భారత ప్రభుత్వగృహనిర్మాణ , అర్బన్ వ్యవహారాలమంత్రిత్వశాఖకు, మాల్దీవుల ప్రభుత్వానికి చెందిన జాతీయ ప్రణాళిక, గృహనిర్మాణం, మౌలిక సదుపాయాల మంత్రిత్వశాఖకుమధ్య సంతకాలు జరిగిన అవగాహనా ఒప్పందాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర కేబినెట్ ముందుంచడం జరిగింది.ఇది సుస్థిర నగరాభివృద్ధి రంగంలో పరస్పర సహకారానికి సంబంధించినది.
ఈ అవగాహనా ఒప్పందంపై 2021 ఫిబ్రవరి లో సంతకాలు జరిగాయి.
ఈ సహకారానికి సంబంధించిన కార్యక్రమాన్ని అమలు చేసేందుకు , ఇందుకు సంబంధించిన వ్యూహాన్నిరూపొందించేందుకు ఒక సంయుక్త వర్కింగ్ గ్రూప్ (జెడబ్ల్యుజి)ని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ సంయుక్త వర్కింగ్ గ్రూప్ ఏడాదికి ఒక సారి సమావేశమౌతుంది. ఒకసారి మాల్దీవులలో మరోసారి ఇండియాలో ఇలా ఇది సమావేశమౌతుంది.
ప్రయోజనాలు :
ఈ అవగాహనా ఒప్పందం బలమైన, లోతైన , దీర్ఘకాలిక ద్వైపాక్షిక సహకారాన్ని సుస్థిర నగర అభివృద్ధి విషయంలో ఇండియా , మాల్దీవుల మధ్య ఏర్పరుస్తుంది. ఈ అవగాహనా ఒప్పందం సుస్థిర నగరాభివృద్ధఙ, నగర ప్రణాళిక, స్మార్ట్ సిటీల అభివృద్ధి, ఘన వ్యర్ధాల నిర్వహణ, చవక ధరలో గృహాల అందుబాటు, అర్బన్ గ్రీన్ మొబిలిటి, అర్బన్ మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్టు, స్మార్ట్ సిటీ అభివృద్ధి రంగాలలో ఉపాధి కల్పించగలదని భావిస్తున్నారు.
వివరాలు:
ఈ ఎం.ఒ.యు, ఇరుదేశాల మధ్య ఒప్పందంపై సంతకాలు జరిగిన 2021 ఫిబ్రవరి నుంచి అమలులోకి వచ్చినట్టు భావిస్తారు. ఇది నిరంతరాయంగా కొనసాగనుంది.
ఈ అవగాహనా ఒప్పందం లక్ష్యం, ఇండియా -మాల్దీవుల మధ్య సుస్థిర నగరాభివృద్ధి,నగర ప్రణాళఙక, స్మార్ట్ సిటీ అభివృద్ధి, ఘనవ్యర్థాల నిర్వహణ, చౌక గృహనిర్మాణం, అర్బన్ గ్రీన్ మొబిలిటి, అర్బన్ మాస్ రాపిడ్ ట్రాన్స్‌పోర్టు,స్మార్ట్ సిటీల అభివృద్ధి ఇంకా ఇరు దేశాల మధ్య అంగీకరించిన ఇతర అంశాలకు సంబంధించచిన రంగాలలో సాంకేతికసహకారాన్నిబలోపేతం చేయడం.
***