Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సుగమ్య భారత్ అభియాన్‌కు 9 ఏళ్ళు: ప్రధానమంత్రి


సుగమ్య భారత్ అభియాన్‌ ను ప్రారంభించి నేటికి 9 సంవత్సరాలయ్యిందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దివ్యాంగ సోదరీమణులకు, సోదరులకు సేవల లభ్యత, సమానత్వంతోపాటు అవకాశాలను మరింత పెంచడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పునరుద్ఘాటించారు. దివ్యాంగ సోదరీమణులు, సోదరులు చాటుతున్న మనస్థైర్యం, వారు సాధిస్తున్న విజయాలను శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసిస్తూ అవి మనమందరం గర్వపడేటట్లుగా ఉన్నాయన్నారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో MyGovIndia తోపాటు Modi Archive హేండిళ్ళు పొందుపరచిన కొన్ని సందేశాలకు శ్రీ నరేంద్ర మోదీ ప్రతిస్పందిస్తూ ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘ఈ రోజు మనం #9YearsOfSugamyaBharat పూర్తయిన సందర్భాన్ని గుర్తుకు తెచ్చుకొంటున్నాం. మన దివ్యాంగ సోదరీమణులకు, సోదరులకు సేవల లభ్యతను, సమానత్వాన్ని, అవకాశాలను మరింత పెంచాలన్న మన నిబద్ధతను ఈ సందర్భంగా పునరుద్ఘాటించుదాం’’.

‘‘మన దివ్యాంగ సోదరీమణులు, సోదరుల మనోనిబ్బరం, వారు సాధిస్తున్న విజయాలు మనం గర్వపడేటట్లుగా ఉన్నాయి. దీనికి చాలా చైతన్యభరిత ఉదాహరణ పారాలింపిక్స్‌లో భారత్ సాధించిన విజయాలే. ఇది దివ్యాంగజనులకున్న ‘మేము సైతం సాధించగలం’ అనే భావనను చాటిచెబుతోంది. #9YearsOfSugamyaBharat

 

‘‘నిజంగా ఇదొక మరపురాని జ్ఞాపకం. #9YearsOfSugamyaBharat

‘‘దివ్యాంగ జనుల హక్కుల చట్టం2016ను చరిత్రాత్మకమైన రీతిన ఆమోద ముద్ర వేయడం దివ్యాంగ జనులకు సాధికారితను కల్పించాలన్న మా నిబద్ధత ను సుస్పష్టంగా తెలియజేస్తోంది. #9YearsOfSugamyaBharat