ప్రియమైన నా సోదరులు మరియు సోదరీమణులారా,
ఈ రోజు న నేను మీ ప్రధాన సేవకుడి గా మరోసారి మీ మధ్య కు విచ్చేశాను. అయితే ఇంతకు ముందు కూడాను ఈ దమన్ కావచ్చు, దీవ్ కావచ్చు, సిల్ వాసా కావచ్చు, ఇక్కడి గ్రామాలు కావచ్చు.. ఇవి నాకు కొత్తవేమీ కావు. చాలా సార్లు ఇక్కడ కు వచ్చే సందర్భాలు నాకు తారసిల్లాయి. స్కూటర్ లో దాద్ రా & నగర్ హవేలి మరియు దమన్ & దీవ్ ల రహదారుల పైన తిరిగే అవకాశం నాకు లభించింది. ఈ ప్రదేశం యొక్క ఆహారం, ఆచారాలు మరియు సంస్కృతి గురించి నాకు బాగా తెలుసు. నేను ఇక్కడ కు వచ్చినప్పుడల్లా, నాకు ప్రతి విషయం మరియు పాత జ్ఞాపకాలన్నీ గుర్తు కు వస్తాయి. మీ ప్రేమ నన్ను ఉప్పొంగిపోయేలా చేసింది.
మిత్రులారా,
నేను 2017వ సంవత్సరం ఏప్రిల్ లో ఇక్కడ కు వచ్చినప్పుడు, అనేక పథకాల కు పునాదిరాళ్ళు వేశాను. ఇంత తక్కువ కాలం లో చాలా వరకు పనులు పూర్తి కావడం, మరి ఆ పథకాల లో బోలెడు పథకాలు ఈ రోజు న దేశ ప్రజల కు అంకితం చేయబడడం నాకు సంతోషం గా ఉంది. ఈ రోజు న, మళ్లీ మీ మధ్య కు నేను తరలి వచ్చినందువల్ల, 1400 కోట్ల రూపాయల కు పైగా విలువైన ప్రోజెక్టు లు దేశ ప్రజల కు అంకితం చేయబడడమో, పునాదిరాయి వేయడమో జరిగింది. ఈ ప్రోజెక్టు లు ఇక్కడి సంధానం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్యం మరియు విద్య, పర్యటన, సంస్కృతి మరియు వారసత్వం లతో ముడిపడిన పరిశ్రమల ను ప్రోత్సహించడం కోసం ఈ రోజు న ఇక్కడ కొత్త పారిశ్రామిక విధానాన్ని మరియు నవీన ఐటి విధానాన్ని కూడా ప్రారంభించబడింది. నూతన సంవత్సరం లో ఈ బహుమతుల ను పొందినందుకు మీ అందరికీ అనేకానేక శుభాకాంక్ష లు.
సోదరులు మరియు సోదరీమణులారా,
సబ్ కా సాథ్, సబ్ కా వికాస్ మంత్రం పై కృషి చేస్తున్న కేంద్ర ప్రభుత్వం అభివృద్ధి యొక్క పంచ ధార-
పిల్లల కు విద్య,
యువత కు ఆదాయం,
వృద్ధుల కు మందులు,
రైతుల కు నీటిపారుదల మరియు
ప్రజల మాటల ను ఆలకించడం
-కు అంకితం చేయబడింది.
ఇది మా దృష్టి లో అభివృద్ధి కి రాజమార్గం వంటిది. దమన్ & దీవ్ మరియు దాద్ రా & నగర్ హవేలీ ల వికాసం గత ఐదు సంవత్సరాల లో నూతన శిఖరాల కు చేరుకొన్నందుకు నేను సంతోషిస్తున్నాను. ఈ రెండు ప్రాంతాలకు అభివృద్ధి పరంగా ఒక కొత్త గుర్తింపు తెచ్చుకొన్నాయి. అనేక అంశాల లో, ఈ రెండు ప్రాంతాలు కూడా కేంద్రపాలిత ప్రాంతాలు గా అసంపూర్ణత నుండి పరిపూర్ణత వైపు పురోగతి ని సాధించాయి. ఈ రోజు దమన్ & దీవ్ మరియు దాద్ రా & నగర్ హవేలీ లు తమ ను తాము బహిరంగ ప్రాంతాల లో మల మూత్రాదుల విసర్జన కు చోటు లేనివి గా ప్రకటించుకొన్నాయి. ఈ రోజు ఈ రెండు ప్రాంతాలలో ప్రతి ఇంటి కి ఎల్‌పిజి కనెక్షన్ ఉంది. రెండు క్షేత్రాలూ కిరోసిన్ వాడని వి గా ప్రకటించబడ్డాయి. ఈ రోజు ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల లోని అన్ని గృహాల కు విద్యుత్తు కనెక్షన్, నీటి సరఫరా ఉన్నాయి. ఈ రోజు, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా ఇళ్ళు పొందడానికి అర్హత ఉన్న ఈ రెండు ప్రాంతాల పేద ప్రజల కు ఇళ్ళు మంజూరు చేయబడుతున్నాయి. నేడు, ఆయుష్మాన్ భారత్ పథకం లో భాగం గా రెండు ప్రాంతాల లో అర్హత కలిగిన వారికి బంగారు కార్డు లను జారీ చేయడమైంది.
