Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సీఐఎస్ఎఫ్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా సిబ్బందికి ప్రధానమంత్రి అభినందనలు


ఈ రోజు సీఐఎస్ఎఫ్ సంస్థాపన దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంస్థ సిబ్బందికి అభినందనలు తెలియజేశారు. వృత్తి పట్ల నిబద్ధత, అంకిత భావం, ధైర్య సాహసాలకి సీఐఎస్ఎఫ్ దళం పెట్టింది పేరని ప్రధాని ప్రశంసించారు. “ఈ దళాల వారు ప్రతి రోజూ అసంఖ్యాక ప్రజలను, కీలక సదుపాయాలను కాపాడుతూ దేశ భద్రతలో ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తమ బాధ్యతను క్షణం కూడా మరువని వీరి అంకితభావం శ్లాఘనీయం” అని ప్రధానమంత్రి కొనియాడారు.

 శ్రీ మోదీ ఎక్స్ వేదిక పై పోస్ట్ చేస్తూ:

“సీఐఎస్ఎఫ్ సిబ్బంది యావన్మందికీ సంస్థాపన దినోత్సవ అభినందనలు!  ఈ దళం నిబద్ధతకీ, అంకితభావానికీ, సాహసానికీ మారుపేరు.. ప్రతిరోజూ అసంఖ్యాక దేశవాసులనూ మన కీలక వ్యవస్థలనూ కాపాడుతూ మన భద్రతా వ్యవస్థలో ముఖ్య భూమిక పోషిస్తున్నారు. తమ విద్యుక్త ధర్మం పట్ల వీరు చూపే నిబద్ధత ప్రశంసనీయం, @CISFHQrs” అని పేర్కొన్నారు.