దాద్రా నగర్ హవేలీ, దామన్ దవే పరిపాలన అధికారి శ్రీ ప్రఫుల్ భాయ్ పటేల్, పార్లమెంటులో నా సహచరులు శ్రీమతి కల్బెన్ దేల్కర్, ప్రముఖులు, సోదర సోదరీమణులందరికీ నా నమస్కారాలు.
మీరంతా ఎలా ఉన్నారు? ఈ రోజు ఇక్కడ చాలా ఉత్సాహం కనిపిస్తోంది. ఇక్కడికి వచ్చే అవకాశం ఇచ్చిన కేంద్రపాలిత ప్రాంత సిబ్బందికి నా కృతజ్ఞతలు. చాలా మంది పాత మిత్రులకు నమస్కారం చెప్పే అవకాశం వచ్చింది.
మిత్రులారా,
సిల్వస్సాకు ఉన్న ఈ సహజ సౌందర్యం… ఇక్కడి, దాద్రా నగర్ హవేలీ, దామన్ దవే ప్రజల ప్రేమ.. మీతో నా అనుబంధం ఎంత పాతదో మీ అందరికీ తెలుసు. ఈ దశాబ్దాల నాటి అనుబంధంతో ఇక్కడికి రావడం వల్ల నాకెంత ఆనందం కలుగుతుందో మీకూ, నాకూ మాత్రమే తెలుసు. ఇవాళ నేను చాలా పాత స్నేహితులను చూస్తున్నాను. కొన్నేళ్ల కిందట నాకు చాలాసార్లు ఇక్కడికి వచ్చే అవకాశం వచ్చింది. ఆ సమయంలో సిల్వస్సా, పూర్తి దాద్రా నగర్ హవేలీ, దామన్–దవే పరిస్థితి ఏంటి? అప్పుడు ఎలా ఉండేది! అప్పుడు ప్రజలు కూడా సముద్ర తీరంలో ఒక చిన్న ప్రాంతంలో ఏ మార్పు వస్తుందని అనుకునేవారు? కానీ ఇక్కడి ప్రజలపై, ఇక్కడి ప్రజల సామర్థ్యాలపై నాకు నమ్మకం ఉంది. మీపై నాకు నమ్మకం ఉంది. 2014లో కేంద్రంలో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా ప్రభుత్వం ఈ నమ్మకాన్ని సామర్థ్యంగా మార్చి ముందుకు తీసుకెళ్లింది. నేడు మన సిల్వస్సా, ఈ రాష్ట్రం ఆధునిక గుర్తింపుతో తయారవుతుందది. అన్ని ప్రాంతాల ప్రజలు నివసిస్తోన్న నగరంగా సిల్వస్సా మారింది. దాద్రా నగర్ హవేలీ ఎంత వేగంగా కొత్త అవకాశాలు వస్తాయో ఈ కాస్మోపాలిటన్ స్వభావం తెలియజేస్తోంది.
మిత్రులారా,
ఇవాల్టి అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా రూ. 2500 కోట్లకు పైగా విలువైన పలు ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు జరిగాయి. మౌలిక సదుపాయాలు, అనుసంధానం, ఆరోగ్య సంరక్షణ, విద్యా, పర్యాటకం.. ఇలా ప్రతి రంగానికి సంబంధించిన అనేక ప్రాజెక్టులు ఈ ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేస్తాయి. ఇక్కడ కొత్త అవకాశాల సృష్టి జరుగుతుంది. ఈ ప్రాజెక్టులకు సంబంధించి మీ అందరినీ అభినందనలు తెలియజేస్తున్నాను. నేను మీకు ఒక చిన్న విషయం చెప్పదలుచుకున్నాను. విదేశాలతో పోలిస్తే ఇక్కడ కొత్తగా ఏం లేదు కాబట్టి మీలో చాలా మంది సింగపూర్ వెళ్తూ ఉంటారు. సింగపూర్ ఒకప్పుడు మత్స్యకారుల ఉండే ఒక చిన్న గ్రామం. వారి ప్రధాన వృత్తి చేపలు పట్టడం. అతి తక్కువ కాలంలోనే అక్కడి ప్రజల సంకల్పం నేడు ప్రస్తుత సింగపూర్‌గా మారింది. అదేవిధంగా ఈ కేంద్రపాలిత ప్రాంతంలోని ప్రతి పౌరుడు సంకల్పం తీసుకుంటే నేను మీకు అండగా నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. కానీ మీరు కూడా రావాలి, లేకపోతే అనుకున్నది జరగదు.