మిత్రులారా,
నేను గత మూడు సంవత్సరాల గురించి మాట్లాడితే, ఈ రెండు కేంద్రపాలిత ప్రాంతాల లో సుమారు తొమ్మిది వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. తొమ్మిది వేల కోట్లంటే మీరు ఊహించవచ్చు, మన ప్రాంతం ఇప్పుడు ఎక్కడ కు చేరుకుంటున్నదో! ఈ మొత్తం తో చాలా పథకాలు ప్రారంభించబడ్డాయి. చాలా పూర్తి అయ్యాయి. ఈ సందర్భంలో, ఈ రోజు అనేక ఆరోగ్య సంబంధిత ప్రాజెక్టులు ప్రారంభించబడ్డాయి లేదా వాటి పునాదిరాళ్ళు వేయబడ్డాయి. ఎంతోకాలంగా ఉన్న మీ డిమాండ్ కూడా నెరవేరింది. దాద్ రా & నగర్ హవేలీ మరియు దమన్ & దీవ్ చాలా దశాబ్దాల స్వాతంత్ర్యం తరువాత వాటి మొదటి వైద్య కళాశాల ను పొందాయి. ఇప్పటి వరకు రెండు కేంద్ర పాలిత ప్రాంతాల లో సంవత్సరానికి వేర్వేరు ప్రదేశాల లో 15 సీట్లు మాత్రమే వచ్చేవి. ఇప్పుడు 150 సీట్ల తో కూడిన ఈ కొత్త వైద్య కళాశాల ను ఒకే చోట ప్రారంభిస్తున్నాము. దీని అర్థం మనం 150 వద్ద ఆగిపోతామని కాదు. పని ముందుకు సాగే కొద్దీ విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతుంది.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఈ సంవత్సరం నుండే ప్రత్యామ్నాయ భవనం ద్వారా వైద్య కళాశాల ను ప్రారంభించడానికి కూడా ప్రయత్నాలు జరుగుతున్నాయి. వైద్య విద్యను ప్రోత్సహించడానికి, సిల్ వాసా లో పారా మెడికల్ కి సంబంధించి దాదాపు
250 సీట్లు, దమన్ లో నర్సింగ్ కు సంబంధించి 50 సీట్ల వ్యవస్థ లు చేయబడిన విషయం నా దృష్టి కి వచ్చింది. ఈ ప్రయత్నాల తో యువ సహచరుల కు ప్రయోజనమైతే చేకూరుతుంది. దీని తో పాటు ఇక్కడ ఆరోగ్య సేవల ను మెరుగుపరచడం లో కూడా తోడ్పాటు లభిస్తుంది.
మిత్రులారా,
రూ .200 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న ఈ కళాశాలతో పాటు, ఇక్కడ నిర్మించబడుతున్న ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాల సమాహారం (నెట్‌వర్క్) ఇంటికి దగ్గరలోనే సాధారణ వ్యాధులకు ఉత్తమ చికిత్సను అందించేందుకు సాధ్యం అయ్యేలా చేయనున్నాయి. ఆయుష్మాన్ భారత్ పథకం కింద ఇటువంటి ఆరోగ్య మరియు సంరక్షణ కేంద్రాలు డజన్ల కొద్దీ ఇక్కడ ప్రారంభించబడుతున్నాయి.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఆయుష్మాన్ భారత్ లేదా ప్రధాన మంత్రి జన ఆరోగ్య యోజన లబ్ధిదారులలో కొంతమందికి కొద్దిసేపటి క్రితం కార్డులు ఇవ్వబడ్డాయి. ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య సంరక్షణ పథకం ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా చర్చించబడుతోంది. ప్రజలు దీనిని మోదీకేర్ అని పిలుస్తున్నారు. కారణం ఏంటంటే, ఈ పథకం కింద, ప్రతి రోజు దేశంలో 10 వేలకు పైగా పేదలు ఉచితంగా చికిత్స పొందుతున్నారు. ఇప్పటికీ 100 రోజులకు కొంచెం పైన అయ్యింది. ఇంత తక్కువ సమయంలో, సుమారు ఏడు లక్షల మంది పేద రోగులు ఆసుపత్రులలో చికిత్స పొందారు.
