Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సివిల్ సేవా దివస్ నాడు అవార్డులను ప్రదానం చేసిన ప్రధాన మంత్రి; ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

సివిల్ సేవా దివస్ నాడు అవార్డులను ప్రదానం చేసిన ప్రధాన మంత్రి; ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు పదకొండవ సివిల్ సేవా దివస్ సందర్భంగా అవార్డులను ప్రదానం చేశారు. ప్రభుత్వోద్యోగులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.

ఈ రోజును ‘‘పునరంకితం అయ్యే’’ రోజుగా ప్రధాన మంత్రి అభివర్ణించారు. ప్రభుత్వోద్యోగులకు వారి బలాలు మరియు సామర్థ్యంతో పాటు, సవాళ్ళు మరియు బాధ్యతల గురించి కూడా బాగా తెలుసునని ఆయన అన్నారు.

ప్రస్తుతం నెలకొన్న పరిస్థితులు సుమారు రెండు దశాబ్దాల పూర్వం పరిస్థితుల కన్నా చాలా భిన్నమైనవని, రానున్న కొన్ని సంవత్సరాలలో ఇవి మరింతగా మార్పు చెందుతాయని ఆయన అన్నారు. ఇదే అంశంపై ఆయన మరింత వివరంగా చెబుతూ, ఇంతకు ముందు ప్రభుత్వమే దాదాపు ఏకైక వస్తువులు మరియు సేవల సరఫరాదారుగా ఉండేదని, దీనితో లోటుపాట్లను గురించి పట్టించుకోకపోవడానికి ఎంతో ఆస్కారం ఉండేదన్నారు. అయితే, ఇప్పుడు ప్రభుత్వం కన్నా, ప్రైవేటు రంగం ఉత్తమమైన సేవలను అందిస్తోందని ప్రజలు చాలా తరచుగా తెలుసుకొంటున్నారని ఆయన అన్నారు. అనేక రంగాలలో ప్రస్తుతం ప్రత్యామ్నాయాలు అందుబాటులోకి రావడంతో ప్రభుత్వ అధికారుల బాధ్యతలు పెరిగాయని ప్రధాన మంత్రి అన్నారు. ఈ పెరుగుదల పని విషయంలో గాక, సవాలు విషయంలో చోటు చేసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు.

స్పర్ధకు ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి ప్రధాన మంత్రి స్పష్టీకరిస్తూ, ఇది గుణాత్మకమైన మార్పును తీసుకువస్తుందని చెప్పారు. ప్రభుత్వ వైఖరి క్రమబద్ధం చేసే సంస్థ పాత్ర నుండి సాధ్యం చేసే సంస్థగా ఎంత త్వరగా మారితే, అంత త్వరగా స్పర్ధ తాలూకు సవాలు ఒక అవకాశంగా రూపుదాలుస్తుందని ఆయన అన్నారు.

ఏదైనా కార్యరంగంలో ప్రభుత్వం గైర్ హాజరీ గ్రహించదగ్గదిగా ఉండాలని, ఏదైనా కార్యరంగంలో ప్రభుత్వ ఉనికి మాత్రం భారంగా మారకూడదని ప్రధాన మంత్రి అన్నారు. ఇటువంటి ఏర్పాట్ల దిశగా ప్రయత్నించవలసిందిగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

సివిల్ సేవా దివస్ అవార్డుల కోసం అందిన దరఖాస్తులు బాగా పెరిగాయని, కిందటి సంవత్సరం ఇవి 100 లోపే ఉండగా ఈ సంవత్సరం 500కు పైబడ్డాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఇక నాణ్యతను మెరుగుపరచడంపైన శ్రద్ధ తీసుకోవాలని, శ్రేష్ఠతను అలవాటుగా చేసుకోవాలని ఆయన అన్నారు.

అనుభవం అనేది యువ అధికారుల నవకల్పనను అణచివేయగల భారంగా తయారు కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సీనియర్ అధికారులను ప్రధాన మంత్రి కోరారు.

ప్రభుత్వ ఉద్యోగాలలో నామరాహిత్యం అనేది అత్యంత గొప్పదైన శక్తులలోకెల్లా ఒకటని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. సామాజిక మాధ్యమం మరియు మొబైల్ గవర్నెన్స్ లను ప్రభుత్వ పథకాల, ప్రయోజనాలను ప్రజలకు చేరవేసేందుకు ఉపయోగించినప్పటికీ- సామాజిక మాధ్యమాన్ని ఉపయోగించడం వల్ల ఈ నామరాహిత్య శక్తి సన్నగిలకుండా చూసుకోవాలంటూ అధికారులకు ప్రధాన మంత్రి జాగ్రత్త చెప్పారు.

‘‘సంస్కరించు, ప్రదర్శించు, పరివర్తనకు దారి తీయి’’ అనే సూత్రాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రస్తావిస్తూ, సంస్కరణ కు రాజకీయ అభిలాష అవసరమని, కానీ ఈ సూత్రీకరణ లోని ‘‘ప్రదర్శన’’ అనే భాగం ప్రభుత్వ ఉద్యోగుల నుండే వ్యక్తం కావాలని, పరివర్తనకు దారి తీయడమనే దానికి ప్రజల ప్రాతినిధ్యం వీలు కల్పిస్తుందని వివరించారు.

ప్రతి ఒక్క నిర్ణయం దేశ ప్రజల మేలును మనస్సులో పెట్టుకొని తీసుకొంటున్నదే అయ్యేటట్టుగా ప్రభుత్వ ఉద్యోగులు చూసుకోవాలని, ఒక నిర్ణయాన్ని తీసుకొనేటప్పుడు ఈ విషయమే గీటురాయి కావాలని ప్రధాన మంత్రి ఉద్బోధించారు.

2022వ సంవత్సరం స్వాతంత్ర్యం సిద్ధించిన అనంతరం 75 సంవత్సరాల కాలగమనాన్ని సూచించే సంవత్సరం అవుతుందని ప్రధాన మంత్రి గుర్తు చేస్తూ, స్వాతంత్ర్య సమర యోధులు కన్న కలలను పండించడంలో ఉత్ప్రేరక ఉపకరణాల పాత్రను పోషించవలసిందిగా ప్రభుత్వ ఉద్యోగులకు ఆయన విజ్ఞ‌ప్తి చేశారు.

*****