Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సెంట్ర‌ల్ హెల్త్ స‌ర్వీస్ (సిహెచ్ఎస్‌) మిన‌హా ఇతర వైద్యుల ప‌ద‌వీవిర‌మ‌ణ వ‌య‌స్సును 65 సంవ‌త్స‌రాల‌కు పెంచేందుకు ఆమోదం తెలిపిన మంత్రివ‌ర్గం


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివ‌ర్గం సెంట్ర‌ల్ హెల్త్ స‌ర్వీస్ (సిహెచ్ఎస్‌) మిన‌హా ఇతర వైద్యుల ప‌ద‌వీవిర‌మ‌ణ వ‌య‌స్సును ఈ కింద వివరించిన విధంగా 65 సంవ‌త్స‌రాల‌కు పెంచేందుకు ఆమోదం తెలిపింది:

i. ఇండియ‌న్ రైల్వేస్ మెడిక‌ల్ స‌ర్వీసు కు చెందిన వైద్యుల‌కు ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 65 సంవ‌త్స‌రాల‌కు పెంచేందుకు ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం.

ii. ఉన్న‌త విద్య విభాగం ఆధీనం లోని కేంద్రీయ విశ్వ‌విద్యాల‌యాలు, ఇంకా ఐఐటి (స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌) లలో ప‌ని చేస్తున్న వైద్యులు మరియు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ ఆధీనం లోని ప్ర‌ధాన పోర్టు ట్ర‌స్టుల (స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి క‌లిగిన సంస్థ‌ల) లోని వైద్యుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 65 సంవ‌త్స‌రాల‌కు పెంచేందుకు ఎక్స్‌-పోస్ట్ ఫ్యాక్టో ఆమోదం.

iii. ఆయా మంత్రిత్వ శాఖ‌లు/విభాగాల [ఆయుష్ మంత్రిత్వ శాఖ‌ (ఆయుష్ వైద్యులు), ర‌క్ష‌ణ విభాగం (డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ మెడిక‌ల్ స‌ర్వీస్ ఆధీనం లోని సివిలియ‌న్ డాక్ట‌ర్స్‌), ర‌క్ష‌ణ ఉత్ప‌త్తి విభాగం (ఇండియ‌న్ ఆర్డినెన్స్ ఫ్యాక్ట‌రీస్ హెల్త్ స‌ర్వీస్ మెడిక‌ల్ ఆఫీస‌ర్స్‌), ఆరోగ్యం మ‌రియు కుటుంబ సంక్షేమం విభాగం ఆధీనంలోని దంత వైద్యులు, రైల్వేల మంత్రిత్వ శాఖ ఆధీనం లోని దంత వైద్యులు మరియు ఉన్న‌త విద్య విభాగం ఆధీనం లోని ఉన్న‌త విద్య సంస్థలలో, ఇంకా సాంకేతిక సంస్థ‌ల‌లో ప‌ని చేస్తున్న వైద్యులు) ప‌రిపాల‌న నియంత్ర‌ణ‌లో ప‌ని చేస్తున్న] వైద్యుల విషయంలో వారి ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును 65 సంవ‌త్స‌రాల‌కు పెంచ‌డ‌మైంది.

iv. వైద్యులు వారికి 62 సంవత్సరాల వయస్సు వచ్చే తేదీ వరకు పాలన పదవులను నిర్వహించాలని మరియు ఆ తరువాత నుండి వారి సేవలను పాలనేతర పదవులుగా మార్చేందుకు కూడా కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది.

ఈ నిర్ణ‌యం వైద్య క‌ళాశాలల్లో త‌గిన విద్యా సంబంధ కార్య‌క‌లాపాల‌ను, మెరుగైన రీతిలో రోగుల సంర‌క్ష‌ణ‌ను, అలాగే ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను అందించేందుకు ఉద్దేశించినటువంటి జాతీయ ఆరోగ్య కార్య‌క్ర‌మాల (ఎన్ హెచ్ పి) అమ‌లును మ‌రింత సమర్ధంగా ఉంచేందుకు తోడ్ప‌డ‌గ‌లుగుతుంది.

కేంద్ర ప్ర‌భుత్వంలోని వేరు వేరు మంత్రిత్వ శాఖ‌లకు/విభాగాల‌కు చెందిన దాదాపు 1445 మంది వైద్యుల‌కు దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నం క‌లుగుతుంది.

ఈ నిర్ణ‌యం వ‌ల్ల ఆర్థిక సంబంధ‌మైన చిక్కులు పెద్ద‌గా త‌లెత్త‌వు. ఎలాగంటే, ఈ ఉద్యోగాల‌లో చాలా వ‌ర‌కు కొలువులు ఖాళీగా ఉన్నాయి. అంతే కాక, ఇప్పుడు ప‌ని చేస్తున్న‌ వారు- మంజూరైనటువంటినౌక‌రీల‌లో- వారి ప్ర‌స్తుత హోదాలలోనే విధులు నిర్వ‌హించ‌డాన్ని కొన‌సాగిస్తారు.

పూర్వ‌రంగం:

• సెంట్ర‌ల్ హెల్త్ స‌ర్వీసు కు చెందిన వైద్యుల ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సు ను 2016 మే నెల 31వ తేదీ నాటి నుండి వ‌ర్తించే విధంగా 65 ఏళ్ళ‌కు పెంచ‌డ‌మైంది.

• సెంట్ర‌ల్ హెల్త్ స‌ర్వీస్ కు చెంద‌ని వైద్యులు, కేంద్ర ప్ర‌భుత్వానికి చెందిన ఇత‌ర వైద్య వ్య‌వ‌స్థ‌ల యొక్క డాక్ట‌ర్లు త‌మ‌ ప‌ద‌వీ విర‌మ‌ణ వ‌య‌స్సును సిహెచ్ఎస్ తో స‌మాన స్థాయికి పెంచాల‌ంటూ అభ్య‌ర్థించారు. అంతేగాక, వైద్య విభాగంలో ఖాళీలు కూడా ఉన్నాయి.

***