Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుబ్రమణ్య భారతి ని స్మరించుకొన్న ప్రధాన మంత్రి


సుబ్రమణ్య భారతి ని ఆయన జయంతి నాడు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ స్మరించుకొన్నారు.

‘‘మహానుభావుడు సుబ్రమణ్య భారతి ని ఆయన జయంతి నాడు జ్ఞప్తి కి తెచ్చుకొంటున్నాను. మహాకవి భారతియర్ గా ఆదరింపబడుతున్నటువంటి ఆయన కవి శ్రేష్ఠుని గానే కాక దేశ భక్తి, సంఘ సంస్కరణ లకు ప్రతీక గా కూడా నిలచారు; అంతేకాదు, నిర్భయత్వానికి మరియు అజేయమైనటువంటి స్వతంత్రతా స్ఫూర్తి కి ఆయన ఒక మారు పేరు. ఆయన యొక్క ఆలోచన లు మరియు రచన లు మనకు సదా ప్రేరణ ను అందిస్తూ ఉంటాయి.

సుబ్రమణ్య భారతి న్యాయాన్ని మరియు సమానత్వాన్ని మిగిలిన అన్నిటి కన్న మిన్న అయినటువంటివి అని నమ్మారు. ఆయన ఒక సారి ‘ఏ ఒక్క వ్యక్తి ఆకలి తో నకనకలాడినా, యావత్తు ప్రపంచాన్ని మనం నాశనం చేసేద్దాము’ అన్నారు. ఈ మాట లు చాలు మానవుల ఇడుముల ను బాపే దిశగాను, సాధికారిత కల్పన ను ముందుకు తీసుకుపోయే దిశ గాను ఆయన యొక్క దార్శనికత ను గురించి తెలుసుకోవడానికి’’ అని ఒక సందేశం లో ప్రధాన మంత్రి పేర్కొన్నారు.