Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సింగపూర్ పర్యటన సందర్భంగా ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 37వ సింగపూర్ ఉప‌న్యాసం ‘భారతదేశం యొక్క సింగపూర్ కథ’ పూర్తి పాఠం

సింగపూర్ పర్యటన సందర్భంగా  ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 37వ సింగపూర్ ఉప‌న్యాసం ‘భారతదేశం యొక్క సింగపూర్ కథ’ పూర్తి పాఠం

సింగపూర్ పర్యటన సందర్భంగా  ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 37వ సింగపూర్ ఉప‌న్యాసం ‘భారతదేశం యొక్క సింగపూర్ కథ’ పూర్తి పాఠం

సింగపూర్ పర్యటన సందర్భంగా  ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 37వ సింగపూర్ ఉప‌న్యాసం ‘భారతదేశం యొక్క సింగపూర్ కథ’ పూర్తి పాఠం

సింగపూర్ పర్యటన సందర్భంగా  ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 37వ సింగపూర్ ఉప‌న్యాసం ‘భారతదేశం యొక్క సింగపూర్ కథ’ పూర్తి పాఠం

సింగపూర్ పర్యటన సందర్భంగా  ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 37వ సింగపూర్ ఉప‌న్యాసం ‘భారతదేశం యొక్క సింగపూర్ కథ’ పూర్తి పాఠం

సింగపూర్ పర్యటన సందర్భంగా  ప్రధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 37వ సింగపూర్ ఉప‌న్యాసం ‘భారతదేశం యొక్క సింగపూర్ కథ’ పూర్తి పాఠం


గౌరవనీయులైన ప్రధాన మంత్రి లీ సియ‌న్‌ లూంగ్,

గౌరవనీయులైన ఉప ప్రధాన మంత్రి తర్మన్ షణ్ముగరత్నం

మంత్రులు, ప్రొఫెసర్ తాన్ తాయ్ యాంగ్,

సభకు వచ్చేసిన ప్రముఖులారా,

సింగపూర్ ప్రసంగం చేసే అవకాశం, గౌరవం కల్పించినందుకు ప్రత్యేక ధన్యవాదాలు.

నవ భారత నిర్మాణంలో, సింగపూర్‌తో భారత సంబంధాలను మెరుగుపరుచుకోవటంలో కీలకంగా వ్యవహరించిన మాజీ రాష్ట్రప‌తి శ్రీ ఏపీజే అబ్దుల్ కలాం, మాజీ ప్రధానులు శ్రీ పీవీ నరసింహారావు, శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయిగార్ల మార్గదర్శకంలోనే నేను కూడా నడుస్తాను.

సింగపూర్ ప్రధాని కూడా నేటి ఈ కార్యక్రమంలో పాల్గొనటం గౌరవంగా భావిస్తున్నాను.

కొన్ని వారాలుగా ఒకే లక్ష్యంతో మేం పనిచేస్తున్నాం. జీ 20, ఆసియాన్, తూర్పు ఆసియా దేశాల సమావేశాల్లో కలిసే పాల్గొంటున్నాం. మన రెండు దేశాల మధ్య సంబంధాలు, లక్ష్యాలు ఒక్కటే అని చెప్పేందుకు ఇంతకన్నా ఇంకేం కావాలి.

సింగపూర్ స్వాతంత్ర్యం సాధించి 50 ఏళ్లు అయినందున ఇక్కడి ప్రజలకు 125 కోట్ల భారతీయుల పక్షాన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలుపుతున్నాను.
దేశాలు, మనుషుల జీవితాల్లో మైలురాళ్లు చాలా సహజం.

కానీ, కొన్ని దేశాలు జరుపుకొనే తొలి 50 ఏళ్ల సంబరాలు వారి అస్తిత్వానికి, సంతృప్తికి, గౌరవానికి సూచికగా నిలుస్తాయి. సింగపూర్ కూడా ఆ కోవకే చెందుతుంది.
సింగపూర్ నవనిర్మాణ నిర్మాత, మా కాలంనాటి గొప్పనేత లీ క్వాన్ యూకు నివాళులు అర్పించకుండా, ఆయన్ను గుర్తుచేసుకోకుండా సింగపూర్ గురించి మాట్లాడటం సరికాదు.

