సింగపూర్ అధ్యక్షుడు గౌరవనీయ హెచ్.ఇ. థర్మన్ షణ్ముగరత్నంతో ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గురువారం సమావేశమయ్యారు.
భారత్ – సింగపూర్ భాగస్వామ్యంపై అధ్యక్షుడు థర్మన్ చొరవ తీసుకోవడాన్ని ప్రధాని అభినందించారు. ఉమ్మడి ప్రయోజనాలున్న ద్వైపాక్షిక, అంతర్జాతీయ అంశాలపై నాయకులిద్దరూ చర్చించారు. నమ్మకం, పరస్పర గౌరవం, ప్రయోజనాల ఆధారంగా ఇరుదేశాల మధ్య దీర్ఘకాలిక సంబంధాలు నెలకొన్నాయని పేర్కొన్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య సంబంధాలు మెరుగుపడితే, ఉమ్మడి సమన్వయం దిశగా పటిష్ట మార్గం ఏర్పడుతుందని వారు ప్రకటించారు. అధునాతన తయారీ రంగం, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల్లో భారత్, సింగపూర్ మధ్య సహకార విస్తరణకు సంబంధించి ఆలోచనలు పంచుకున్నారు. వచ్చే ఏడాది భారత్ లో సింగపూర్ అధ్యక్షుడు థర్మన్ కు స్వాగతం పలికేందుకు తాను ఎదురు చూస్తున్నానని ప్రధాని వెల్లడించారు.
Had a very good meeting with Mr. Tharman Shanmugaratnam, the President of Singapore. Our talks focused on the full range of bilateral ties between our nations. We discussed the key focus sectors like skill development, sustainability, technology, innovation and connectivity.… pic.twitter.com/bdivx16hrv
— Narendra Modi (@narendramodi) September 5, 2024