Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకులు శ్రీ తులసి తంతి కన్నుమూత‌పై ప్రధానమంత్రి సంతాపం


ప్రముఖ వ్యాపారవేత్త, సుజ్లాన్ ఎనర్జీ వ్యవస్థాపకుడు శ్రీ తులసి తంతి మృతిపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రగాఢ సంతాపం వెలిబుచ్చారు.

ఈ మేరకు ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“శ్రీ తులసి తంతి భారతదేశ ఆర్థిక పురోగతికి దోహదపడిన ఒక మార్గదర్శక వ్యాపార దిగ్గజం. దేశం సుస్థిర ప్రగతి సాధించే దిశగా సాగుతున్న కృషిని మరింత బలోపేతం చేశారు. ఆయన అకాల మరణం నన్నెంతో బాధించింది. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబసభ్యులకు, బంధుమిత్రులకు సంతాపం, సానుభూతి తెలియజేస్తున్నాను… ఓం శాంతి.” అని ప్రధాని పేర్కొన్నారు.