నవ సింగపూర్ నిర్మాణానికి ఆయన జీవితం అర్పించి చేసిన ప్రయత్నమే నేడు ‘విజయవంతమైన సింగపూర్‌’ రూపంలో కనబడుతోంది.
సింగపూర్ విషయంలో ఆయన కన్నకలలు, వాటిని ఆచరణ రూపంలో పెట్టిన ఆయన నిబద్ధత కారణంగానే నేడు ఈ దేశం స్వర్ణజయంతి ఉత్సవాలు జరుపుకొంటోంది.

ఆయన ఓ దేశానికి పరిమితమైన వ్యక్తి కాదు. ఆయన ప్రభావం ప్రపంచవ్యాప్తంగా స్పష్టంగా కనిపిస్తోంది. భారతదేశం బాగుండాలని లీ ఆకాంక్షించారు. నిజమైన స్నేహం, వాస్తవాలను గుర్తుంచుకునే ఆయన మాట్లాడేవారు. భారత్ శక్తి సామర్థ్యాలను, ప్రపంచవ్యాప్తంగా అది చూపించే ప్రభావాన్ని.. మా దేశంలో ఉన్నవారికంటే బాగా లీ గుర్తించారు.

ఆయన నాకు స్ఫూర్తి మూర్తి, లీ సింగపూర్ కథల నుంచి నేను చాలా నేర్చుకున్నాను.

దేశంలో పరివర్తన అనేది ప్రజల జీవితాల్లో మార్పు ద్వారానే సాధ్యమని నమ్మి.. ఆ దిశగా ప్రయత్నం ప్రారంభించిన లీ ఆలోచన చాలా గొప్పది. అత్యాధునిక మౌలిక వసతులు సమకూర్చుకోవటం ఎంత ముఖ్యమో మన నగరాన్ని శుభ్రంగా ఉంచుకోవటం కూడా అంతే ముఖ్యం.

భారతదేశంలో ఇదే ఉద్దేశంతో స్వచ్ఛ భారత్ ఉద్యమాన్ని ప్రారంభించాం. పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, పర్యావరణాన్ని కాపాడుకోవటం ద్వారా మన ఆలోచనల్లో మార్పు తీసుకువచ్చి.. జీవితంలో, పనిలో ఉన్నతంగా ఆలోచించేలా చేయటమే లక్ష్యం.

నాణ్యత, సమర్థత, ఉత్పాదన ఇవి సాంకేతిక కొలమానాలు మాత్రమే కాదు.. ఇవి జీవన గమనంలో మన ఆలోచన స్థాయిని తెలియజేస్తాయి. మార్చిలో సింగపూర్ పర్యటించినపుడు, భారత్‌లో వివిధ సందర్భాల్లోనూ.. మా నిజమైన మిత్రుడు, చాలా ప్రత్యేక బంధమున్న దేశాన్ని గౌరవించాలనుకున్నాం.

కలలు కని సాకారం చేసుకోవాలనుకునే వారికి సింగపూర్ అనేది కళ్ల ముందు కనబడుతున్న ఓ మంచి ఉదాహరణ.

సింగపూర్‌ చాలా విషయాలను బోధిస్తుంది. దేశం పరిమాణం ఆధారంగా అది సాధించిన విజయాలను కొలువలేము.

ప్రేరణ పొందటం, భవిష్యత్తు గురించిన కలలు, నూతన ఆలోచనలకు.. వనరులు లేకపోవటం అనేది అడ్డంకి కానే కాదు.

ఏ దేశంలో అయితే వైవిధ్యం కల‌సి ఉంటుందో ఆ దేశం ఉమ్మడి ఆలోచనపై అది కల‌సి పనిచేస్తుంది.

అంతర్జాతీయ నాయకత్వం అనేది సంప్రదాయ బలాల నుంచి కాకుండా గొప్ప ఆలోచనల నుంచే పుడుతుంది.

సింగపూర్ కూడా కేవలం ఒక తరం మారే లోపలే ఉన్నత స్థానాలకు చేరే మార్గాన్ని అలవర్చుకుంది.

ఈ ప్రాంత అభివృద్ధికి, సమగ్రతకు సింగపూర్ స్ఫూర్తిగా నిలిచింది.

మనకున్న పరిధుల్లోనే అపరిమితమైన అభివృద్ధి సాధించటం కలో, అసాధ్యమో కాదని సింగపూర్ నిరూపించింది.

ఇప్పుడు సింగపూర్‌కు వస్తున్న పెట్టుబడులు చాలా పెద్ద సంఖ్యలో, ఊహించనంత పెద్ద మొత్తంలో ఉన్నాయి.