మిత్రులారా,
ఔషధం (వైద్యం) కాకుండా, విద్య సౌకర్యం కూడా విస్తరించబడుతోంది. కొంతసేపటి క్రితం, కొత్త విద్యాసంస్థలు ఇక్కడ మీకు అంకితం చేయబడ్డాయి. డైయు యొక్క విద్యా కేంద్రం మరియు అనేక సౌకర్యాలు యువతకు వారి వారి ఇళ్లకు దగ్గరగా మంచి విద్యను పొందడంలో సహాయపడతాయి.
సోదరులు మరియు సోదరీమణులారా,
మందులు, విద్య తో పాటు, పేదలు ఎవ్వరూ కూడా నిరాశ్రయులు గా ఉండకుండా చూడడానికి ప్రభుత్వం భరోసా ఇస్తోంది. పేదవాడు తన తల మీద పై కప్పు లేకుండా జీవించకూడదు; తను నివసించడానికి ఒక పక్కా ఇల్లు ఉండాలి. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన లో భాగం గా గ్రామాల్లోని, నగరాల్లోని పేదల కు పక్కా గృహాల ను అందించే సమగ్ర ప్రచారం దేశవ్యాప్తం గా జరుగుతోంది. ఈ సంకల్పం వైపు ఒక అడుగు ముందుకు వేస్తూ, దాద్ రా & నగర్ హవేలి మరియు దమన్ & దీవ్ లలో ఈ రోజు అనేక ఇళ్ళు ప్రారంభించబడ్డాయి. అంతేకాక, కొద్దిసేపటి క్రితం కొత్త ఇళ్ల నిర్మాణాని కి పునాది రాయి కూడా వేయబడింది. దమన్ యొక్క పారిశ్రామిక ప్రాంతం లో పనిచేసే కార్మికుల కుటుంబాల కోసం గృహ నిర్మాణ పథకం ఇందులో కలసివుంది. ఈ రోజు, ఇల్లు సొంతం చేసుకోవాలనే కల నెరవేరిన వారికి మరియు ఇప్పటికే ఇళ్ళు నిర్మాణంలో ఉన్నవారికి నా హృదయపూర్వక అభినందనలు. కొత్త ఇంటి కల నూతన సంవత్సరం లో నెరవేరింది.
మిత్రులారా,
గత నాలుగున్నర సంవత్సరాలలో, దాద్ రా & నగర్ హవేలీ వంటి చిన్న ప్రాంతం లో, పట్టణ పేదల కు వెయ్యి కి పైగా ఇళ్ళు నిర్మించబడ్డాయి. గత నాలుగున్నర సంవత్సరాల లో, నిరుపేదల కు ఇళ్ళు నిర్మిస్తున్న నిబద్ధత, వేగం మరియు స్థాయి అపూర్వమైంది. గత ప్రభుత్వం వారి 5 సంవత్సరాల పదవీకాలం లో 25 లక్షల ఇళ్ల ను మాత్రమే నిర్మించగలిగితే, మన ప్రభుత్వం ఇప్పుడు 5 సంవత్సరాల లో ఒక కోటీ 25 లక్షల కు పైగా గృహాల నిర్మాణాన్ని పూర్తి చేసింది. 5 సంవత్సరాల లో 25 లక్షలు మరియు 5 సంవత్సరాల లో ఒక కోటీ 25 లక్షల మధ్య వ్యత్యాసాన్ని గమనించండి.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఇవి నాలుగు గోడలు ఉన్న ఇల్లు మాత్రమే కాదు; సౌభాగ్య పథకం లో భాగం గా ఇంటి కి ఉచిత విద్యుత్ కనెక్షన్ ఉంది; ఒక మరుగుదొడ్డి కూడా ఉంది. ఉజ్జ్వల పథకం లో భాగం గా వంటగది లో ఎల్‌పిజి గ్యాస్ కనెక్షన్ కూడా ఉచితం గా ఇవ్వబడుతుంది. దాద్ రా & నగర్ హవేలీ ని గురించి మాట్లాడితే, ఇక్కడ 13 వేల మంది సోదరీమణుల కు ఉచిత గ్యాస్ కనెక్షన్ లు ఇవ్వబడ్డాయి. ఇటువంటి సౌకర్యాలన్నీ పేదల విశ్వాసాన్ని పెంచడం లో సహాయపడతాయని రుజువు చేస్తున్నాయి. మిత్రులారా, సాధారణ మానవుల జీవితాన్ని సరళం గా మార్చడం కోసం దేశం లో స్మార్ట్ సిస్టమ్స్ తయారు చేయబడుతున్నాయి. సిల్ వాసా, దీవ్ లను స్మార్ట్ సిటీలు గా చేయడానికి అనేక ప్రణాళిక లు సిద్ధమవుతున్నాయి. రోడ్లు, వీధులు, మురుగునీటి పారుదల వ్యవస్థ, నీటి సరఫరా వ్యవస్థ, శుభ్రత సౌకర్యాలు వంటి సౌకర్యాలు ఉన్నాయి; అన్ని స్థాయిల లో పని జరుగుతోంది. కొద్దిసేపటి క్రితం, స్మార్ట్ సిటీ కి సంబంధించిన అనేక ప్రాజెక్టు లు ప్రారంభించబడ్డాయి లేదా వాటి పునాది రాళ్ళు వేయబడ్డాయి.
