Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుజుకీమోటర్ కార్పొరేశన్ సీనియర్ సలహాదారు శ్రీ ఒసాము సుజుకీ తో సమావేశమైన ప్రధాన మంత్రి

సుజుకీమోటర్ కార్పొరేశన్ సీనియర్ సలహాదారు శ్రీ ఒసాము సుజుకీ తో సమావేశమైన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సుజుకీ మోటర్ కార్పొరేశన్ సీనియర్ సలహాదారు శ్రీ ఒసాము సుజుకీ తో టోక్యో లో ఈ రోజు న సమావేశమయ్యారు. ఈ సమావేశం కొనసాగిన క్రమం లో, భారతదేశం లో శ్రీ సుజుకీ అందించిన సహకారాన్ని మరియు తోడ్పాటు ను గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, భారతదేశం లో మోటారు వాహనాల పరిశ్రమ లో సుజుకీ మోటర్స్ పోషించిన పరివర్తనకారి పాత్ర ను ప్రశంసించారు. ఆటోమొబైల్ మరియు కంపోనంట్ రంగం లో ఉత్పత్తి తో ముడిపెట్టిన ప్రోత్సాహకాల (పిఎల్ఐ) పథకం లో భాగం గా ఆమోదం తెలియజేసిన దరఖాస్తుదారు కంపెనీల లో సుజుకీ మోటర్ గుజరాత్ ప్రైవేట్ లిమిటెడ్ మరియు మారుతీ సుజుకీ ఇండియా లిమిటెడ్ లు ఉండడం పట్ల వారు హర్షాన్ని వ్యక్తం చేశారు.

వారు నిలకడతనంతో కూడినటువంటి వృద్ధి లక్ష్యాన్ని సాధించడం కోసం రిసైక్లింగ్ సెంటర్స్ తో పాటు గా ఎలక్ట్రిక్ వెహికల్స్ మరియు బాటరీ ల కై ఉత్పత్తి సదుపాయాల ను ఏర్పాటు చేయడం సహా భారతదేశం లో ఉన్న పెట్టుబడి అవకాశాలను గురించి సైతం సమాలోచనలు జరిపారు. వారు జపాన్ఇండియా ఇన్ స్టిట్యూట్స్ ఆఫ్ మేన్యుఫాక్చరింగ్ (జెఐఎమ్) మరియు జాపనీస్ ఎండోడ్ కోర్సెజ్ (జెఇసి) మాధ్యమం ద్వారా నైపుణ్యాభివృద్ధి సహా భారతదేశం లో స్థానిక నూతన ఆవిష్కరణ వ్యవస్థ ను నిర్మించడానికి సంబంధించిన వ్యూహాల ను గురించి కూడా చర్చించారు.

***