Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సిక్కిమ్ ముఖ్యమంత్రి తో మాట్లాడిన ప్రధాన మంత్రి


సిక్కిమ్ ముఖ్యమంత్రి శ్రీ ప్రేమ్ సింహ్ తమాంగ్ తో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడారు. సిక్కిమ్ లో కొన్ని ప్రాంతాల లో దురదృష్టవశాత్తు సంభవించిన ప్రాకృతిక విపత్తు దరిమిలా తలెత్తిన స్థితి ని గురించి అడిగి తెలుసుకొన్నారు. ఈ స్థితి లో చేతనైన అన్ని విధాలు గాను సహకారాన్ని అందించడం జరుగుతుంది అంటూ హామీ ని కూడా ఇచ్చారు.

ప్రబావిత వ్యక్తులందరి సురక్ష కోసం మరియు వారి శ్రేయం కోసం ఆ ఈశ్వరుడి ని శ్రీ నరేంద్ర మోదీ ప్రార్థించారు.

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో ఒక సందేశం లో –

‘‘సిక్కిమ్ ముఖ్యమంత్రి శ్రీ @PSTamangGolay తో మాట్లాడాను. రాష్ట్రం లో కొన్ని ప్రాంతాల లో దురదృష్టవశాత్తు సంభవించినటువంటి ప్రాకృతిక విపత్తు దరిమిలా ఏర్పడిన స్థితి ని గురించి అడిగి తెలుసుకొన్నాను. సవాలు ను ఎదుర్కొనడం లో సాధ్యమైన అన్ని విధాలుగాను సమర్థన ను గురించిన హామీ ని ఇచ్చాను. బాధిత వ్యక్తులంతా సురక్షితం గా మరియు క్షేమం గా ఉండాలంటూ ఆ ఈశ్వరుడి ని ప్రార్థిస్తున్నాను.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST