ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సూరత్‌లో త్రివర్ణ పతాక యాత్రనుద్దేశించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రసంగించారు. ప్రజలందరికీ అమృత మహోత్సవ శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగం ప్రారంభించిన ఆయ- భారత స్వాతంత్ర్యానికి కొద్ది రోజుల్లో 75 ఏళ్లు పూర్తవుతాయని గుర్తుచేశారు. దేశం నలుమూలలా త్రివర్ణ పతాక రెపరెపలతో మనమంతా ఈ చరిత్రాత్మక స్వాతంత్ర్య దినోత్సవానికి సిద్ధమవుతున్నామని ప్రధానమంత్రి అన్నారు.
ఈ నేపథ్యంలో గుజరాత్ నలుమూలలా ఉత్సాహం ఉరకలెత్తుతోందని, సూరత్ దానికి మరింత ఊపునిచ్చిందని ప్రధాని వ్యాఖ్యానించారు. “దేశం మొత్తం నేడు సూరత్‌పై దృష్టి సారించింది. ఒక విధంగా సూరత్ త్రివర్ణ యాత్రలో సూక్ష్మ భారతదేశం కనిపిస్తోంది. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు ఇందులో సమష్టి భాగస్వాములయ్యారు” అని ఆయన పేర్కొన్నారు. త్రివర్ణ పతాకానికగల వాస్తవ ఏకీకరణ శక్తిని సూరత్ స్పష్టం చేసిందని ప్రధానమంత్రి అన్నారు. నగరంలోని వ్యాపారం, పరిశ్రమల నేపథ్యంలో ప్రపంచంపై సూరత్ ఇప్పటికే ఒక ముద్ర వేసినప్పటికీ నేటి త్రివర్ణ పతాక యాత్రతో యావత్ ప్రపంచం ఇటువైపే దృష్టిని సారిస్తుందని ప్రధాని వ్యాఖ్యానించారు.
సభకు హాజరైన వారినుద్దేశించి ప్రధానమంత్రి ప్రసంగిస్తూ- త్రివర్ణ పతాక యాత్ర ద్వారా మన స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తిని పునరుజ్జీవింప చేశారంటూ సూరత్ ప్రజలను అభినందించారు. ఈ మేరకు “ఒక వస్త్ర వ్యాపారి, దుకాణదారు, ఓ చేనేత కళాకారుడు, మరో దర్జీ, ఎంబ్రాయిడరీ కళాకారుడు, రవాణా రంగంలోని మరొకరు… ఇలా ప్రతి ఒక్కరూ ఈ యాత్రలో మమేకమయ్యారు” అని ఆయన కొనియాడారు. ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మార్చడంలో సూరత్ వస్త్ర పరిశ్రమ కృషిని అభినందించారు. త్రివర్ణ పతాకం యాత్రలో ఈ ప్రజా భాగస్వామ్యం దిశగా శ్రమించిన ప్రతి ఒక్కరినీ, ముఖ్యంగా… శ్రీ సన్వర్ ప్రసాద్ బుధియాతోపాటు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ‘సాకేత్ – సేవే లక్ష్యం’ బృందంలోని స్వచ్ఛంద కార్యకర్తలను ప్రధాని అభినందించారు. ఈ కృషికి సాధికారత కల్పించిన పార్లమెంటు సభ్యుడు శ్రీ సి.ఆర్.పాటిల్‌కు కూడా ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలిపారు.
ప్రధానమంత్రి తన ప్రసంగం కొనసాగిస్తూ- “మన జాతీయ జెండాయే దేశ వస్త్ర పరిశ్రమకు, ఖాదీకి, మన స్వావలంబనకు ప్రతీక” అని అభివర్ణించారు. ఈ రంగంలో స్వయం సమృద్ధితో కూడిన భారతదేశానికి సూరత్ సదా పునాదిగా నిలుస్తుందని పేర్కొన్నారు. బాపూజీ రూపంలో స్వాతంత్య్ర పోరాటానికి గుజరాత్ నాయకత్వం వహించిందని, ఆ తర్వాత ‘ఒకే భారతం-శ్రేష్ఠ భారతం’ వంటి నినాదానికి ఊపిరిపోసిన ఉక్కుమనిషి సర్దార్ పటేల్ వంటి యోధులను అందించిందని ప్రధాని గుర్తుచేశారు. బార్డోలీ ఉద్యమం, దండి యాత్ర ఇచ్చిన సందేశంతో దేశం యావత్తూ ఒక్కతాటిపైకి వచ్చిందని వివరించారు.
జాతీయ పతాకంలోని మూడు రంగులు జెండాకు మాత్రమే పరిమితం కాదని, అవి మన ఉజ్వల గతం, వర్తమాన నిబద్ధత, భవిష్యత్తు కలలకు ప్రతిబింబాలని ప్రధానమంత్రి వర్ణించారు. మన త్రివర్ణం భారతదేశ ఐక్యత, సమగ్రత, భిన్నత్వాలకు ప్రతిబింబమని ప్రధాని స్పష్టం చేశారు. “మన యోధులు త్రివర్ణ పతాకంలో దేశ భవిష్యత్తును చూశారు.. దేశం ఆకాంక్షలను గమనించారు.. అందుకే ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ సంకల్పాలు సడలపోనివ్వలేదు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయ్యాక మనం నేడు నవ భారత యాత్రను ప్రారంభిస్తున్న వేళ, త్రివర్ణ పతాకం మరోసారి భారతదేశ ఐక్యత, చైతన్యాలను ప్రతిబింబిస్తోంది” అని ప్రధాని వ్యాఖ్యానించారు.
దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న త్రివర్ణ యాత్ర ‘ఇంటింటా త్రివర్ణం’ (హర్ ఘర్ తిరంగా) కార్యక్రమ శక్తికి, భక్తికి ప్రతీకగా ఉన్నాయని ప్రధానమంత్రి హర్షం ప్రకటించారు. “ఆగస్టు 13 నుంచి 15 వరకూ దేశంలోని ప్రతి ఇంట్లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేస్తారు. సమాజంలోని అన్ని వర్గాల ప్రజలు, కులమతాలతో నిమిత్తం లేకుండా ఒకే జాతిగా ఇందులో మమేకం అవుతారు. భారత పౌరుల చైతన్యానికి ఇదొక చిహ్నం” అని ప్రధానమంత్రి వ్యాఖ్యానించారు.
భరతమాత బిడ్డలకు ఇదొక గుర్తింపు అని ప్రధాని ఉద్ఘాటించారు. ‘ఇంటింటా త్రివర్ణం’ ఉద్యమానికి మద్దతుగా పురుషులు, మహిళలు, యువకులు, వృద్ధులనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ తమవంతు పాత్రను పోషిస్తున్నారని ప్రధానమంత్రి ఎనలేని సంతృప్తిని వ్యక్తం చేశారు. ‘ఇంటింటా త్రివర్ణం’ కార్యక్రమంతో అనేకమంది పేదలు, జౌళి కార్మికులు, చేనేత కార్మికులు కూడా అదనపు ఆదాయం పొందుతుండటం సంతోషంగా ఉందని ప్రధానమంత్రి అన్నారు. స్వాతంత్ర్య అమృత మహోత్సవం మన సంకల్పాలకు కొత్త శక్తినిచ్చే ఇలాంటి కార్యక్రమాల ప్రాముఖ్యాన్ని నొక్కిచెబుతూ- “ఈ ప్రజా భాగస్వామ్య ఉద్యమాలు నవ భారత పునాదిని మరింత బలోపేతం చేస్తాయి” అంటూ ప్రధాన మంత్రి తన ప్రసంగం ముగించారు.
Addressing Tiranga Yatra in Surat, Gujarat. https://t.co/Y7mmK9jt8Y
— Narendra Modi (@narendramodi) August 10, 2022
हमारा राष्ट्रीय ध्वज अपने आपमें देश के वस्त्र उद्योग, देश की खादी और हमारी आत्मनिर्भरता का भी एक प्रतीक रहा है।
इस क्षेत्र में सूरत ने हमेशा से आत्मनिर्भर भारत के लिए आधार तैयार किया है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 10, 2022
गुजरात ने बापू के रूप में आज़ादी की लड़ाई को नेतृत्व दिया।
गुजरात ने लौह पुरुष सरदार पटेल जैसे नायक दिये, जिन्होंने आज़ादी के बाद एक भारत-श्रेष्ठ भारत की बुनियाद रखी: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 10, 2022
भारत का तिरंगा केवल तीन रंगों को ही स्वयं में नहीं समेटे है।
हमारा तिरंगा, हमारे अतीत के गौरव को, हमारे वर्तमान की कर्तव्यनिष्ठा को और भविष्य के सपनों का भी एक प्रतिबिंब है।
हमारा तिरंगा भारत की एकता का, भारत अखंडता का और भारत की विविधता का भी एक प्रतीक है: PM @narendramodi
— PMO India (@PMOIndia) August 10, 2022
*****
DS/TS
Addressing Tiranga Yatra in Surat, Gujarat. https://t.co/Y7mmK9jt8Y
— Narendra Modi (@narendramodi) August 10, 2022
हमारा राष्ट्रीय ध्वज अपने आपमें देश के वस्त्र उद्योग, देश की खादी और हमारी आत्मनिर्भरता का भी एक प्रतीक रहा है।
— PMO India (@PMOIndia) August 10, 2022
इस क्षेत्र में सूरत ने हमेशा से आत्मनिर्भर भारत के लिए आधार तैयार किया है: PM @narendramodi
गुजरात ने बापू के रूप में आज़ादी की लड़ाई को नेतृत्व दिया।
— PMO India (@PMOIndia) August 10, 2022
गुजरात ने लौह पुरुष सरदार पटेल जैसे नायक दिये, जिन्होंने आज़ादी के बाद एक भारत-श्रेष्ठ भारत की बुनियाद रखी: PM @narendramodi
भारत का तिरंगा केवल तीन रंगों को ही स्वयं में नहीं समेटे है।
— PMO India (@PMOIndia) August 10, 2022
हमारा तिरंगा, हमारे अतीत के गौरव को, हमारे वर्तमान की कर्तव्यनिष्ठा को और भविष्य के सपनों का भी एक प्रतिबिंब है।
हमारा तिरंगा भारत की एकता का, भारत अखंडता का और भारत की विविधता का भी एक प्रतीक है: PM @narendramodi