నైపుణ్యం ఉన్న మానవ వనరులు, ప్రజల నమ్మకం, స్పష్టమైన ఆలోచన వల్లే సింగపూర్ ఇవాళ ఈ స్థితికి చేరుకుందని నేను భావిస్తున్నా.
కార్యక్రమానికి హాజరైన ప్రముఖుల్లారా,

భారతదేశంలో పరివర్తన తెచ్చేందుకు మేం కూడా ఈ విధానాన్నే అమల్లో పెడుతున్నాం.

మన ప్రయత్నాలకు కారణం ప్రజలు. ఈ మార్పుల వెనుక శక్తి కూడా వాళ్లే.

గణాంకాలు, సంఖ్యల రూపంలో ఉండే మన ప్రయత్నాల ద్వారా విజయాన్ని నేను అంచనా వేయలేను. ప్రజల ముఖాలపై చిరునవ్వు ద్వారానే అసలైన విజయాన్ని తెలుసుకోవచ్చు.

అందుకే, మా పథకాల్లో కొన్ని ప్రజల సాధికారత కోసమే రూపొందించాం.

మిగిలినవి.. మా పౌరులకు అవకాశాలు కల్పించటం, వారి శక్తిసామర్థ్యాలను పెంచటం, వ్యాపార అవకాశాలను మెరుగుపరచటం కోసం రూపొందించాం.

మా ప్రజల నైపుణ్యం పెంచటం, విద్యను అందించటంలోనే మేం పెట్టుబడులు పెడుతున్నాం. ఆడ పిల్లలపై ప్రత్యేక శ్రద్ధ,, స్థిర నివాసం కల్పించటం, స్వచ్ఛమైన నదులు, స్మార్ట్ సిటీలు, పౌరులకు కావాల్సిన నీరు, పారిశుద్ధ్యం నుంచి విద్యుత్తు, ఇళ్ల వరకు అన్ని అవసరాలను తీర్చటంపైనే మేం పనిచేస్తున్నాం.
ప్రకృతిని కాపాడుకోవటం, చెట్ల పెంపకంలో ప్రజలను భాగస్వాములను చేయటం ద్వారా అవకాశాలను కాపాడుకునేలా వారిని ప్రోత్సహిస్తాం.

చట్టాలు, నిబంధనలు, విధానాలు, సంస్థలను సంస్కరించటం ద్వారా అవకాశాలను సృష్టిస్తున్నాం. మా విధానాల్లో పాలన కొనసాగిస్తూనే.. రాష్ట్రాలతో కల‌సి పనిచేస్తున్నాం. మార్పు అనే సాఫ్ట్ వేర్‌ సాయంతో.. పురోగతి అనే హార్డ్‌ వేర్‌ను రూపొందిస్తున్నాం. తర్వాతి తరం మౌలిక సదుపాయాలు, తయారీ రంగంలో పునరుద్ధరణ, మెరుగైన వ్యవసాయం, సరళమైన వ్యాపారంతో పాటు తెలివైన సేవలను అందిస్తున్నాం.

అందుకే ఒకేసారి భిన్న దిశల్లో ప్రయాణాలు చేస్తున్నాం. సమగ్ర వ్యూహంతో అన్నింటినీ కలుపుకొని ముందుకెళ్తున్నాం.
ఏదేమైనా.. భారతదేశం అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా చాలా వేగంగా ఎదుగుతున్నదనే దానికన్నా.. దేశంలో మార్పు చక్రాలు తిరుగుతున్నాయని, ప్రజల్లో నమ్మకం పెరుగుతోందని.. చేరాల్సిన గమ్యం స్పష్టంగా ఉందనేదే చాలా ముఖ్యం.

ఈ విధానం దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. మారుమూల ప్రాంతంలోని వ్యక్తి కూడా ఇప్పుడు.. దేశ ఆర్థిక వ్యవస్థలో భాగస్వామి అవుతున్నాడు.
మిత్రులారా,

కాల గర్భంలో చాలా సందర్భాల్లో.. భారత్, సింగపూర్ కలిసే ఉన్నాయి.

రెండు దేశాల మధ్య సంబంధాలు, సంస్కృతి సంప్రదాయాలు, పాత వాణిజ్య సంబంధాలు, బంధుత్వం చరిత్ర పుటల‌కెక్కాయి.