మిత్రులారా,
దాద్రా నగర్ హవేలీ, దామన్ దవే మనకు కేంద్రపాలిత ప్రాంతం మాత్రమే కాదు. ఈ ప్రాంతం మనకు గర్వకారణం. ఇది మన వారసత్వం కూడా. అందుకే సమగ్రాభివృద్ధికి పేరుగాంచిన ఈ ప్రాంతాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దుతున్నాం. ఈ ప్రాంతం హైటెక్ మౌలిక సదుపాయాలు, ఆధునిక ఆరోగ్య సేవలు, ప్రపంచ స్థాయి విద్యా సంస్థలకు ప్రసిద్ధి చెందాలని నేను కోరుకుంటున్నాను. ఈ ప్రాంతం పర్యాటకానికి, సముద్ర రంగ ఆర్థిక వ్యవస్థకు ప్రసిద్ధి చెందాలి. పారిశ్రామిక ప్రగతికి, యువతకు కొత్త అవకాశాలు కల్పించటం, మహిళల భాగస్వామ్యం, సర్వతోముఖాభివృద్ధికి ఈ ప్రాంతం ప్రసిద్ధి చెందాలి.
మిత్రులారా,
ప్రఫుల్ భాయ్ పటేల్ కృషి, కేంద్ర ప్రభుత్వ మద్దతు వల్ల మనం ఈ లక్ష్యానికి ఎంతో దూరంలో లేము. గత పదేళ్లుగా ఈ దిశగా వేగంగా పనిచేస్తున్నాం. మన సిల్వస్సా, ఈ కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి పరంగా దేశంలోనే ప్రత్యేక గుర్తింపును పొందుతున్నాయి. దాద్రా నగర్ హవేలీ, దామన్ దవే అనేక పథకాల్లో పరిపక్వతకు చేరుకున్నాయి. జీవితంలోని ప్రతి అంశాన్నీ దృష్టిలో ఉంచుకుని ప్రతి లబ్ధిదారుడు ప్రభుత్వ పథకాల ప్రయోజనాన్ని పొందుతున్నారు. ఒకే దేశం ఒకే రేషన్ కార్డు ద్వారా ప్రతి ఒక్కరికీ ఆహార భద్రత ఉంది. ప్రతి కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీటిని జల్ జీవన్ మిషన్ అందిస్తోంది. డిజిటల్ కనెక్టివిటీని భారత్ నెట్ బలోపేతం చేసింది. ప్రతి కుటుంబాన్ని బ్యాంకింగ్ సేవలకు పీఎం జన్ ధన్ అనుసంధానం చేసింది. పీఎం జీవన్ జ్యోతి బీమా, పీఎం సురక్షా బీమా యోజన ద్వారా ప్రతి ఒక్కరు లబ్ధి పొందుతున్నారు. ఈ పథకాలు విజయవంతం కావడం ఇక్కడి ప్రజల్లో విశ్వాసాన్ని నింపింది. ప్రభుత్వ పథకాల వల్ల వారి జీవితాల్లో వచ్చిన సానుకూల మార్పులు సమగ్ర ప్రభావాన్ని తెలియజేస్తున్నాయి. స్మార్ట్ సిటీస్ మిషన్, సమగ్ర శిక్ష, పీఎం ముద్ర వంటి పథకాల 100 శాతం అర్హులకు చేరాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వమే ప్రజాసంక్షేమ పథకాలతో ప్రజల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి. దీని వల్ల బడుగు, బలహీన వర్గాలు ఎంతో లబ్ధి పొందాయి.
