తెలంగాణ లోని నిజామాబాద్ లో విద్యుత్తు, రైలు మరియు ఆరోగ్యం వంటి ముఖ్య రంగాల లో 8,000 కోట్ల రూపాయల కు పైగా విలువ కలిగిన అనేక అభివృద్ధి ప్రాజెక్టుల కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు న శంకుస్థాపన చేయడంతో పాటు దేశ ప్రజల కు అంకితమిచ్చారు. ఈ ప్రాజెక్టుల లో ఎన్ టిపిసి కి చెందిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు లో భాగం అయిన 800 మెగావాట్ సామర్థ్యం కలిగిన ఒకటో దశ యూనిట్, మనోహరాబాద్ ను మరియు సిద్దిపేట్ ను కలిపే క్రొత్త రేల్ వే లైన్; ధర్మాబాద్ – మనోహరాబాద్ – మరియు మహబూబ్ నగర్ – కర్నూల్ మధ్య విద్యుదీకరణ పథకం వంటి రైలు ప్రాజెక్టు లు భాగం గా ఉన్నాయి. ప్రధాన మంత్రి – ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ లో భాగం గా రాష్ట్రం లో వివిధ చోట్ల నిర్మాణం కానున్న 20 క్రిటికల్ కేయర్ బ్లాక్స్ (సిసిబి స్) కు ఆయన శంకుస్థాపన చేశారు. శ్రీ నరేంద్ర మోదీ సిద్దిపేట్ – సికందరాబాద్ – సిద్దిపేట్ రైలు సర్వీసు కు కూడా ప్రారంభ సూచక పచ్చజెండా ను చూపెట్టారు.
జన సమూహాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఈ రోజు న మొదలుపెట్టుకొన్న ప్రాజెక్టుల కు గాను తెలంగాణ ప్రజల కు అభినందనల ను తెలియజేశారు. ఏ దేశం యొక్క లేదా ఏ రాష్ట్రం యొక్క అభివృద్ధి అయినా విద్యుచ్ఛక్తి ఉత్పాదన సంబంధి ఆత్మనిర్భరత సామర్థ్యం పైన ఆధారపడుతుంది. ఎందుకంటే అది ఉన్నప్పుడు జీవించడం లో సౌలభ్యం మరియు వ్యాపారం చేయడం లో సౌలభ్యం ఏక కాలం లో మెరుగు పడతాయి కాబట్టి అని ఆయన వివరించారు. ‘‘విద్యుచ్ఛక్తి సరఫరా సాపీ గా సాగితే ఆ పరిణామం ఏ రాష్ట్రం లోనైనా పరిశ్రమల వృద్ధి కి వేగాన్ని అందిస్తుంది’’ అని ప్రధాన మంత్రి వ్యాఖ్యానించారు. పెద్దపల్లి జిల్లా లో ఎన్ టిపిసి కి సంబంధించిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు యొక్క 800 మెగావాట్ యూనిట్ సామర్థ్యం కలిగిన ఒకటో దశ ను ఆయన దేశ ప్రజల కు అంకితం చేశారు. అతి త్వరలోనే రెండో యూనిట్ సైతం పని చేయడం మొదలవుతుంది అని ఆయన స్పష్టం చేశారు. ఆ యూనిట్ నిర్మాణం పూర్తి అయింది అంటే గనుక విద్యుత్తు ప్లాంటు యొక్క స్థాపిత సామర్థ్యం 4,000 మెగా వాట్ స్థాయి కి పెరుగుతుంది అని ఆయన తెలిపారు. దేశం లో ఎన్ టిపిసి కి ఉన్న విద్యుత్తు ప్లాంటు లు అన్నింటి లోకి అత్యంత ఆధునికమైన విద్యుత్తు ప్లాంటు తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్ యే కావడం పట్ల ఆయన సంతోషాన్ని ప్రకటించారు. ‘‘ఈ పవర్ ప్లాంటు లో ఉత్పత్తి అయ్యే విద్యుత్తు లో పెద్ద భాగం తెలంగాణ ప్రజల కు దక్కుతుంది’’ అని ప్రధాన మంత్రి అన్నారు. పునాదిరాళ్ళు వేసిన ప్రాజెక్టుల ను పూర్తి చేయాలన్న కేంద్ర ప్రభుత్వం యొక్క ప్రవృత్తి ని ఆయన ఈ సందర్భం లో నొక్కిచెప్పారు. ఈ ప్రాజెక్టు కు 2016 వ సంవత్సరం లో శంకుస్థాపన జరిగిన సంగతి ని ఆయన గుర్తు కు తీసుకు వస్తూ, దీనిని ఈ రోజు న ప్రారంభిస్తున్నందుకు కృతజ్ఞత ను వ్యక్తంచేశారు. ‘‘ఇది మా ప్రభుత్వం యొక్క సరిక్రొత్త శ్రమ సంస్కృతి’’ అని ఆయన అన్నారు.