స్వాతంత్ర్యం వచ్చాక కూడా మన మైత్రి ఇలాగే కొనసాగుతోంది. చాలా సందర్భాల్లో ఒకరితో ఒకరు కల‌సి ముందుకెళ్లాం.

భారతీయులకు సింగపూర్ విజయం కొత్త ఆశ కల్పించింది. మరో వైపు భారత్ కూడా శాంతియుతమైన, సమతుల్య, స్థిర ప్రపంచానికి ఆశాకిరణంగా మారింది.
ఒక్కసారి భారత్ దార్లు తెరవగానే.. సింగపూర్ దేశం భారత తూర్పు వైపు ప్రధాన ద్వారంగా మారిపోయింది.

ఇందుకోసం కఠినంగా శ్రమించింది.. ఈ విజయానికి అర్హత ఉన్న వ్యక్తి గౌర‌వ అనుభ‌వ‌యుక్త‌ మంత్రి గోహ్‌ చోక్ టోంగ్‌. ఆయనే భారత్ – సింగపూర్‌లను ఈ ప్రాంతంతో తిరిగి కలపటంలో కీలక పాత్ర పోషించారు.

భారీ అవకాశాల విషయంలో ఆయనే నా కళ్లు తెరిపించారు.

నేడు, సింగపూర్ ప్రపంచంలోని ఇతర దేశాలకన్నా ముఖ్యమైన వ్యాపార భాగస్వామి. ఈ వ్యూహాత్మక భాగస్వామ్యం రోజురోజుకూ మరింత విస్తరిస్తోంది.
మనకు సమగ్రమైన భద్రత, రక్షణ బంధాలున్నాయి. దీనివల్ల ఉమ్మడి దృష్టితో పాటు పరస్పరం ఆలోచనలను పంచుకుంటున్నాం.

సింగపూర్ ప్రపంచంలో భారత దేశానికి పెట్టుబడులకు ఆకర్షించేందుకు ప్రధాన కేంద్రం. ప్రపంచంలో భారత్ తో ఎక్కువ సంబంధాలు పెట్టుకున్న దేశం కూడా సింగపూరే. ఆగ్నేయ ఆసియాలో ప్రముఖ వ్యాపార భాగస్వామి, విద్యార్థులు, పర్యాటకులకు ప్రధాన గమ్యస్థానం.

ఇప్పడు మా కలలకు అనుగుణంగా భారత్‌ను పునర్నిర్మిస్తున్న సమయంలో సింగపూర్ ప్రధాన భాగస్వామిగా మారింది. ప్రపంచస్థాయి మానవ వనరులు, స్మార్ట్ సిటీలు, స్వచ్ఛమైన నదులు, నాణ్యమైన విద్యుత్తు, భవిష్యత్ తరాల కోసం స్థిరమైన మౌలిక వసతుల కల్పనలో సింగపూర్ ప్రధాన భాగస్వామిగా ఉంది.
బెంగళూరులో తొలి ఐటీ పార్కు స్థాపన నుంచి.. ఆంధ్ర ప్రదేశ్ కొత్త రాజధాని అమరావతి వరకు సింగపూర్ చురుకుగా వ్యవహరిస్తోంది.

మన ఈ భాగస్వామ్యం వల్ల మన దేశాల ఆర్థిక వ్యవస్థలు అభివృద్ధి చెందుతాయి, పెట్టుబడులు, వాణిజ్యం వంటి విషయాలు మరింత మెరుగుపడతాయి.
కానీ నేను మాత్రం సింగపూర్‌ను ఎప్పటికీ ఉన్నతంగానే చూస్తాను.

21వ శతాబ్దంలో ఎదురవుతున్న చాలా సమస్యల పరిష్కారానికి సింగపూర్‌ సాధించిన విజయం ఓ సమాధానం అవుతుందని నేను భావిస్తున్నాను. నీరు, తిండి నుంచి స్వచ్ఛమైన శక్తి, స్థిర నివాసాల వరకు ప్రతీదీ ఇక్కడ ఓ విప్లవమే.

దీంతోపాటు ఈ శతాబ్దిలో మన ప్రాంతంలోని చాలా విషయాలను సింగపూర్ ప్రభావితం చేయగలదు.