మిత్రురాలా,
ఈ మొత్తం ప్రాంతం యొక్క ఆర్థిక కార్యకలాపాల సిల్ వాసా ఒక కేంద్రం. ఇక్కడ అనేక పరిశ్రమ లు ఉన్నాయి. భవిష్యత్తు లోనూ ఇక్కడ పరిశ్రమల వృద్ధి కి అవకాశాలు అనేకం ఉన్నాయి. సిల్ వాసా నగరపాలక సంస్థ, లేదా మురుగునీటి శుద్ధి కర్మాగారం లేదా అనుసంధానాన్ని సులభతరం చేసే పథకాలు కావచ్చు. ఇవి అన్నీ ఇక్కడ జీవన విధానాన్ని సులభతరం చేయబోతున్నాయి.
మిత్రులారా,
సిల్ వాసా తో పాటు దమన్, దీవ్ కూడా అభివృద్ధి చెందడాన్ని వేగవంతం చేశాయి. దమన్ గంగా పై నిర్మించిన కొత్త వంతెన, కొత్త మురుగునీటి మార్గం మరియు శుద్ధి కర్మాగారం వంటి సౌకర్యాల తో, దమన్ నివాసుల జీవితం సరళతరం గా రూపొందుతుంది. అదే సమయంలో, మోతీ దమన్ వెంబడి నిర్మించిన సముద్రపు గోడ ఇప్పుడు సముద్రపు తరంగాల నుండి మిమ్మల్ని రక్షించబోతోంది. ఫలితం గా, నేల కోత సమస్య పెద్ద ఎత్తున నియంత్రించబడింది. మిత్రులారా, నేను గతం లో ఇక్కడ కు వచ్చినప్పుడు, అనేక గిరిజన కుటుంబాల కు భూమి పంపిణీ చేయబడింది. ఈ రోజు కూడా, కొంతమంది మిత్రుల కు భూమి పై హక్కు ను అప్పగించే వీలు నాకు చిక్కింది.
సోదరులు మరియు సోదరీమణులారా,
భూమి, అటవీ ఉత్పత్తి, విద్య, లేదా క్రీడల కు సంబంధించిన ప్రతిభ అయినా, ప్రతి స్థాయి లో ఆదివాసీ ల సంక్షేమం కోసం విస్తృతమైన ప్రయత్నాలు జరుగుతున్నాయి. వన్ ధన్ పథకం లో భాగం గా అటవీ ఉత్పత్తుల విలువలు మరియు సరైన మార్కెటింగ్ కోసం దేశవ్యాప్తం గా కేంద్రాల ను ఏర్పాటు చేస్తున్నారు. ఇది ఆదివాసీ సోదరులకు, ఆదివాసీ సోదరీమణుల కు వారి అటవీ ఉత్పత్తుల కు సరి అయిన ధర లభించేలా చేయడం కూడా. దీని కోసం మద్దతు ధర పరిధి ని కూడా పెంచడమైంది.
మిత్రులారా,
ఆదివాసీల ఆదాయాన్ని పెంచడం తో పాటు సంస్కృతి ని పరిరక్షించడానికి గంభీర ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ రోజు న కూడా, చరిత్ర మరియు సాంస్కృతిక వారసత్వాని కి సంబంధించిన అనేక పథకాల ను ప్రారంభించడమైంది. ఇది ఒక సాంస్కృతిక కేంద్రం అయినా, పాత కోట ల సంరక్షణ అయినా లేదా దీవ్ లోని ఐఎన్ఎస్ ఖుఖ్ రీ తో జోడింపబడిన స్మారక స్థలం అయినా, ఇది ఖచ్చితం గా స్థానిక సంస్కృతి ని పరిరక్షించడం లో, ప్రచారం చేయడం లో సహాయపడుతుంది.