తెలంగాణ యొక్క శక్తి అవసరాల ను తీర్చడం కోసం ప్రభుత్వం కృషి చేస్తోంది అని ప్రధాన మంత్రి అన్నారు. హసన్ – చర్లపల్లి గొట్టపు మార్గాన్ని ఇటీవలె దేశ ప్రజల కు అంకితం చేసిన సంగతి ని ఆయన గుర్తు కు తీసుకు వచ్చారు. ‘‘ఈ గొట్టపు మార్గం తక్కువ ఖర్చు లో, పర్యావరణాని కి మిత్రపూర్వకమైన పద్ధతి లో ఎల్ పిజి రవాణా కు మరియు పంపిణీ కి ఆధారం కానున్నది’’ అని ఆయన అన్నారు.
ధర్మాబాద్ – మనోహరాబాద్ మరియు మహబూబ్ నగర్ – కర్నూలు ల మధ్య విద్యుదీకరణ పథకాల ను గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, అవి రెండు రైళ్ళ సరాసరి వేగాన్ని పెంచడం తో పాటుగా రాష్ట్రం లో కనెక్టివిటీ ని కూడా పెంపొందింపచేస్తాయి అని వివరించారు. ‘‘రైలు మార్గాలన్నింటి లోను వంద శాతం విద్యుదీకరణ ను సాధించాలనే లక్ష్యం దిశ లో భారతీయ రేల్ వే లు పయనిస్తోంది’’ అని ఆయన అన్నారు. మనోహరాబాద్ మరియు సిద్దిపేట్ మధ్య క్రొత్త రైలు లింకు అటు పరిశ్రమ , ఇటు వ్యాపారం ల వృద్ధి కి తోడ్పడుతుంది అని ఆయన అన్నారు. ఈ ప్రాజెక్టు కు 2016 వ సంవత్సరం లో శంకుస్థాపన చేయడాన్ని ప్రధాన మంత్రి జ్ఞప్తి కి తెచ్చుకొన్నారు.
ఆరోగ్య సంరక్షణ అనేది మునుపు ఏ కొద్ది మందికో చెందింది గా ఎలా ఉండిందీ ప్రధాన మంత్రి గుర్తు చేశారు. ఆరోగ్య సంబంధి సేవల ను అందరికీ అందుబాటు లో ఉండేటట్లుగాను, అలాగే సంబంధిత ఖర్చులను అందరూ భరించగలిగే స్థాయి లో ఉండేటట్లు గాను తీసుకొన్న అనేక చర్యల ను గురించి శ్రీ నరేంద్ర మోదీ వివరించారు. బీబీనగర్ లో ఒక ఎఐఐఎమ్ఎస్ సహా ఎఐఐఎమ్ఎస్ లు మరియు వైద్య కళాశాల ల సంఖ్య లు వృద్ధి చెందుతూ ఉండడాన్ని గురించి ఆయన మాట్లాడారు. అదే కాలం లో వైద్యుల సంఖ్య ను పెంచడమైందని ఆయన వివరించారు.
ప్రతి ఒక్క జిల్లా లో మౌలిక సదుపాయాల నాణ్యత విషయం లో పూచీ పడడం కోసం పిఎమ్ ఆయుష్మాన్ భారత్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ ను తీసుకు రావడం జరిగింది అని ప్రధాన మంత్రి వెల్లడించారు. ఈ రోజు న ఈ మిశన్ లో భాగం గా తెలంగాణ లో 20 క్రిటికల్ కేయర్ బ్లాకుల కు శంకుస్థాపన చేయడమైంది అని ప్రధాన మంత్రి తెలిపారు. ఈ బ్లాకుల ను ఏ విధం గా తీర్చిదిద్దడం జరుగుతుంది అంటే వాటిలో ప్రత్యేకమైన ఐసలేశన్ వార్డులు, ఆక్సిజన్ సరఫరా మరియు సంక్రమణ నిరోధానికి, ఇంకా సంక్రమణ నియంత్రణ కు సంబంధించిన పూర్తి ఏర్పాటు లు ఉంటాయి అని ఆయన వివరించారు. ‘‘తెలంగాణ లో ఆరోగ్య సదుపాయాల ను పెంచడం కోసం ఇప్పటికే 5,000కు పైగా ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఎండ్ వెల్ నెస్ సెంటర్ లు పనిచేస్తున్నాయి. కోవిడ్ మహమ్మారి వ్యాప్తి చెందిన కాలం లో తెలంగాణ లో 50 పెద్ద పిఎస్ఎ ఆక్సిజన్ ప్లాంటుల ను ఏర్పాటు చేయడమైంది. అవి ప్రజల యొక్క అమూల్యమైనటువంటి ప్రాణాల ను కాపాడడం లో కీలకమైన పాత్ర ను పోషించాయి’’ అని ప్రధాన మంత్రి తెలిపారు. విద్యుత్తు, రైలు మార్గాలు మరియు ఆరోగ్యం ల వంటి ముఖ్య రంగాల లో ఈ రోజు న ఆరంభించుకొన్న ప్రాజెక్టుల కు గాను ప్రజల కు అభినందనల ను తెలియజేస్తూ ఆయన తన ప్రసంగాన్ని ముగించారు.
