Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సావిత్రీబాయి ఫులే గారి కి మరియు రాణి వేలు నాచియార్ గారి కి వారి జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


సావిత్రీబాయి ఫులే గారి కి మరియు రాణి వేలు నాచియార్ గారి కి వారి జయంతి సందర్భం లో శ్రద్ధాంజలి ని ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఘటించారు.

ఆ ఇరువురు వారి యొక్క కరుణ తోను, ధైర్య, సాహసాల తో సమాజాని కి ప్రేరణ ను ఇచ్చారు మరియు మన దేశ ప్రజల కు వారు అందించినటువంటి తోడ్పాటు అమూల్యమైంది అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

సావిత్రీబాయి ఫులే గారి ని గురించి మరియు రాణి వేలు నాచియార్ గారి ని గురించి ‘మన్ కీ బాత్’ (‘మనసు లో మాట’) కార్యక్రమం లో ప్రధాన మంత్రి తాను వ్యక్తం చేసిన అభిప్రాయాల లో కొన్నింటిని కూడాను ఆయన ఈ సందర్భం లో శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘సావిత్రీబాయి ఫులే గారి కి మరియు రాణి వేలు నాచియార్ గారి కి వారి జయంతి సందర్భం లో ఇవే శ్రద్ధాంజలులు. వారు ఇరువురు వారి యొక్క కరుణ తోను, ధైర్యం, సాహసాల తోను సమాజాని కి ప్రేరణ ను ఇచ్చారు. మన దేశ ప్రజల కు వారు అందించిన టువంటి తోడ్పాటు అమూల్యమైంది గా ఉంది. ఇటీవల #MannKiBaat (‘మనసు లో మాట’) కార్యక్రమం లో వారి కి మనం ఏ విధం గా శ్రద్ధాంజలి ని సమర్పించామో ఇదుగో ఇక్కడ గమనించవచ్చును.’’ అని పేర్కొన్నారు.

 

***

DS/ST