మిత్రులారా,
సంస్కృతి, గౌరవం, ఇంకా చరిత్ర.. వీటి కి ప్రసిద్ధి పొందిన ఈ స్మారకం మన భావాల ప్రహరీగా ఉండనే ఉంది. యువత కోసం ఉపాధి అవకాశాల ను అనేకం గా సృష్టిస్తుంది కూడాను. ఇవి పర్యాటకానికి పుష్టిని ఇస్తాయి. దాద్ రా మరియు నగర్ హవేలీ లలో పర్యాటనకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాంతాన్ని పర్యాటక పటం లోకి ఎక్కించడం కోసం ప్రభుత్వం సాధ్యమైన అన్ని ప్రయత్నాల ను చేస్తోంది. సిల్ వాసా లో నిర్మించిన దమన్ గంగా రివర్ ఫ్రంట్ వెనుక ఇదే ఆలోచన ఉంది. ఇప్పుడు ఇక్కడ కు వచ్చే పర్యాటకుల కోసం మరో ఆకర్షణ కేంద్రం సిద్ధం గా ఉంది. ఇది కాకుండా, 200 చదరపు కిలోమీటర్ల సంరక్షక అటవీ ప్రాంతమూ ఉంది. ఈ అటవీ ప్రాంతం అనేది పర్యటన పరిశ్రమ కు ఒక వరం వంటిది. మధుబన్ ఆనకట్ట యొక్క పరీవాహక ప్రాంతం లో జల క్రీడల కార్యకలాపాల ను పెంచవచ్చు. దాద్ రా మరియు నగర్ హవేలీ లో ఇంటర్ నెట్ అనుసంధానం మెరుగయ్యేటట్టు ఇక్కడి ప్రముఖ పర్యటన కేంద్రాలు మరియు ముఖ్య ప్రదేశాల లో ఉచిత వై-ఫై సౌకర్యాల ను కల్పించే ప్రయత్నాలు జరుగుతున్నాయి.
మిత్రులారా,
పర్యటన రంగం తో పాటు సాంప్రదాయక ఉపాధి అవకాశాలు కూడా బలోపేతం అవుతున్నాయి. నీలి విప్లవం పథకం లో భాగం గా మత్స్యకారుల ఆదాయాన్ని పెంచడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. మత్స్యకార సోదరీమణులకు, మత్స్యకార సోదరుల కు చేపలు పట్టడం మరియు వాటి ని మార్కెట్ కు తరలించడాన్ని సులభతరం చేసేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి. మత్స్యకారుల సాంప్రదాయక పడవల ను ఆధునిక మోటారు పడవలు గా మార్చే పనులు జరుగుతున్నాయి. చేపల ఉత్పత్తి నుండి మార్కెటింగ్ వరకు ఏర్పాట్ల ను మెరుగుపరచడానికి, మత్స్యకారుల కు సులభం గా మరియు చౌక గా రుణాల ను ఇవ్వడానికి ప్రత్యేక నిధి ని రూపొందించడమైంది. ఈ నిధి ద్వారా సుమారు 7500 కోట్ల రూపాయల వ్యవస్థ ను రూపొందించడమైంది.
సోదరులు మరియు సోదరీమణులారా,
పేదలు, ఆదివాసీలు మరియు మధ్యతరగతి ప్రజల కోసం ప్రస్తుతం అమలు చేయబడుతున్న అన్ని పథకాల వెనుక ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ ప్రేరణ గా ఉంది, అయితే దశాబ్దాలు గా దేశం లో ప్రభుత్వాన్ని నడిపిన పార్టీ, స్వలాభం కోసం లేదా ఒక కుటుంబాని కి అనుకూలం గా ఉంటూ వచ్చింది. అప్పట్లో పని కంటే పేరు కు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడానికి ఇదే కారణం.
మిత్రులారా,
మేము ప్రభుత్వపు పాత పని సంస్కృతి ని మార్చాము. మేము పేరు కంటే పని మీద ఎక్కువ దృష్టి పెట్టాము. ఈ రోజు న ప్రభుత్వ పథకాల పేర్లు ఎలా ఉన్నాయి ? ఆయుష్మాన్ భారత్ యోజన, ప్రధాన మంత్రి ఆవాస్ యోజన, ప్రధాన మంత్రి ఉజ్జ్వల యోజన, ప్రధాన మంత్రి ముద్ర యోజన, ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన, ప్రధాన మంత్రి కృషి సీంచాయి యోజన.. ఇటువంటి పథకాలు చాలా ఉన్నాయి. కానీ ఏ పథకం కూడాను మోదీ పేరు తో లేదు. ఇది ప్రజల అభివృద్ధి పట్ల మా యొక్క ఉద్దేశ్యాన్ని స్పష్టం చేస్తుంది. మేము సంస్కృతి ని అనుసరించము లేదా ఒక కుటుంబాన్ని ప్రోత్సహించాలన్న ఉద్దేశ్యమూ మాకు లేదు. 125 కోట్ల మంది దేశ వాసులే నా కుటుంబం; ఈ 125 కోట్ల మంది దేశవాసుల సంక్షేమమే నేను అనుసరించేటటువంటి మార్గం.