ప్రధాన మంత్రి, గౌరవనీయులైన సభ్యులారా,

ఆసియా పసిఫిక్, హిందూ మహా సముద్రం ప్రాంతాలను ఈ ప్రాంతం కలిపి ఉంచుతోంది. అందువల్లే అన్ని ప్రాంతాల చరిత్ర, పెనవేసుకున్న బంధాలు చాలా స్పష్టంగా కనబడుతున్నాయి.

ఈ ప్రాంతం స్వేచ్ఛాస్వాతంత్ర్యాలు విరాజిల్లుతున్న ప్రాంతం. రెండు ప్రముఖమైన దేశాలకు ఇది కేంద్ర స్థానం. ప్రపంచంలోనే పెద్ద ఆర్థిక వ్యవస్థలకు, ప్రపంచంలోనే సమర్థులైన, కష్టపడి పనిచేసే ప్రజలకు ఇది కేంద్ర స్థానం.

ఆసియా పునరావిర్భావం మన ప్రాంతం గొప్పతనానికి నిదర్శనం.

గత శతాబ్దం మధ్యలో ఆసియాలో అలుముకున్న చీకట్లలో.. మొదట్లో జపాన్, ఆ తర్వాత ఆగ్నేయ ఆసియా, కొరియా, చైనాలు వెలుగులు నింపాయి.
ఇప్పడు భారత్ కూడా ఆసియా చైతన్యం, శ్రేయస్సుకు ఆశాకిరణంగా కనబడుతోంది.

కానీ.. ఈ ప్రాంతం చాలా సమాధానం లేని ప్రశ్నలు, పరిష్కారం కాని వివాదాలతో నిండిపోయింది. పోటీ దావాలు, వాటిని మించిన నిబంధనలు, పెరుగుతున్న మిలటరీ శక్తి, అంతకన్నా వేగంగా ఎదుగుతున్న ఉగ్రవాదం, సముద్ర జలాలపై అనిశ్చితి, బలహీనమైన సైబర్ స్పేస్‌ వంటి ఎన్నో సమస్యలున్నాయి.
ఈ ప్రాంతం పెద్ద సముద్రంలో చిన్న ద్వీపం కాదు.. ప్రపంచాన్ని కేంద్రీకృతం చేసే ప్రభావవంతమైన ప్రాంతం.

భారత్ కూడా రాష్ట్రాల మధ్య భేదాభిప్రాయాలున్న దేశం. ఇళ్లు, తిండి, నీటి సమస్యలు ఇంకా అలాగే ఉన్నాయి. ప్ర‌కృతి ఇచ్చిన వరం, సంస్కృతి ఇచ్చిన సంపదపై వేగవంతమైన పురోగతి ప్రభావం స్పష్టంగా కనబడుతోంది. వాతావరణ మార్పుల వల్ల మా వ్యవసాయం, సముద్రతీర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమవుతున్నాయి.
ఆసియా ఇలాంటి విభిన్నమైన పరిస్థితులను చూసింది. కానీ.. ఇకపై ఇలాంటివి చూడకపోవచ్చు. శాంతియుతమైన, స్థిరమైన, సంపన్నమైన భవిష్యత్తుకోసం ఆసియా భిన్నమైన మార్పులతోకూడిన మార్గాలను అన్వేషిస్తోంది.

ఇది విజయం సాధించి తీరాల్సిన ప్రయాణం.

దీన్ని అర్థం చేసుకునేందుకు భారత్-సింగపూర్ కల‌సి ముందుకు సాగాలి.

ఆసియా నుంచి భారతీయ చరిత్రను విడదీసి చూడలేము.

ఇప్పడు, ఆసియాతో మరింత సమగ్రంగా పనిచేయాల్సిన అవసరం ఏర్పడింది. మరోసారి చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం ఏర్పడింది. సహజంగా ఏర్పడిన పాత తరం సముద్ర మార్గాలు, భూ మార్గాలను గుర్తించే పనిలో ఉన్నాం.

మేం అధికారంలోకి వచ్చిన గత 18 నెలల్లో.. మా ప్రభుత్వం ప్రపంచంలోని మిగతా దేశాలతో పోలిస్తే.. ఈ ప్రాంతంపైనే ఎక్కువ దృష్టి సారించింది.

పసిఫిక్ ద్వీపంలోని దేశాలతో మొదలుపెట్టి ఆస్ట్రేలియా, మంగోలియా ల‌తో పాటు చైనాతో మరింత బలమైన సంబంధాలు, జపాన్, కొరియా, ఆసియాన్ దేశాలతో మా భవిష్యత్ దృష్టిని, లక్ష్యాల‌ను పంచుకున్నాం.

