Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సాంకేతిక వినియోగం స‌ముచితంగా చేసుకోవాలి

సాంకేతిక వినియోగం స‌ముచితంగా చేసుకోవాలి

సాంకేతిక వినియోగం స‌ముచితంగా చేసుకోవాలి

సాంకేతిక వినియోగం స‌ముచితంగా చేసుకోవాలి

సాంకేతిక వినియోగం స‌ముచితంగా చేసుకోవాలి


నిరంత‌రం వినూత్న ప‌రిపాల‌న ప‌ద్ధ‌తులు, సామ‌ర్య్థాల మెరుగుద‌ల అత్యంత అవ‌స‌ర‌మ‌ని ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ ఉద్ఘాటించారు. పాల‌న‌లో సాంకేతికత‌, స‌దుపాయాల‌ను స‌ముచిత‌రీతిలో వినియోగించుకోవాల‌ని ఆయ సూచించారు. వృత్యంత‌ర శిక్ష‌ణకు వ‌చ్చిన సంయుక్త కార్య‌ద‌ర్శి, అద‌న‌పు కార్య‌ద‌ర్శి హోదాగ‌ల సుమారు 100 మంది సీనియ‌ర్ ఐఏఎస్ అధికారుల‌తో సోమ‌వారం ఆయ‌న భేటీ అయ్యారు. *ప్ర‌గ‌తి* వేదిక ద్వారా వివిధ మంత్రిత్వ శాఖ‌ల‌తో, రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో తానేవిధంగా సంప్ర‌దింపులు జ‌రుపుతున్నానో ప్ర‌ధాని వారికి వివ‌రించారు. ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ ఐఏఎస్ అధికారులు వివిధ అభివృద్ధి కార్య‌క్ర‌మాలు, నీటిపారుద‌ల‌, వ్య‌వ‌సాయం, ఆహారోత్ప‌త్తుల ప్ర‌క్రియ‌, ద్ర‌వ్యోల్బ‌ణం, ప్ర‌జారోగ్యం, గిరిజ‌న సాంఘిక సంక్షేమం, నైపుణ్యాభివృద్ధి, అమ్మాయిల భ్రూణ‌హ‌త్య‌లు త‌దిత‌ర అంశాల‌పై త‌మ అనుభ‌వాల‌ను, ఆలోచ‌న‌ల‌ను ప్ర‌ధానితో పంచుకున్నారు. అధికారుల ఆలోచ‌న‌ల‌ను ప్ర‌ధాని ఈ సంద‌ర్భంగా ప్ర‌శంసించారు. ప‌ర‌స్ప‌ర విశ్వాసంతో క‌ల‌సిక‌ట్టుగా ప‌నిచేయాల‌ని ప్ర‌ధాని అధికారుల‌కు సూచించారు.