Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిడ్ నీ లో తరువాతి క్వాడ్ సమిట్ కు ఆతిథేయి గావ్యవహరించనున్నందుకు ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీస్  కు ధన్యవాదాల ను తెలియజేసిన ప్రధాన మంత్రి


ఆస్ట్రేలియా లోని సిడ్ నీ లో జరగబోయే తరువాతి క్వాడ్ శిఖర సమ్మేళనాని కి ఆతిథేయి గా వ్యవహరించనున్న ఆస్ట్రేలియా ప్రధాని శ్రీ ఏంథనీ అల్బనీ స్ కు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ధన్యవాదాల ను వ్యక్తం చేశారు.

ఆస్ట్రేలియా ప్రధాని ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ ,

‘‘సిడ్ నీ లో జరగనున్న తరువాతి క్వాడ్ సమిట్ కు ఆతిథేయి గా వ్యవహరించనున్నందుకు గాను @AlboMP కు ధన్యవాదాలు. ఈ శిఖర సమ్మేళనం తో స్వేచ్ఛాయుక్తం అయినటువంటి, అరమరికల కు తావు ఉండనటువంటి మరియు సంబంధి వర్గాలు అన్నిటి ని కలుపుకొని పోయేటటువంటి ఇండో-పసిఫిక్ కు పూచీ పడడానికి గాను మనం జరుపుతున్న ప్రయాసల కు ప్రోత్సాహం లభిస్తుంది.

నేను నా యాత్ర మరియు మన సకారాత్మకమైనటువంటి కార్య సూచీ ని ముందుకు తీసుకు పోవడం కోసం వివిధ రంగాల లో క్వాడ్ సంబధి సహకారాన్ని బలపరచే విషయం లో చర్చించడానికి ఉత్సాహం తో వేచివున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.

 

*****