మిత్రులారా,
మౌలిక సదుపాయాల నుంచి విద్య, ఉపాధి, పారిశ్రామికాభివృద్ధి వరకు నేడు ఈ ప్రాంత ముఖచిత్రం ఎలా మారిపోయిందో మనం చూడొచ్చు. ఒకప్పుడు ఇక్కడి యువత ఉన్నత చదువుల కోసం బయటకు వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఈ ప్రాంతంలో 6 జాతీయ స్థాయి సంస్థలు ఉన్నాయి. నమో మెడికల్ కాలేజ్, గుజరాత్ నేషనల్ లా యూనివర్సిటీ, ఐఐఐటీ దవే, నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ, ఇనిస్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ, ఇంజినీరింగ్ కాలేజ్ ఆఫ్ దామన్. ఈ సంస్థల కారణంగా మన సిల్వస్సా, ఈ కేంద్రపాలిత ప్రాంతం విద్యాకు సంబంధించిన కేంద్రంగా మారాయి. ఈ సంస్థల ద్వారా ఇక్కడి యువత మరింత ప్రయోజనం పొందేందుకు వారికి సీట్లను కేటాయించాం. హిందీ, ఇంగ్లిష్, గుజరాతీ, మరాఠీ అనే నాలుగు భాషల్లో విద్యను అందిస్తున్న రాష్ట్రం ఇది అని నేను సంతోషించేవాడిని. ఇప్పుడు ఇక్కడి ప్రాథమిక, జూనియర్ పాఠశాలల్లో కూడా పిల్లలు స్మార్ట్ తరగతి గదుల్లో చదువుకుంటున్నందుకు గర్వపడుతున్నాను.
మిత్రులారా,
గత కొన్ని సంవత్సరాల్లో ఈ ప్రాంతంలో ఆధునిక ఆరోగ్య సేవలు విస్తరించాయి. 2023లో ఇక్కడ నమో మెడికల్ కాలేజీని ప్రారంభించే అవకాశం వచ్చింది. ఇప్పుడు 450 పడకల సామర్థ్యం కలిగిన మరో ఆసుపత్రి దీనికి కలిసింది. దీనికి ఇక్కడే ఇప్పుడే ప్రారంభోత్సవం జరిగింది. ఈ రోజు ఆరోగ్యానికి సంబంధించిన ఇతర అనేక ప్రాజెక్టులకు కూడా ఇక్కడ శంకుస్థాపన జరిగింది. సిల్వస్సాలోని ఈ ఆరోగ్య సౌకర్యాలు ఇక్కడి గిరిజన సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తాయి.
మిత్రులారా,
సిల్వస్సాలోని ఆరోగ్యానికి సంబంధించిన ఈ ప్రాజెక్టులు మరొక కారణంతో ప్రత్యేకమైనవిగా మారాయి. నేడు జన ఔషధి దివస్ కూడా. జన ఔషధి అంటే చవకైన చికిత్సకు హామీ. జన ఔషధి మంత్రం– తక్కువ ధర, సమర్థవంతమైన వైద్యం. మా ప్రభుత్వం కూడా మంచి ఆసుపత్రులను నిర్మిస్తోంది. ఆయుష్మాన్ యోజన కింద ఉచిత చికిత్సను అందిస్తోంది. జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకు మందులను కూడా అందిస్తోంది. ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత కూడా మందుల విషయంలో ఖర్చుకు సంబంధించిన భారం ఎక్కువ కాలం ఉంటుందని మనందరికీ తెలుసు. ఈ భారాన్ని తగ్గించుకునేందుకు దేశవ్యాప్తంగా 15 వేలకు పైగా జన ఔషధి కేంద్రాల్లో 80 శాతం తక్కువ ధరకు మందులు అందుతున్నాయి. నాతో పాటు 80 శాతం వరకు డిస్కౌంట్ అని చెప్పండి!. దాద్రా నగర్ హవేలీ, దామన్ దవే ప్రజలు కూడా సుమారు 40 జన ఔషధి కేంద్రాల ద్వారా ప్రయోజనాన్ని పొందుతున్నారు. రానున్న కాలంలో దేశవ్యాప్తంగా 25 వేల జన ఔషధి కేంద్రాలను ప్రారంభించాలనే లక్ష్యంతో ముందుకెళ్తున్నాం. ఈ పథకాన్ని ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వం సుమారు రూ. 6.5 వేల కోట్ల విలువైన మందులను అవసరంలో ఉన్న వారికి తక్కువ ధరకు అందించింది. జన ఔషధి కేంద్రాల ప్రారంభంతో పేద, మధ్యతరగతి ప్రజలకు రూ.30 వేల కోట్లకు పైగా ఆదా అయ్యాయి. జన ఔషధి కేంద్రాల వల్ల అనేక తీవ్రమైన వ్యాధులకు సంబంధించిన చికిత్స చౌకగా మారింది. సామాన్యుల అవసరాల పట్ల మన ప్రభుత్వం ఎంత సున్నితంగా వ్యవహరిస్తుందో చెప్పడానికి ఇదే నిదర్శనం.
