Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాంస్కృతిక వారసత్వాన్ని, సైన్య శక్తిని చాటిన పరేడ్ అద్భుతం: ప్రధాన మంత్రి


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ‘గణతంత్ర దినోత్సవం 2025’ దృశ్యాల్ని పంచుకొంటూ, ఈ ఉత్సవం భారత్‌లో ఏకత్వంలో భిన్నత్వం ఎంతటి జవసత్వాలతో కళకళలాడుతోందీ కళ్లకు కట్టిందని అభివర్ణించారు. వైభవోపేతంగా సాగిన పరేడ్ మన సాంస్కృతిక వారసత్వాన్ని, సైన్య శక్తిని చాటిచెప్పిందని ఆయన అన్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ కొన్ని సందేశాలను పొందుపరుస్తూ ఇలా పేర్కొన్నారు:
‘‘గణతంత్ర దినోత్సవం 2025 వేడుకల దృశ్యాలు కొన్ని ఇవిగో చూడండి..

భారత్‌లో ఏకత్వంలో భిన్నత్వం ఎలా తొణికిసలాడుతోందో. ఈ భవ్య పరేడ్ మన సాంస్కృతిక వారసత్వాన్ని, సైన్య శక్తిని కళ్లెదుట నిలిపింది. చైతన్యం పొంగిపొర్లుతున్న శకటాలు మన రాష్ట్రాల ఘనమైన సంప్రదాయాలను చాటిచెప్పాయి.’’

‘‘కర్తవ్య పథ్‌లో ఈ రోజు ఉదయం నిజంగా స్మరణీయం. ఇవిగో మరిన్ని దృశ్యాలు ..’’

****

MJPS/SR/SKS