సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ నెట్ వర్క్ సేవల పరిధి ని మెరుగు పరచినందుకు గాను ఆ ప్రక్రియ లో ప్రమేయం ఉన్న వారందరిని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ప్రశంసించారు.
సౌకర్యవంతమైనటువంటి మరియు తక్కువ ఖర్చు తో కూడుకొన్నటువంటి ఇంధనాన్ని అందించడం కోసం సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ (సిజిడి) నెట్ వర్క్ చాలా పెద్దవైన ముందంజల ను వేసినట్లు పెట్రోలియమ్ మరియు సహజ వాయువు శాఖ కేంద్ర మంత్రి శ్రీ హర్ దీప్ సింహ్ పురి ఒక ట్వీట్ లో తెలియ జేశారు. సిజిడి నెట్ వర్క్ 2014 వ సంవత్సరం లో 66 జిల్లాల లో మాత్రమే పని చేస్తూ ఉన్నది కాస్తా తన కార్యకలాపాల ను 2023 వ సంవత్సరం వచ్చే సరికి 630 జిల్లాల కు విస్తరించింది; దీని ద్వారా పిఎన్ జి దేశీయ కనెక్షన్ ల సంఖ్య 2014 వ సంవత్సరం లో కేవలం 25.40 లక్ష ల స్థాయి నుండి ప్రస్తుతం 103.93 లక్ష ల స్థాయి కి చేరుకొంది అని కేంద్ర మంత్రి వివరించారు.
కేంద్ర మంత్రి ట్వీట్ కు ప్రధాన మంత్రి సమాధానాన్ని ఇస్తూ,
‘ఇవి చక్కటి సంఖ్య లు. ఈ విధమైన సేవ లు అందుబాటు లోకి తీసుకు రావడం కోసం సంవత్సరాల తరబడి కఠోరంగా శ్రమించిన వారందరిని నేను అభినందిస్తున్నాను.’’ అని ఒక ట్వీట్ లో పేర్కొన్నారు.
These are good numbers. I appreciate all those who worked hard over the years to make this coverage happen. https://t.co/N95OClJtKY
— Narendra Modi (@narendramodi) April 5, 2023