Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సికింద్రాబాద్-తిరుపతి వందే భారత్ ఎక్స్’ప్రెస్ ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రయోజనకరం.. తద్వారా ఆర్థికవృద్ధికి ఉత్తేజం: ప్రధానమంత్రి


   వందే భారత్ ఎక్స్‌’ప్రెస్ సౌకర్యం, అనుసంధానం, దేశ ప్రతిష్ఠకు ప్రతిబింబమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు.

సికింద్రాబాద్‌-తిరుపతి వందే భారత్‌ ఎక్స్‌’ప్రెస్‌ను ప్రధానమంత్రి జెండా ఊపి ప్రారంభించనుండటంపై కేంద్ర సాంస్కృతిక-పర్యాటకశాఖ మంత్రి శ్రీ జి.కిషన్‌ రెడ్డి ట్వీట్‌కు ప్రతిస్పందనగా పంపిన సందేశంలో:

“వందే భారత్ ఎక్స్‌’ప్రెస్‌ మన ప్రతిష్టకు, సౌకర్యానికి, అనుసంధానానికి పర్యాయపదం. సికింద్రాబాద్-తిరుపతి మార్గంలో ప్రయాణించే ఈ రైలు పర్యాటకానికి… ముఖ్యంగా ఆధ్యాత్మిక పర్యాటకానికి ప్రయోజనం చేకూరుస్తుంది. తద్వారా ఆర్థికవృద్ధికి కూడా దోహదం చేస్తుంది” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.

 

***

DS/TS