Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్ర ప్రారంభ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం

సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్ర  ప్రారంభ వేడుకలో ప్రధానమంత్రి ప్రసంగం


 గౌరవనీయ పెడ్రో సాంచెజ్గుజరాత్ గవర్నర్ ఆచార్య దేవవ్రత్ జీభారత రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ జీవిదేశాంగ మంత్రి శ్రీ ఎస్జైశంకర్ జీగుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్రభాయ్ పటేల్స్పెయిన్రాష్ట్ర ప్రభుత్వాల మంత్రులుఎయిర్‌బస్టాటా బృందాల సభ్యులుసోదరసోదరీమణులారా!

నమస్కారం!

బ్యూనస్ దియాస్ (శుభోదయం)!

నా మిత్రులు శ్రీ పెడ్రో సాంచెజ్ మొదటిసారిగా భారత్‌లో పర్యటిస్తున్నారునేటి నుండిభారత్స్పెయిన్ మధ్య భాగస్వామ్యాన్ని సరికొత్త మార్గంలో ముందుకు తీసుకెళుతున్నాంసీ-295 ట్రాన్స్‌పోర్ట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కేంద్రాన్ని మనం ప్రారంభించుకుంటున్నాంఈ తయారీ కేంద్రం కేవలం భారత్స్పెయిన్ సంబంధాలను మాత్రమే కాకుండామేకిన్ ఇండియామేక్ ఫర్ ది వరల్డ్’ అనే మా మిషన్‌ను సైతం బలోపేతం చేస్తుందిఎయిర్‌బస్టాటా బృందాల్లోని సభ్యులందరికీ నా శుభాకాంక్షలుఇటీవల భారత్ ముద్దుబిడ్డ రతన్ టాటాను కోల్పోయిందిఆయన జీవించి ఉంటే.. నేడు ఇక్కడ మన మధ్యే ఉండేవారుఎక్కడ ఉన్నా ఆయన దీనిని చూసి తప్పకుండా సంతోషిస్తారు.

మిత్రులారా,

సీ-295 ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం భారతదేశపు కొత్త పని సంస్కృతిని ప్రతిబింబిస్తుందిఆలోచన నుంచి అమలు వరకు.. ఈ రోజు భారత్ పనిచేస్తున్న వేగం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తోంది. ఈ తయారీ కేంద్ర నిర్మాణాన్ని రెండేళ్ల కిందట అక్టోబరు నెలలో ప్రారంభించాంఅలాగే ఇప్పుడు అక్టోబరులోనే ఇక్కడ విమానాల తయారీకి అంతా సిద్ధమైందిప్రణాళికఅమలులో అనవసర జాప్యాలను నివారించడంపై నేను ఎప్పుడూ దృష్టి సారించానునేను గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో వడోదరలో బొంబార్డియర్ రైలు కోచ్‌ల తయారీ కర్మాగారాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నాంఆ తయారీ కేంద్రాన్ని సైతం రికార్డు సమయంలో ఉత్పత్తి కోసం సిద్ధం చేశాంనేడు ఆ ఫ్యాక్టరీలో తయారైన మెట్రో కోచ్‌లను ఇతర దేశాలకు ఎగుమతి చేస్తున్నాంఅలాగే ఈ తయారీ కేంద్రంలో తయారైన విమానాలు కూడా భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా ఎగుమతి అవుతాయని నేను విశ్వసిస్తున్నాను.

 

 

మిత్రులారా,

ప్రముఖ స్పానిష్ కవి ఆంటానియో మచాడో ఒక సందర్భంలో ఇలా అన్నారు:

ఓ బాటసారీఅక్కడ మార్గమేదీ లేదు… నడక ద్వారానే మార్గం తయారైంది

మన లక్ష్యం వైపు మనం మొదటి అడుగు వేసిన క్షణంమార్గాలు ఏర్పడడం ప్రారంభమవుతాయని ఇది సూచిస్తుందినేడుభారత్ రక్షణ సంబంధ తయారీ రంగం కొత్త శిఖరాలకు చేరుకుంటోందిఒక దశాబ్దం క్రితం మనం పటిష్ఠమైన చర్యలు చేపట్టడం వల్లేఈ రోజు ఇది సాధ్యమైందిఅప్పట్లో భారత్‌లో పెద్ద ఎత్తున రక్షణ తయారీని ఎవరూ ఊహించలేదుఅప్పుడు ప్రాధాన్యాలుగుర్తింపు దిగుమతులకే పరిమితం అయ్యాయిమేం మాత్రం కొత్త మార్గాన్ని ఎంచుకునికొత్త లక్ష్యాలను నిర్దేశించుకున్నాం. వాటి ఫలితాలను  ఈ రోజు మనం చూడగలుగుతున్నాం.