మిత్రులారా,
ఈ స్పష్టమైన ఉద్దేశం మరియు స్పష్టమైన విధానం వారిని పడ గొడుతోంది. మునుపటి ప్రభుత్వాల పాత పని సంస్కృతి ని మోదీ మారుస్తున్నారన్నదే వారిని బాధపెడుతోంది. అవినీతి పై మోదీ ఎందుకు ఇంత కఠినమైన చర్యల ను తీసుకుంటున్నారో అనేది వారి కి సమస్య అయిపోయింది. అవినీతి కి వ్యతిరేకం గా మనం పోరాడకూడదా ? దేశం అవినీతి నుండి బయటపడకూడదా ? అధికారం లో ఉన్నవారి చుట్టూ ఉండే మధ్యవర్తుల ను మోదీ ఎందుకు తీసేశారు అనే విషయం లో వారికి ఇబ్బంది ఉంది. పేదల హక్కు లు, రేశన్, పింఛన్ ను కొల్లగొట్టే మధ్యవర్తుల ను మోదీ ఎందుకు తొలగిస్తున్నారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆగ్రహం కారణం గా, వీరంతా ఇప్పుడు మహా కూటమి ని ఏర్పాటు చేయడానికి యత్నిస్తున్నారు. ఇంతకుముందు కాంగ్రెస్ ను శపించే వారు కూడా ఆ వేదిక మీదకు చేరారు.
మిత్రులారా,
ఈ మహా కూటమి కేవలం మోదీ కి ఒక్కడి కి వ్యతిరేకం గానే కాదు, దేశ ప్రజల కు కూడాను వ్యతిరేకం గా ఉంది. ప్రస్తుతం, వారిలో ఎక్కువ మంది కలసిరాలేదు. సీట్ల పంపకం కోసం, ఇతర విషయాల కోసం బేరసారాలు జరుగుతున్న తీరు ను దేశం లోని యువత, దేశం లోని రైతులు, దేశం లోని మహిళలు, దేశం లో తొలి సారి వోటు ను వేయనున్న వారు నిశితం గా గమనిస్తున్నారు. ఈ ప్రజల ను ఎవ్వరూ మోసం చేయలేరు.
మిత్రులారా,
వీరి ప్రతి రోజూ మోదీ పట్ల ద్వేషం తో మొదలై మోదీ ని దుర్భాషలాడడం తో ముగుస్తుంది. అయితే, నా ప్రపంచం, నా ఉదయం 125 కోట్ల మంది దేశవాసుల సంక్షేమం కోసం సంకల్పం తో మొదలవుతుంది; రోజంతా చెమటోడ్చి పనిచేసిన తరువాత రాత్రి నిద్రపోయేటప్పుడు, పగటిపూట చేసిన మంచి పనులను ప్రతిబింబించడం పట్ల నేను సంతృప్తి చెందుతున్నాను. నా రోజు ఇలానే ప్రారంభమవుతుంది మరియు ముగుస్తుంది, అయితే వారి ప్రపంచం బంధు ప్రీతి మీద కేంద్రీకృతమై ఉంది; వారు దాని ని చాలా గర్వం గా ప్రకటిస్తారు.
సోదరులు మరియు సోదరీమణులారా,
నా ప్రపంచం 125 కోట్ల మంది దేశవాసుల పురోగతి పై దృష్టి పెట్టి ఉండగా, వారికి భారతదేశ అభివృద్ధి పై దృష్టి లేదు. వారు భారతదేశం యొక్క భవిష్యత్తు ను గురించి ప్రస్తావించరు, అయితే 21 వ శతాబ్దం లో భారతదేశాన్ని ప్రపంచం లోకెల్లా అత్యుత్తమ దేశం గా మార్చాడానికే నా ప్రయత్నం అంతా.
సోదరులు మరియు సోదరీమణులారా,
వారి కుటుంబాలను లేదా వారి సామ్రాజ్యాల ను కాపాడడానికి వారు ఎన్ని పొత్తులు చేయగలరు ? వారు తమ చర్యల నుండి పారిపోలేరు. వారి దుశ్చర్య లు వారిని వెంబడిస్తున్నాయి; వారు తప్పించుకోలేరు. మోదీ కి ప్రతిపక్షంగా ఉండడం, స్వార్థ రాజకీయాలు.. ఇవే వారికి వార్తాపత్రికల లో చోటు సంపాదించడానికి, ప్రసార మాధ్యమాల లో మెరవడానికి తోడ్పడుతాయి. అయితే, దేశాన్ని నాశనం చేసేవారికి దేశ ప్రజల హృదయాలలో ఎప్పటికీ చోటు దొరకదు.