మిత్రులారా,
ఆరోగ్యానికి సంబంధించిన ఈ ముఖ్యమైన అంశాలతో పాటు మరో ముఖ్యమైన విషయం గురించి కూడా మాట్లాడాలనుకుంటున్నాను. నేటి జీవనశైలి, దానికి సంబంధించిన వ్యాధులు మన ఆరోగ్యానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయన్న విషయం అందరికీ తెలిసిందే. అలాంటి వ్యాధుల్లో ఊబకాయం ఒకటి. వారు కుర్చీలో కూర్చోలేరు, చుట్టూ చూడలేరు. నేను ఇలా చెబితే తమ పక్కన ఎవరు ఎక్కువ బరువుతో ఉన్న వారు కూర్చున్నారో చూస్తున్నారు. ఈ ఊబకాయం నేడు అనేక ఇతర వ్యాధులకు కారణమవుతోంది. ఊబకాయం సమస్యపై ఇటీవల ఓ నివేదిక వచ్చింది. 2050 నాటికి 44 కోట్ల మంది భారతీయులు ఊబకాయంతో బాధపడతారని ఈ నివేదిక చెబుతోంది. ఈ సంఖ్య చాలా పెద్దది. ఇది భయానకంగా ఉంది. అంటే ప్రతి ముగ్గురిలో ఒకరు ఊబకాయం కారణంగా తీవ్రమైన వ్యాధుల బారిన పడొచ్చు. ఇది ప్రాణాంతకం కావచ్చు. అంటే, ప్రతి కుటుంబంలో ఒకరు దీని భారిన పడతారు. ఇది ఎంత పెద్ద సంక్షోభం! ఇప్పటి నుంచే అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు కృషి చేయాలి. ఇందులో భాగంగా అనేక చర్యలు తీసుకోవచ్చు. నేను ఒక పిలుపునిచ్చాను. ఈ రోజు నేను మీ నుండి హామీ కోరుకుంటున్నాను. ఈ ఆసుపత్రి నిర్మాణం చాలా బాగా జరిగింది. కానీ మీరు ఆసుపత్రికి వెళ్లే ఇబ్బంది పడటం నాకు ఇష్టం లేదు. ఆసుపత్రి ఖాళీగా ఉన్నా ప్రజలు ఆరోగ్యంగా ఉండాలి. మీరు ఒక పని చేయాలని నేను కోరుకుంటున్నాను. మీరు చేస్తారా? దయచేసి చేతులు పైకెత్తి చెప్పండి, మీరు చేస్తారా? నేను చేస్తాను నాకు మాటివ్వండి. మీరంతా చేతులు పైకెత్తి నూటికి నూరు శాతం చేస్తాం అని చెప్పండి. ఈ శరీర బరువు పెరిగి లావుగా మారిపోతూనే ఉంటారు. దానికి బదులుగా సన్నగా మారడానికి ప్రయత్నించండి.