భారత్- చైనా ఐదు సహస్రాబ్దాలుగా సరిహద్దులను పంచుకుంటున్నాయి. బౌద్ధ భిక్షువులు, వ్యాపార వేత్తలు, మా బంధాలను, సమాజాన్ని బాగా ప్రభావితం చేశారు.

ఏడో శతాబ్దంలోనే చైనాలోని గ్జువాన్ జాంగ్‌కు ప్రయాణం చేసినట్లు చరిత్ర చెబుతోంది. ఈ ఏడాది మేలో చైనా అధ్యక్షుడు శీ జిన్‌పింగ్‌ ఆహ్వానం మేరకు గుజరాత్‌లోని నా జన్మస్ధానం నుంచి గ్జువాన్ జాంగ్‌కు ప్రయాణం చేసే అవకాశం ల‌భించింది.

సంస్కృతం, పాలి, చైనీస్ భాషల‌లో ఉన్న మత పుస్తకాలను మనం గమనించవచ్చు. అప్పుడు రాసుకునే లేఖల్లోనూ ఈ భాషలకు చాలా ప్రాధాన్యం ఉండేది. భారతదేశంలో ప్రముఖంగా దొరికే టాంచోయ్ చీరలు, సినపట్టా అంటే.. సంస్కృతంలో సిల్క్‌ అని అర్థం.

ఇవాళ చైనా, భారత్‌లు ప్రపంచ జనాభాలో ఐదింట రెండొంతులు, ప్రపంచంలో వేగంగా ఎదుగుతున్న ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాం. చైనా ఆర్థిక పరివర్తన మాకు స్ఫూర్తి.

ఆర్థిక వ్యస్థను సమతుల్యం చేయటంతో పాటు అభివృద్ధిని పరుగులు పెట్టించాలనేది మా ఆలోచన. మేం ఒకరి పురోగతిని మరొకరం ప్రభావితం చేసుకోగలం. ఈ ప్రాంత శ్రేయస్సుకు, స్థిరత్వానికి మా ప్రయత్నం ఉంటుంది.

మేం కల‌సి ముందుకు వెళ్లటం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఉన్నవాణిజ్య, వాతావరణ సమస్యకు ఉమ్మడిగా పరిష్కారం సాధించగలం.

మా మధ్య అప‌రిష్కృత‌మైన‌ సమస్యలు చాలానే ఉన్నాయి. సరిహద్దు సమస్యలే కీలకం. అయినా సరిహద్దుల్లో స్థిరమైన శాంతియుత వాతావరణం కోసం మేం ప్రయత్నిస్తున్నాం. ఏకాభిప్రాయంతో వ్యూహాత్మక సమాచార మార్పిడికి మేం ఒప్పందం కుదుర్చుకున్నాం. ఆర్థిక అవకాశాలపై చర్చిస్తూనే.. ఉగ్రవాదంపై ఉమ్మడి పోరుకు చేతులు కలిపాం.

భారత్‌, చైనాలు రెండు నమ్మకమైన దేశాలుగా, ఒకరి ఆలోచనలు, బాధ్యతలను మరొకరం గౌరవించుకుంటూ.. సత్సంబంధాలు కొనసాగించే దిశగా క్లిష్టమైన సమస్యల పరిష్కారానికి నిర్మాణాత్మకమైన చర్చలు జరపాలని నిర్ణయించాం.

చైనా ఎదుగుదలతో ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో మార్పులు వచ్చినట్లే.. ప్రపంచం కూడా శాంతి, స్థిరత్వం విషయంలో చైనాకు సహాయం అందించేందుకు సిద్ధంగా ఉంది.

భారత్ – జపాన్‌ మధ్య సంబంధాలు కూడా బలంగానే ఉన్నాయి. జపాన్ ప్రధాని షింజో అబే క్యోటోలోని పవిత్ర స్థలాలను, పురాతన ఆధ్యాత్మిక ప్రాంతాలను చూపించారు. అవి రెండు దేశాల మధ్య ఆధ్యాత్మిక బంధాన్ని గుర్తు చేశాయి.

వందేళ్ల క్రితం స్వామి వివేకానంద జపాన్‌ వెళ్లొచ్చాక.. భారతీయ యువత తూర్పు మార్గంలో జపాన్ వెళ్లాలని సూచించారు.