మిత్రులారా,

ఏదైనా అవకాశాన్ని శ్రేయస్సుగా మార్చడానికిసరైన ప్రణాళికసరైన భాగస్వామ్యం అవసరంమార్పు చెందిన భార రక్షణ రంగ అభివృద్ధి… సరైన ప్రణాళికసరైన భాగస్వామ్యానికి చక్కటి ఉదాహరణగత దశాబ్దంలోభారత్‌లో శక్తిమంతమైన రక్షణ రంగాన్ని ప్రోత్సహించే నిర్ణయాలను దేశం తీసుకుందిమేం రక్షణ తయారీలో ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని విస్తరించాంప్రభుత్వ రంగ విభాగాలను సమర్థంగా మార్చాం. ఆయుధ కర్మాగారాలను ఏడు పెద్ద కంపెనీలుగా మార్చాం. డీఆర్డీవోహెచ్ఏఎల్‌లకు సాధికారత కల్పించాంఅలాగే ఉత్తర్ ప్రదేశ్తమిళనాడుల్లో రెండు ప్రధాన రక్షణ కారిడార్లను అభివృద్ధి చేశాంఈ కార్యక్రమాలు రక్షణ రంగానికి కొత్త శక్తిని అందించాయిఐడీఈఎక్స్ (ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్వంటి పథకాలు అంకుర సంస్థలకు ఊతమిచ్చాయిగత 5-6 సంవత్సరాల్లో భారత్‌లో దాదాపు 1,000 కొత్త రక్షణ రంగ అంకుర సంస్థలు ఏర్పాటయ్యాయిగత పదేళ్లలో భారత్‌ రక్షణ ఎగుమతులు 30 రెట్లు పెరిగాయినేడుమేం ప్రపంచంలోని 100 దేశాలకు రక్షణ పరికరాలను ఎగుమతి చేస్తున్నాం.

మిత్రులారా,

 ఈ రోజు మేం భారత్‌లో నైపుణ్యాలుఉద్యోగాల కల్పనపై ఎక్కువగా దృష్టి పెడుతున్నాంఎయిర్‌బస్టాటాల సంయుక్త నిర్వహణలో ఈ కర్మాగారం భారత్‌లో వేలాది ఉద్యోగాలను కూడా సృష్టిస్తుందిఈ ప్రాజెక్ట్ కారణంగా 18 వేల విమాన విడిభాగాలను దేశీయంగా తయారు చేయనున్నాంఒక భాగం దేశంలోని ఒక ప్రాంతంలో తయారైతేమరో భాగం మరో చోట తయారు చేయవచ్చుఅయితే ఈ భాగాలను ఎవరు తయారు చేస్తారుమా సూక్ష్మచిన్నమధ్యతరహా పారిశ్రామిక సంస్థల (ఎమ్ఎస్ఎమ్ఈలునాయకత్వంలో ఈ  విడిభాగాలు తయారు కానున్నాయిమేం ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా ప్రధాన విమాన కంపెనీలకు విడిభాగాల అతిపెద్ద సరఫరాదారుల్లో ఒకరిగా ఉన్నాంఈ కొత్త ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం భారత్‌లో కొత్త నైపుణ్యాలుకొత్త పరిశ్రమలకు ఊతం ఇస్తుంది.

మిత్రులారా,

కేవలం రవాణా విమానాల తయారీని మించినదిగా ఈ కార్యక్రమాన్ని నేను చూస్తున్నానుగత దశాబ్దంలోమీరు భారత విమానయాన రంగంలో అపూర్వమైన వృద్ధినిమార్పును చూశారుదేశవ్యాప్తంగా వందలాది చిన్న నగరాలను అనుసంధానిస్తూ విమానయానాన్ని విస్తరిస్తున్నాంవిమానయానంఎమ్ఆర్వో (మెయింటెనెన్స్రిపేర్ఓవర్‌హాల్కేంద్రంగా భారత్‌ను నిలిపేందుకు మేం కృషి చేస్తున్నాంఇది భవిష్యత్తులో మేడ్ ఇన్ ఇండియా‘ పౌర విమానాలకు మార్గాన్ని సుగమం చేస్తుందివివిధ భారత విమానయాన సంస్థలు 1,200 కొత్త విమానాల కోసం ఆర్డర్లు ఇచ్చిన విషయం మీకు తెలిసే ఉంటుందిఅంటే భవిష్యత్తులోఈ తయారీ కేంద్రం భారత్‌తో పాటు ప్రపంచ అవసరాలను తీర్చేందుకు పౌర విమానాల రూపకల్పనతయారీలో కీలకం కానుంది.