మనమందరం మన వంట నూనెను 10% తగ్గించాలి. ప్రతి నెలా 10% తక్కువ వంట నూనెను ఉపయోగించడానికి ప్రయత్నించాలి. అంటే మీరు ప్రతి నెలా కొనుగోలు చేసే వంట నూనె కంటే 10% తక్కువ వంట నూనెను కొనాలని నిర్ణయించుకోండి. నూనె వినియోగాన్ని 10% తగ్గిస్తామని వాగ్దానం చేస్తున్నాను అని చెప్పండి. అందరూ చేతులు పైకి ఎత్తాలి, ముఖ్యంగా సోదరీమణులు చెప్పాలి. అప్పుడు ఇంట్లో వాళ్ల మాట వినాల్సి వచ్చినా.. మీరు ఖచ్చితంగా నూనె వినియోగాన్ని తగ్గిస్తారు. స్థూలకాయాన్ని తగ్గించే దిశగా ఇది చాలా పెద్ద అడుగు. ఇది కాకుండా వ్యాయామాన్ని మన జీవితంలో భాగం చేసుకోవాలి. ప్రతిరోజూ కొన్ని కిలోమీటర్లు నడవడం లేదా ఆదివారం సైక్లింగ్ చేయటం ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది. నూనెను 10 శాతం తగ్గించమని చెప్పాను కానీ మరే ఇతర పని చేయమని నేను చెప్పలేదు. వంట నూనె 50 శాతం తగ్గించమని నేను చెబితే మీరు మరోసారి నన్ను సిల్వస్సాకు పిలవరు. నేడు అభివృద్ధి చెందిన భారత్ సంకల్పాన్ని సాకారం చేసే పనిలో దేశం నిమగ్నమైంది. ఆరోగ్యవంతమైన దేశం మాత్రమే ఇలాంటి లక్ష్యాన్ని చేరుకోగలదని మనం గుర్తుంచుకోవాలి. అందువల్ల ఈ కేంద్రపాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దవే ప్రజలకు నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే.. మీరు వంట నూనెను తగ్గించి, మిమ్మల్ని మీరు ఆరోగ్యంగా ఉంచుకుంటే, అభివృద్ధి చెందిన భారత్ దిశగా ప్రయాణానికి ఇది భారీగా దోహదం చేస్తుంది.
మిత్రులారా,
అభివృద్ధి విషయంలో దార్శనికత ఉన్న రాష్ట్రంలో అవకాశాలు శరవేగంగా వస్తాయి. అందుకే గత దశాబ్దంలో ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రంగా ఆవిర్భవించింది. ఈసారి బడ్జెట్‌లో తయారీ రంగ మిషన్ అనే చాలా పెద్ద కార్యక్రమాన్ని చేపట్టాం. ఇది ఇక్కడ ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తుంది. గత పదేళ్లలో ఇక్కడ వందలాది కొత్త పరిశ్రమలు ప్రారంభమయ్యాయి, అనేక పరిశ్రమలు విస్తరించాయి. దీనికోసం వేల కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. ఈ పరిశ్రమలు స్థానికులకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నాయి. మన గిరిజన సమాజం, గిరిజన మిత్రులు ఈ ఉపాధి అవకాశాల ద్వారా గరిష్ఠ ప్రయోజనం పొందేలా చూస్తున్నాం. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మహిళల సాధికారత కోసం గిర్ ఆదర్శ్ అజీవిక యోజనను కూడా ఇక్కడ అమలు చేశాం. ఒక చిన్న డెయిరీ ఫామ్‌ను ఏర్పాటు చేయడం ద్వారా స్వయం ఉపాధికి ఇక్కడ కొత్త అవకాశాలను కూడా సృష్టించాం.