స్వాతంత్ర భారతం ఈ సూచనను బాగా అర్థం చేసుకుంది. జపాన్‌తో కొన్ని విషయాల్లో భాగస్వామ్యం భారత్‌కు చాలా ఉపయోగకరంగా మారింది.

భారత ఆధునికీకరణలో జపాన్ పోషించినంత గొప్ప పాత్ర మరెవరూ పోషించలేదు. కార్లు, మెట్రోలు, పారిశ్రామిక పార్కులు, కొన్ని ఉదాహరణలు మాత్రమే. జపాన్‌ లాగా భారత్‌ను మార్చేందుకు క్రియాశీల‌ పాత్రను కూడా పోషించనుంది.

మా సంబంధాలు మరింత బలోపేతం అయ్యాయి. ప్రశాంతమైన ఆసియా నిర్మాణం, భారత హిందూ మహాసముద్ర ప్రాంతంలో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం చాలా అవసరం.

కొరియా, ఆస్ట్రేలియాలతో బలమైన ఆర్థిక బంధాలను మేం ఏర్పర్చుకున్నాం. ఇందులోనూ వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లనున్నాం.

తూర్పు పాలసీ అమలుకు ఆసియాన్ లంగరు లాంటిది. భౌగోళికంగా, చరిత్ర పరంగా మన మధ్య సంబంధాలున్నాయి. చాలా విషయాలు మనలను ఒకచోట చేర్చాయి. ఉమ్మడి సమస్యల విషయంలో కల‌సికట్టుగా పోరాడాల్సిన విషయాన్ని గుర్తుచేశాయి.

ప్రతి ఆసియాన్ సభ్య దేశంతో మేం లోతైన రాజకీయ, రక్షణ, భద్రత, ఆర్థికపరమైన బంధాలను కొనసాగిస్తున్నాం. ఆసియాన్ సమాజం వల్లే ప్రాంతీయ సమగ్రత సాధ్యమవుతుంది. ఆసియాన్, భారత్ దేశాల్లోని 190 కోట్ల జనాభాను కలిపి ఉంచేలా ఈ ప్రాంతంతో క్రియాశీల భాగస్వామ్యం కోసం ఎదురుచూస్తున్నాం.
ఈ ప్రాంతం మొత్తానికి ఆర్థిక సహకారం కోసం భారత్ నిర్మాణాత్మక ప్రయత్నం చేస్తుంది. ‘ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం’ ద్వారా ఈ బంధాన్ని మరింత బలోపేతం చేసుకోవాలనుకుంటున్నాం.

క్లిష్టమైన సమయాల్లోనూ ఒకరికిమ‌రొకరు అండగా నిల‌చేలా వ్యవస్థలో మార్పు తీసుకువచ్చేందుకు నియమ, నిబంధనలతో సహా సమ‌ష్టిగా మన వైఖరిని నిర్వచించుకోవాల్పిన అవసరం ఉంది.

ఇందుకోసమే మనమంతా ఏకమవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. తూర్పు ఆసియా దేశాల సదస్సు, ఇతర వేదికలు కల‌సి సహకారంతో ఉజ్వలమైన భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలి. ఇందుకోసం అందరం ఒక్క తాటి పైకి రావాలి.

ఇందుకోసం ఈ ప్రాంతంలోని అన్ని దేశాలతో పాటు.. అమెరికా, రష్యా, తూర్పు ఆసియా భాగస్వాములతో కలిసి పనిచేసేందుకు భారత్ సిద్ధంగా ఉంది. సముద్రం, అంతరిక్షం, సైబర్ భ‌ద్ర‌త వంటి రంగాలతో పాటు అన్ని చోట్ల అందరూ సహకరించుకునేలా కృషి చేస్తాం. ఒకరికి మ‌రొకరు కొత్త శత్రువులుగా, పోటీ దారులుగా మారే పరిస్థితిని వ్యతిరేకిస్తాం.

తన సముద్ర జలాల్లో భద్రంగా ఉండటంతో పాటు అందరకీ లాభం చేకూరేలా భారతదేశం వ్యవహరిస్తుంది.

