ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ సింగపూర్ సీనియర్ మంత్రి గోహ్ చాక్ టాంగ్ తో ఈ రోజు సమావేశమయ్యారు.
సీనియర్ మంత్రి సింగపూర్ కు ప్రధానిగా బాధ్యతలు నిర్వర్తించిన సమయంలో రెండు దేశాల మధ్య సంబంధాలపై ప్రత్యేక దృష్టి సారించారని, ఆ దేశంలో ‘ఇండియా ఫీవర్’ ను ప్రారంభించారని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఆయన కృషి ద్వైపాక్షిక సంబంధాల అభివృద్ధికి బలమైన పునాది వేసింది. ఆయన హయాంలోనూ, ఆ తర్వాత భారత్ కు ఇచ్చిన అమూల్యమైన మద్ధతును ప్రధాని ప్రశంసించారు. రెండు దేశాల మధ్య సంబంధాల్లో ఇటీవల సాధించిన పురోగతి, ద్వైపాక్షిక సహకారాన్ని కొత్త స్థాయికి తీసుకెళ్లే మార్గాలపై ఇద్దరూ తమ అభిప్రాయాలను పంచుకున్నారు.
***
Met Mr. Goh Chok Tong, Emeritus Senior Minister and a widely respected statesman. We had extensive discussions on ways to add momentum to the India-Singapore friendship. His experience and expertise are very valued. pic.twitter.com/ugqCUynh1T
— Narendra Modi (@narendramodi) September 5, 2024