మిత్రులారా,
ఉపాధి విషయంలో పర్యాటకం కూడా ప్రధానమైనది. ఇక్కడి బీచ్‌లు, గొప్ప వారసత్వ సంపద దేశ విదేశాల నుంచి పెద్ద సంఖ్యలో పర్యాటకులను ఆకర్షిస్తున్నాయి. డామన్‌లోని రామసేతు, నమోపత్, టెంట్ సిటీ అభివృద్ధి వల్ల ఈ ప్రాంత ఆకర్షణ పెరిగింది. పర్యాటకులు కూడా డామన్‌లోని రాత్రి సమయంలో జరిగే మార్కెట్‌ను బాగా ఇష్టపడుతున్నారు. ఇక్కడ ఒక పక్షుల అభయారణ్యం భారీగా స్థాయిలో నిర్మాణమైంది. దుధానిలో ఎకో రిసార్ట్ నిర్మించాలనే ప్రణాళిక ఉంది. దవేలో సముద్ర తీరప్రాంత విహారయాత్ర, బీచ్ అభివృద్ధి పనులు కూడా జరుగుతున్నాయి. 2024 లో డయ్యూలో బీచ్ క్రీడలు నిర్వహించారు. తర్వాత ప్రజలలో బీచ్ ఆటల పట్ల ఆకర్షణ పెరిగింది. బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పొందిన తర్వాత దవేలోని ఘోఘ్లా బీచ్ కూడా ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా మారింది. ఇప్పుడు దవే జిల్లాలో ‘కేబుల్ కారు‘ను నిర్మాణంమౌతోంది. ఇది దేశంలోనే మొదటి వైమానిక రోప్ వే. దీని ద్వారా అరేబియా సముద్ర అద్భుతమైన అందాలను చూడొచ్చు. మొత్తంగా మన కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దవే దేశంలోనే ఉత్తమ పర్యాటక కేంద్రాల్లో ఒకటిగా మారుతుంది.
మిత్రులారా,
అనుసంధానానికి సంబంధించి ఇక్కడ చేసిన పనులు కూడా ఈ విషయంలో పెద్ద పాత్ర పోషించాయి. ప్రస్తుతం దాద్రా సమీపంలో బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణం జరుగుతోంది. ముంబయి–దిల్లీ ఎక్స్ ప్రెస్ రహదారి సిల్వస్సా గుండా వెళ్తోంది. గత కొన్నేళ్లుగా ఇక్కడ కొన్ని కిలోమీటర్ల మేర కొత్త రోడ్లు నిర్మాణం జరిగింది. 500 కిలోమీటర్లకు పైగా రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఇందుకోసం వేల కోట్ల రూపాయలు వ్యయం వెచ్చిస్తున్నాం. ఉడాన్ పథకం వల్ల ఈ ప్రాంతానికి కూడా ప్రయోజనం చేకూరింది. మెరుగైన అనుసంధానం కోసం ఇక్కడి విమానాశ్రయాన్ని ఆధునీకరిస్తున్నాం. అంటే మీ అభివృద్ధి కోసం మా ప్రభుత్వం ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు.
మిత్రులారా,
దాద్రా నగర్ హవేలీ, దామన్ దవే కూడా అభివృద్ధితో పాటు సుపరిపాలన, జీవన సౌలభ్యం ఉన్న ప్రాంతాలుగా మారడం సంతోషంగా ఉంది. ఒకప్పుడు ప్రజలు తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగాల్సి వచ్చేది. ప్రస్తుతం మొబైల్‌లో ఒక్క క్లిక్‌తోనే చాలా వరకు ప్రభుత్వానికి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. దశాబ్దాలుగా నిర్లక్ష్యానికి గురైన గిరిజన ప్రాంతాలకు ఈ కొత్త విధానం ద్వారా ఎక్కువ ప్రయోజనం చేకూరుతోంది. నేడు గ్రామాల్లో ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నాం. అక్కడే ప్రజల సమస్యలు విని వాటి పరిష్కారానికి కృషి చేస్తున్నాం. ఇలాంటి చర్యల తీసుకున్నందుకు ప్రఫుల్ భాయ్, ఆయన బృందాన్ని అభినందిస్తున్నాను. కేంద్ర పాలిత ప్రాంతమైన దాద్రా నగర్ హవేలీ, దామన్ దవే అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఈ సందర్భంగా హామీ ఇస్తున్నాను. ఇవాల్టి అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించి మీకు మరోసారి అభినందనలు తెలియజేస్తున్నాను. మీరు నాకు ఇచ్చిన అద్భుతమైన స్వాగతం, నాపై మీరు కురిపించిన ప్రేమ ఆప్యాయత, చూపిస్తోన్న గౌరవానికి కేంద్రపాలిత ప్రాంత ప్రజలందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ధన్యవాదాలు.
