Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సూరత్ లో మల్టి-స్పెషాలిటీ హాస్పిటల్ ను, వజ్రాల తయారీ యూనిట్ ను ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ

సూరత్ లో మల్టి-స్పెషాలిటీ హాస్పిటల్ ను, వజ్రాల తయారీ యూనిట్ ను   ప్రారంభించిన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సూరత్ లో కిరణ్ స్పెషాలిటీ హాస్పిటల్ ను, మెస్సర్స్ హరే కృష్ణ ఎక్స్ పోర్ట్స్ ప్రెవేట్ లిమిటెడ్ కు చెందిన వజ్రాల తయారీ యూనిట్ ను ప్రారంభించారు.

ఈ ఆసుపత్రి ని నిర్మించడం కోసం సమర్పణ భావంతో చేసిన కృషి “కొనియాడదగ్గద’’ని, ఇటువంటి ఆధునిక సౌకర్యాలతో కూడిన ఆసుపత్రి సేవలు పౌరులకు ప్రయోజనకరంగా ఉంటాయని ప్రధాన మంత్రి అన్నారు. పేదలకు నాణ్యమైన, అందుబాటు ధరలలో ఆరోగ్య సంరక్షణ పేదలకు లభించితీరాలని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా మందులు, స్టెంట్స్ వంటి వాటి ధరలను తగ్గించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను గురించి ప్రస్తావించారు. పేదలకు, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలకు ఆరోగ్య సంరక్షణను సమకూర్చడానికి కట్టుబడి ఉన్నట్లు ఆయన చెప్పారు. రోగ నివారణాత్మక ఆరోగ్య సంరక్షణపై దృష్టి నిలపాల్సిన అవసరం ఉందని చెబుతూ, ఆరోగ్యకరమైన భారతదేశాన్ని ఆవిష్కరించే దిశగా సాగుతున్న ప్రయత్నాలతో స్వచ్చ భారత్ అభియాన్ ముడిపడి ఉందని ప్రధాన మంత్రి పేర్కొన్నారు.

వజ్రాల పరిశ్రమలో సూరత్ ఒక గుర్తింపును పొందిందని కానీ ఇప్పుడు మొత్తం వజ్రాభరణాల రంగాన్ని చూడవలసిన అవసరం ఉందని ప్రధాన మంత్రి అన్నారు. వజ్రాభరణాల రంగానికి సంబంధించినంతవరకు మన లక్ష్యం ‘మేక్ ఇన్ ఇండియా(భారతదేశంలో ఆభరణాల తయారీ)’ మాత్రమే కాక ‘డిజైన్ ఇన్ ఇండియా(భారతదేశంలో నే ఆభరణాల రూపకల్పన)’ కూడా ఉండాలని అన్నారు.