సోదరులు మరియు సోదరీమణులారా,
మీకు బహుశా తెలియదు- ప్రజల కు దూరం అయిన వారు, ప్రజల ఆలోచనా దృక్పథం మార్చినప్పుడు, వారి ప్రపంచం కూలిపోతుంది. వారు నిరాశ కు గురవుతారు. ఇప్పుడు మీరు కోల్‌కాతా లోని పరిస్థితిని చూస్తే … పశ్చిమ బెంగాల్ లో భారతీయ జనతా పార్టీ కి చెందిన ఒకే ఒక శాసనసభ్యుడు ఉన్నారు. ఒకరు మాత్రమే. ఎంత మంది ? ఒక్కరు. అయితే బిజెపి ని ఓడించడానికి మొత్తం దేశం లో ఉన్న నాయకులంతా సమావేశమయ్యారు. మేము సత్య మార్గం లో నడుస్తునందున కేవలం ఒకే ఒక్క శాసనసభ్యుడు ఉన్న పార్టీ వారి జీవితాల ను కష్టతరం చేసింది. బిజెపి కి ఒక ఎమ్మెల్యే మాత్రమే ఉన్నప్పటికీ, భారతదేశం నుండి మొత్తం రాజకీయ సమాజం ‘రక్షించండి, రక్షించండి, రక్షించండి’ అంటూ నినాదాలు చేస్తోంది. పశ్చిమ బెంగాల్ ప్రజల ను నేను అభినందిస్తున్నాను. పశ్చిమ బెంగాల్ భారతీయ జనతా పార్టీ ని అభినందిస్తున్నాను. ఇంత చిన్న పార్టీ కి చెందిన ఒక ఎమ్మెల్యే తప్పు చేసిన వారి కి నిద్ర లేని రాత్రుల ను మిగుల్చుతున్నారు; వారి ప్రపంచం కూలిపోతోంది. వారు భయం కారణం గా ఏకమయ్యారు.
సోదరులు మరియు సోదరీమణులారా,
ఈ ప్రజలు నిర్ధేశకులు మాత్రమే కాదు.. పశ్చిమ బెంగాల్ అయినా, కేరళ అయినా, వారు అడుగడుగునా అణచివేత కు కూడా గురౌతున్నారు. పశ్చిమ బెంగాల్ లోని ఒక రాజకీయ పార్టీ తన కార్యక్రమాల ను నిర్వహించకుండా ఆంక్ష విధించబడింది. అన్ని రకాల ప్రజాస్వామ్య ప్రక్రియ లు హతమార్చబడ్డాయి. ఆ తరువాత, వారు అక్కడ సమావేశమై ప్రజాస్వామ్యాన్ని కాపాడడం గురించి ప్రసంగాలు చేస్తారు! ఈ కారణం గా, నేను మొత్తం పశ్చిమ బెంగాల్ చిత్రాన్ని చూసినప్పుడు, ప్రజాస్వామ్యం యొక్క గొంతుకను పిసికి, పంచాయతీ ఎన్నికల అభ్యర్థుల ను చంపే వారు ప్రజాస్వామ్యాన్ని సంరక్షించడాన్ని
గురించి మాట్లాడినప్పుడు,- ‘వాహ్! ఏమి సన్నివేశం!’ అని దేశం ఆశ్చర్యపోతోంది.
మిత్రులారా,
ఈ పోరాటం సానుకూల ఆలోచన కు, ప్రతికూల వైఖరి కి మధ్య. ఈ పోరాటం అభివృద్ధి కి, అవినీతి కి మధ్య. ఈ పోరాటం ప్రజల కు, మహాకూటమి కి మధ్య ఉంటుంది. సోదరులు మరియు సోదరీమణులారా, సానుకూల ఆలోచన మరియు సరైన ప్రయత్నాలు అనేవి న్యూ ఇండియా ను ఆవిష్కరించడానికి మార్గం. మనమందరమూ, దేశ ప్రజలు, ఈ మార్గం లో వేగం గా పయనించాలి. ఈ నూతన సంవత్సరం లో మన మనస్సుల లో మరియు దేశం లోని ప్రతి మూల లో ఈ అనుకూలత పెరుగుతోంది. ఈ అపేక్ష తో, దేశాన్ని కొత్త శిఖరాల కు తీసుకుపోవాలనే నిర్ణయం తో మేము ముందుకు పోతున్నాము.