గమనిక: ప్రధానమంత్రి హిందీ, గుజరాతీలో ప్రసంగించారు.
***
A landmark day for Dadra and Nagar Haveli and Daman and Diu as key development projects are being launched. Speaking at a programme in Silvassa. https://t.co/re1Am2n62t
— Narendra Modi (@narendramodi) March 7, 2025
दादरा और नगर हवेली, दमण और दीव… ये प्रदेश हमारा गर्व है… हमारी विरासत है। pic.twitter.com/CN1ZjijEOH
— PMO India (@PMOIndia) March 7, 2025
दादरा और नगर हवेली, दमण और दीव... ये कई योजनाओं में सैचुरेशन की स्थिति में पहुंच गए हैं: PM @narendramodi pic.twitter.com/xRjJqsmScw
— PMO India (@PMOIndia) March 7, 2025
जनऔषधि यानी- सस्ते इलाज की गारंटी!
— PMO India (@PMOIndia) March 7, 2025
जनऔषधि का मंत्र है- दाम कम, दवाई में दम! pic.twitter.com/4GscUrLDb9
हम सभी को अपने खाने के तेल में 10% की कटौती करनी चाहिए।
— PMO India (@PMOIndia) March 7, 2025
हमें हर महीने 10% कम तेल में काम चलाने का प्रयास करना है।
मोटापा कम करने की दिशा में ये एक बहुत बड़ा कदम होगा: PM @narendramodi pic.twitter.com/61lgZ4XAFc
दादरा और नगर हवेली एवं दमन और दीव में हमारा फोकस ऐसे होलिस्टिक डेवलपमेंट पर है, जो देशभर के लिए एक मॉडल बनने वाला है। pic.twitter.com/z1bqFy2uev
— Narendra Modi (@narendramodi) March 7, 2025
जनऔषधि दिवस पर सिलवासा में आज जिस नमो हॉस्पिटल का उद्घाटन हुआ है, उससे इस क्षेत्र के हमारे आदिवासी भाई-बहनों को भी बहुत फायदा होने वाला है। pic.twitter.com/c3HFZCZj5E
— Narendra Modi (@narendramodi) March 7, 2025
Lifestyle Diseases की रोकथाम के लिए दादरा और नगर हवेली एवं दमन और दीव के लोगों के साथ ही समस्त देशवासियों से मेरा यह आग्रह… pic.twitter.com/8jJTaIXoYR
— Narendra Modi (@narendramodi) March 7, 2025
दमन में रामसेतु, नमोपथ और टेंट सिटी हो या फिर विशाल पक्षी विहार, हमारी सरकार इस पूरे क्षेत्र में पर्यटन के विकास के लिए कोई कोर-कसर नहीं छोड़ रही है। pic.twitter.com/fFW9BqEvFP
— Narendra Modi (@narendramodi) March 7, 2025
हाई-टेक सुविधाओं से लैस सिलवासा के नमो हॉस्पिटल से जहां इस क्षेत्र में स्वास्थ्य सेवाओं को काफी मजबूती मिलेगी, वहीं यहां के लोगों को भी अत्याधुनिक चिकित्सा का लाभ मिल सकेगा। pic.twitter.com/HzGgiSX1zx
— Narendra Modi (@narendramodi) March 7, 2025
सिलवासा के कार्यक्रम में अपार संख्या में आए अपने परिवारजनों के स्नेह और आशीर्वाद से अभिभूत हूं! pic.twitter.com/xwKjbdoFFh
— Narendra Modi (@narendramodi) March 7, 2025