ఈ శతాబ్దపు సమస్యల పరిష్కారం కోసం అన్ని దేశాలు ఒకదానిపై మ‌రొక‌టి ఆధారపడాల్సిన పరిస్థితి ఇప్పుడుంది. మనం కూడా ఈ దార్లోనే వెళ్లాలి. ఎందుకంటే మన సమస్యలు వేర్వేరుగా లేవు.. కానీ ఉమ్మడి సమస్యలే ఎక్కువగా ఉన్నాయి.

ప్రస్తుతం ఉగ్రవాదమే ప్రపంచం ముందున్న అతి పెద్ద సవాలు. వ్యక్తిగతంగా కన్నా ఉమ్మడిగానే దీనిపై పోరాటం చేయాలి. ఉగ్ర నీడ మన దేశాల్లో, మన సమాజాల్లో పాకిపోతోంది. నియామకాల్లో.. లక్ష్యాల ఎంపికలోనూ చొచ్చుకుపోతోంది. ఇది ప్రజల ప్రాణాలు తీయటం మాత్రమే కాదు. ఆర్థిక వ్యవస్థను కూడా దెబ్బ తీస్తుంది.
ఇందుకోసం ప్రపంచమంతా ఏకమవ్వాల్సిన సమయం వచ్చింది. రాజకీయ, న్యాయ, సైనిక, ఇంటలిజెన్స్ ప్రయత్నాలు కలిసే చేయాలి. మన ప్రయత్నాన్ని మరింత విస్తృత‌ప‌ర‌చాలి.

ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించటంతో పాటు మద్దతునిస్తూ.. నిధులు, ఆయుధాలు సమకూరుస్తున్న దేశాలపై చర్యలు తీసుకోవాలి.

ఇందుకోసం దేశాలు ఒకదానికి మ‌రొక‌టి సహకారం అందించుకోవాలి. భిన్నసమాజాలు కూడా ఏకమవ్వాలి. మతం నుంచి ఉగ్రవాదాన్ని వేరు చేసి చూడాలి. అన్ని మతాల‌కు, అన్ని విశ్వాసాలకు గౌరవం దక్కేలా చూడాలి.

పారిస్ సమావేశానికి కొన్ని రోజులు మాత్రమే మిగిలుంది. ఈ సమావేశంలో ఉగ్రవాదంపై పోరుపై ఏకాభిప్రాయం రావాలి. పర్యావరణంపై ఐక్యరాజ్యసమితి రూపొందించిన నియమ నిబంధలనలకు అనుగుణంగా ముందుకెళ్లాలి. ఇది మన ప్రాంతానికి మరీ ముఖ్యంగా చిన్న చిన్న ద్వీపాలకు చాలా కీలకం.

మిత్రులారా,

మనది అసాధారణ అవకాశాలున్న ప్రాంతం. కానీ.. అదే సమయంలో శాంతి, శ్రేయస్సులను నెలకొల్పటం కూడా చాలా ముఖ్యం. ఈ శతాబ్దం ఆసియాదే అని నిరూపించేందుకు మరింత కఠినంగా శ్రమించాల్సిన అవసరం ఉంది.

ఆసియా ప్రపంచంలోనే పురాతన సంస్కృతులు, గొప్ప మతాలు సారం మిళిత‌మైన ప్రాంతం. ఈ ఖండానికే ప్రంపంచంలో ఎక్కువ యువశక్తి ఉంది.
ఆసియా నుంచి తొలి నొబెల్ బహుమతి పొందిన రవీంద్రనాథ్ ఠాగూర్ ఈ ప్రాంతం ఎంత కీలకంగా మారనుందో శతాబ్దం క్రితమే ఊహించారు. తన సత్తా తెలుసుకుని ముందుకు వెళ్లే దిశగా ఆసియా సిద్ధమవుతోంది.

సింగపూర్‌లో అన్ని ప్రాంతాల ఆలోచనలు కలిసిపోతాయి, వైవిధ్యం కొట్టొచ్చినట్లు కనబడుతుంది. ఆశలు, ఆశయాలకు రెక్కలు వస్తాయి. అంతకుముందెప్పుడూ చూడని కొత్త ప్రపంచం దిశగా మరో అడుగు ముందుకేశామని నేను భావిస్తున్నాను.

పరివర్తన చెందిన భారత్ నిర్మాణం, శాంతియుతమైన‌, స్థిరమైన ప్రపంచం కోసం భారత్ చేసే ప్రయాణంలో సింగపూర్ ప్రధాన భాగస్వామి అవుతుంది.

ధన్యవాదాలు