సోదరులు మరియు సోదరీమణులారా,
మీరు చూస్తున్నారు, నేను ఉదయాన్నే బయలుదేరాను. భారత సైన్యాని కి ‘మేక్ ఇన్ ఇండియా’ యొక్క ప్రయోజనం లభించాలి; భారత సైన్యం వద్ద దేశీయం గా తయారు చేసిన బలమైన ట్యాంకులు ఉండాలి. కాబట్టి భారత సైన్యం యొక్క బలాన్ని పెంచడం కోసం ఏ ఉదయం పూటో అక్కడ కు నేను వెళ్తాను. ప్రస్తుతం దీవ్ మరియు దమన్ ల ప్రజల రక్షణ కోసం, ఇక్కడి యువ తరం వారికి వైద్య కళాశాల లభించడం కోసం నేను పాటు పడుతున్నాను.
సోదరులు మరియు సోదరీమణులారా, నేను మీతో ఉండి, దేశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి తీవ్రంగా కృషి చేస్తున్నప్పుడు, కోల్‌కతాలో, ప్రజలు తమ పార్టీ ని కాపాడడానికి కలసి పనిచేస్తున్నారు. తేడా సుస్పష్టం గా కనపడుతోంది.
మిత్రులారా,
ఈ వ్యత్యాసం ఖచ్చితంగా ఉంది. వారు తమ ను తాము రక్షించుకోవడానికి మద్దతు కోసం చూస్తున్నారు, నేను దేశాన్ని అభివృద్ధి చేయడానికి ‘సబ్ కా సాథ్ సబ్ కా వికాస్’ మంత్రం తో పని చేస్తున్నాను. ఈ రోజు న దీవ్ మరియు దమన్ వంటి చిన్న ప్రాంతం లో, మీ అందరి నుండి లభించిన ఆశీర్వాదాలు, మీ ప్రేమ, మీరందరూ ఇంత పెద్ద సంఖ్య లో ఇక్కడ కు తరలిరావడం ద్వారా భారతదేశ దృక్పథం వ్యక్తం అవుతోంది. ఈ దీవ్ మరియు దమన్ అనేది ఒక బుల్లి భారతదేశం. భారతదేశం యొక్క ప్రతి మూల కు చెందిన ప్రజలు ఇక్కడ నివసిస్తున్నారు. నేను కారు లో ఇక్కడ కు వస్తున్నప్పుడు, దారికి రెండు పక్కలా ఒక చిన్న భారతదేశాన్ని నేను చూశాను; భారతదేశం లోని ప్రతి రాష్ట్రం నుండి ప్రజలు వారి ప్రాంతీయ వేషధారణ లో నిలబడ్డారు. అప్పుడు నేను నడచి, వారికి నమస్కరించి మీ అందరి ముందు కు వచ్చి నిలచాను. సోదరులారా, మనం మన దేశాన్ని ముందుకు తీసుకుపోవాలి.
సోదరులు మరియు సోదరీమణులారా,
పార్టీ కోసం చనిపోయే వివిధ వ్యక్తులు చాలా మంది ఉంటారు. దేశం కోసం అసువులు బాసే వారూ, మీ యొక్క కలల ను నెరవేర్చడం కోసం మీకు సమర్పితులం అవుతున్నాము. మీ ఆశీర్వాదాలకుగాను అనేకానేక ధన్యవాదాలు పలుకుతూ, నాతో పాటు బిగ్గర గా పలకండి..
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
భారత్ మాతా కీ జయ్
అనేకానేక ధన్యవాదాలు.
The progress made by the Union Territories of Dadra and Nagar Haveli, as well as Daman and Diu in the last four years will make you very happy! pic.twitter.com/NhD1D0oIFT
— Narendra Modi (@narendramodi) January 19, 2019
Entire Opposition hates me because my ‘crimes’ are:
— Narendra Modi (@narendramodi) January 19, 2019
Waging the toughest war against corruption.
Stopping the reign of middlemen from the corridors of power.
Giving the poor what belongs to them in the first place but was denied for years. pic.twitter.com/EK8DrHeAhO
Their day begins with Modi, ends with Modi.
— Narendra Modi (@narendramodi) January 19, 2019
All they want to do is further their own dynasties.
They have zero vision for India.
Our approach is different.
For us, India is everything, 130 crore Indians are everything. pic.twitter.com/9aEOSwYhRh
They got together in Kolkata with no agenda but to stop BJP.
— Narendra Modi (@narendramodi) January 19, 2019
They talk of democracy in a state where the ruling party does not even allow local elections democratically.
130 crore Indians are watching their games with great amusement.
India will give them a befitting reply!