ఈ కార్యక్రమం లో తెలంగాణ గవర్నరు డాక్టర్ తమిళిసై సౌందరరాజన్ గారు మరియు కేంద్ర మంత్రి శ్రీ జి. కిషన్ రెడ్డి తదితరులు పాలుపంచుకొన్నారు.
పూర్వరంగం
దేశం లో మెరుగైన ఇంధన సామర్థ్యం తో విద్యుత్తు ఉత్పత్తి ని పెంచాలనే ప్రధాన మంత్రి దార్శనికత కు అనుగుణం గా, ఎన్ టిపిసి కి చెందిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ ప్రాజెక్టు యొక్క ఒకటో దశ లో 800 మెగావాట్ సామర్థ్యం కలిగిఉండేటటువంటి యూనిట్ ను దేశ ప్రజల కు అంకితం చేయడమైంది. ఇది తెలంగాణ కు విద్యుత్తు ను తక్కువ ధర కు అందించడంతో పాటుగా రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి కి జోరు ను కూడా ఇవ్వనుంది. దేశం లో అత్యంత పర్యావరణ అనుకూలమైన పవర్ స్టేశన్ లలో ఒకటి గా కూడాను ఇది ఉంటుంది.
మనోహరాబాద్ ను మరియు సిద్దిపేట్ ను కలుపుతూ కొత్త రైల్వే లైన్ తో సహా ధర్మాబాద్ – మనోహరాబాద్ మరియు మహబూబ్ నగర్ – కర్నూలు మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టు వల్ల తెలంగాణ రైల్ వే సంబంధి మౌలిక సదుపాయాలు పెరగనున్నాయి; 76 కిలోమీటర్ ల పొడవైన మనోహరాబాద్ – సిద్దిపేట్ రైలు మార్గం ఈ ప్రాంతం యొక్క సామాజిక- ఆర్థిక అభివృద్ధి కి, ముఖ్యం గా మెదక్, సిద్దిపేట జిల్లాల లో అభివృద్ధి కి తోడ్పడుతుంది. ధర్మాబాద్-మనోహరాబాద్ మరియు మహబూబ్‌నగర్-కర్నూల్ మధ్య విద్యుదీకరణ ప్రాజెక్టు రైళ్ళ సగటు వేగాన్ని మెరుగు పరచడాని కి సహాయ పడుతుంది. ఈ ప్రాంతం లో పర్యావరణ అనుకూలమైనటువంటి రైలు రవాణా కు దోహదం చేస్తుంది. సిద్దిపేట్ – సికందరాబాద్ – సిద్దిపేట్ రైలు సర్వీసు ను కూడా ప్రధాన మంత్రి పచ్చ జెండా ను చూపి, ప్రారంభించారు. ఈ రైలు ఈ ప్రాంతం రైలు ప్రయాణికుల కు ప్రయోజనాన్ని చేకూర్చగలదు.
తెలంగాణ లో ఆరోగ్య రంగ మౌలిక సదుపాయాల ను పెంపొందింపచేసే ప్రయత్నం లో భాగం గా ప్రధాన మంత్రి – ఆయుష్మాన్ భారత్ హెల్థ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ మిశన్ పరిధి లో రాష్ట్రవ్యాప్తం గా 20 క్రిటికల్ కేయర్ బ్లాక్స్ (సిసిబి స్) కు ప్రధాన మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సిసిబి స్ ను ఆదిలాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, జయశంకర్ భూపాలపల్లి, జోగులాంబ గద్వాల్, హైదరాబాద్, ఖమ్మం, కుమురం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, మహబూబ్ నగర్ (బాదేపల్లి), ములుగు, నాగర్ కర్నూల్, నల్గొండ, నారాయణపేట, నిర్మల్, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి (మహేశ్వరం), సూర్యాపేట, పెద్దపల్లి, వికారాబాద్ మరియు వరంగల్ (నర్సంపేట) జిల్లాల లో నిర్మించనున్నారు. ఈ సిసిబి స్ రాష్ట్ర ప్రజల కు ప్రయోజనం చేకూర్చే విధం గాను మరియు తెలంగాణ అంతటాను జిల్లా స్థాయి క్రిటికల్ కేయర్ సంబంధి మౌలిక సదుపాయాల ను పెంచుతాయి.
Launching projects from Nizamabad which will give fillip to the power and connectivity sectors as well as augment healthcare infrastructure across Telangana. https://t.co/iPLmwMQC9Y
— Narendra Modi (@narendramodi) October 3, 2023
*****
DS/TS
Launching projects from Nizamabad which will give fillip to the power and connectivity sectors as well as augment healthcare infrastructure across Telangana. https://t.co/iPLmwMQC9Y
— Narendra Modi (@narendramodi) October 3, 2023