్యాల లో ‘‘సాల్వ్ ఫ‌ర్ ఇండియా, సాల్వ్ ఫ‌ర్ ద వ‌ర‌ల్డ్’’ కూడా భాగంగా ఉంటుంద‌ని ఆయ‌న చెప్పారు.

భార‌త‌దేశం నాలుగో పారిశ్రామిక విప్ల‌వం యొక్క లాభాల‌ను ఉప‌యోగించుకోగ‌ల‌ద‌న్న విశ్వాసాన్ని ప్ర‌ధాన మంత్రి వ్య‌క్తం చేశారు. దీనికి భార‌త‌దేశం అనంత‌మైన తోడ్పాటు ను సైతం అందించ గ‌లుగుతుంద‌ని ఆయ‌న అన్నారు. నూత‌న‌ సాంకేతిక‌త‌ మరియు ప్ర‌వ‌ర్ధ‌మాన సాంకేతిక‌త‌ లకై మ‌న యువ‌త‌ ను స్కిల్ ఇండియా మిశ‌న్‌, స్టార్ట్-అప్ ఇండియా, ఇంకా అట‌ల్ ఇన‌వేశ‌న్ మిశ‌న్‌ లు స‌హా ప్ర‌భుత్వ కార్య‌క్ర‌మాలు స‌న్న‌ద్ధం చేస్తున్నట్లు ఆయ‌న తెలిపారు.

***