మిత్రులారా,

భారత్ చేస్తున్న ఈ ప్రయత్నాల్లో వడోదర నగరం ఉత్ప్రేరకంగా పనిచేస్తోందిఈ నగరం ఇప్పటికే ఎమ్ఎస్ఎమ్ఈల కోసం బలమైన కేంద్రంగా ఉంది. అలాగే గతి శక్తి విశ్వవిద్యాలయం కూడా ఇక్కడ ఉందిఈ విశ్వవిద్యాలయం వివిధ రంగాల నిపుణులను సిద్ధం చేస్తోందిఫార్మా రంగంఇంజనీరింగ్భారీ యంత్రాలురసాయనాలుపెట్రోకెమికల్స్విద్యుత్ఇంధన పరికరాలకు సంబంధించిన అనేక కంపెనీలు వడోదరలో ఉన్నాయిఇప్పుడుఈ ప్రాంతమంతా భారత్‌లో విమానాల తయారీకి ప్రధాన కేంద్రంగా మారనుందిఆధునిక పారిశ్రామిక విధానాలునిర్ణయాలతో ముందుకు సాగుతున్న గుజరాత్ ప్రభుత్వాన్నిముఖ్యమంత్రి భూపేంద్ర భాయ్ అలాగే అతని మొత్తం బృందాన్ని నేను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

వడోదరకు మరో ప్రత్యేకత కూడా ఉందిభారత్‌లో వారసత్వ నగరంగాఒక ముఖ్యమైన సాంస్కృతిక నగరంగా ఉందిఅందువల్ల స్పెయిన్ నుంచి మీ అందరినీ ఇక్కడికి స్వాగతించడం నాకు సంతోషంగా ఉందిభారత్స్పెయిన్ సాంస్కృతిక సంబంధాలకు ప్రత్యేక ప్రాముఖ్యం ఉందిస్పెయిన్ నుంచి వచ్చి గుజరాత్‌లో స్థిరపడిన ఫాదర్ కార్లోస్ వాలెస్ తన యాభై ఏళ్ల జీవితం ఇక్కడే గడిపి, తన ఆలోచనలురచనల ద్వారా మన సంస్కృతిని సుసంపన్నం చేసిన విషయం నాకు గుర్తుందిఆయన్ని అనేకసార్లు కలుసుకోవడం నా అదృష్టంఆయన చేసిన విశేష సేవలకుగాను మేం ఆయనను పద్మశ్రీ పురస్కారంతో గౌరవించుకున్నాంగుజరాత్‌లోమేం అతనిని ప్రేమగా ఫాదర్ వాలెస్ అని పిలిచేవాళ్లంఆయన గుజరాతీలో రచనలు చేసేవారుఅతని పుస్తకాలు గుజరాతీ సాహిత్యాన్నిమన సాంస్కృతిక వారసత్వాన్ని సుసంపన్నం చేశాయి.

మిత్రులారా,

స్పెయిన్‌లో యోగా బాగా ప్రాచుర్యం పొందిందని నేను విన్నానుభారత అభిమానులు కూడా స్పెయిన్ ఫుట్‌బాల్‌ను ఆరాధిస్తారురియల్ మాడ్రిడ్బార్సిలోనా మధ్య నిన్న జరిగిన మ్యాచ్ భారత్‌లో విస్తృతంగా చర్చనీయాంశమైందిబార్సిలోనా అద్భుతమైన విజయం గురించి కూడా ఇక్కడ విస్తృత చర్చ జరిగిందిభారత్‌లోని రెండు క్లబ్బుల అభిమానులు స్పెయిన్‌ ప్రజల్లాగే అత్యంత అభిరుచితో ఆటనను ఆస్వాదిస్తారని నేను కచ్చితంగా చెప్పగలను.

మిత్రులారా,

ఆహారంచలనచిత్రాలుఫుట్‌బాల్ఈ అంశాలన్నీ మన ఇరు దేశాల ప్రజల మధ్య బలమైన సంబంధాల్లో భాగంగా ఉన్నాయి. 2026 సంవత్సరాన్ని భారత్స్పెయిన్ సంస్కృతిపర్యాటకంఏఐ సంవత్సరంగా జరుపుకోవాలని ఇరు దేశాలు నిర్ణయించడం నాకు సంతోషం కలిగించింది.

మిత్రులారా,

భారత్స్పెయిన్ భాగస్వామ్యం ఒక పట్టకం (ప్రిజం) లాంటిదిఇది బహుమితీయమైనదిశక్తిమంతమైనది అలాగే నిరంతరం అభివృద్ధి చెందుతుందినేటి కార్యక్రమం భారత్స్పెయిన్ మధ్య అనేక కొత్త ఉమ్మడి సహకార ప్రాజెక్టులకు స్ఫూర్తినిస్తుందని నేను విశ్వసిస్తున్నానునేను స్పానిష్ పారిశ్రామికవేత్తలనుఆవిష్కర్తలను కూడా భారత్‌కు రావాలనిమా అభివృద్ధి ప్రయాణంలో భాగం కావాలని ఆహ్వానిస్తున్నానుఈ ప్రాజెక్ట్ కోసం ఎయిర్‌బస్టాటా బృందాలకు నా శుభాకాంక్షలు.

ధన్యవాదాలు.

 

***