Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సహకార సంస్థలను స్వయం సమృద్ధి కలిగినవి, బలమైనవిగా తీర్చిదిద్దాలి;


సహకార సంస్థలను స్వయం సమృద్ధి కలిగినవిగాను, పటిష్టమైనవిగాను తీర్చిదిద్దడమే ‘సహకార్ సే సమృద్ధి’ దృష్టికోణమని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు చెప్పారు.  శ్రీ అమిత్ షా రాసిన వ్యాసం పాలన సంస్కరణలు, విధాన సంస్కరణలు సహకార రంగానికి ఏ విధంగా కొత్త బలాన్ని ఇచ్చిందీ  ప్రముఖంగా ప్రస్తావించిందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో పొందుపరచిన ఒక సందేశానికి శ్రీ నరేంద్ర మోదీ స్పందించి, ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘పాలనపరమైన సంస్కరణలు, విధానపరమైన సంస్కరణలు సహకార రంగానికి ఏ విధంగా కొత్త బలాన్ని ఇచ్చాయో కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి శ్రీ @AmitShah ప్రధానంగా చెప్పారు.  సహకార సంస్థలను స్వయం సమృద్ధి కలిగినవిగాను, పటిష్గమైనవి గాను తీర్చిదిద్దాలనేదే ‘సహకార్ సే సమృద్ధి’ దృష్టికోణం ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.’’