Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ కు చెందిన ఆఫీస్ ఆఫ్ డెవలప్ మెంట్ కమిషనర్ (ఎమ్ఎస్ఎమ్ఇ)లో ‘ఇండియన్ ఎంటర్ ప్రైజ్ (ఐఇడిఎస్)’ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రివర్గం


సూక్ష్మ, చిన్న మరియు మధ్య తరహా సంస్థల మంత్రిత్వ శాఖ కు చెందిన ఆఫీస్ ఆఫ్ డెవలప్ మెంట్ కమిషనర్ (ఎమ్ఎస్ఎమ్ఇ)లో కాడర్ సమీక్షకు మరియు ‘ఇండియన్ ఎంటర్ ప్రైజ్ (ఐఇడిఎస్)’ పేరుతో ఒక కొత్త సేవను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. కొత్త కాడర్ సృష్టి, స్వరూపంలో మార్పు లు సంస్థను పటిష్టపరచడమొక్కటే కాక “స్టార్ట్ అప్ ఇండియా”, “స్టాండ్- అప్ ఇండియా” ఇంకా “మేక్ ఇన్ ఇండియా” లతో కూడిన విజన్ ను సాకారం చేసుకోవడానికి తోడ్పడగలుగుతాయి.

ఈ చర్య సంస్థ యొక్క సామర్థ్యాన్ని, నిపుణతను అధికం చేయగలదు. అంతేకాకుండా అంకిత భావం కలిగిన, శ్రద్ధాళువులైన సాంకేతిక అధికారుల శ్రేణి సహాయంతో ఎమ్ఎస్ఎమ్ఇ రంగం వృద్ధిని సాధించడంలో తోడ్పడగలదు కూడా.

***