Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సహ ప్రాణులతో మన సామరస్యానికీ అమృత సరోవరాల భరోసా: ప్రధానమంత్రి


   మృత సరోవరాల ప్రాముఖ్యం గురించి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక ప్రకటననలో ప్రత్యేకంగా ప్రస్తావించారు. జల సంరక్షణ, అందులో సమాజ భాగస్వామ్యంతోపాటు మనతో కలసి జీవించే ప్రాణులతో మన సామరస్యానికీ భరోసా ఇస్తున్నాయని ఆయన అభివర్ణించారు.

ఈ మేరకు అస్సాంలోని కామ్‌రూప్‌ జిల్లాలోని సింగ్రా వద్ద నిర్మించిన నిర్మల సరోవరంలో మునకలేస్తూ ఏనుగులు వేసవి తాపం నుంచి సేద దీరడంపై అస్సాం ముఖ్యమంత్రి శ్రీ హిమంత బిశ్వ శర్మ చేసిన ట్వీట్‌కు ప్రతిస్పందనగా ఒక ట్వీట్‌ ద్వారా పంపిన సందేశంలో:

“ఇది ఎంతో కనువిందు చేసే దృశ్యం… జల సంరక్షణ, సమాజ భాగస్వామ్యంతోపాటు మనతో భూగోళాన్ని పంచుకునే ప్రాణులతో మన సామరస్యానికీ అమృత సరోవరాలు భరోసా ఇస్తున్నాయి” అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.