Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్ దార్ పటేల్ గారి ని ఆయన జయంతి సందర్భం లోస్మరించుకొన్న ప్రధాన మంత్రి 


సర్ దార్ పటేల్ గారి జయంతి సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించారు. సర్ దార్ పటేల్ గారు తన అజేయమైనటువంటి ఉత్సాహం తోను, దూరదర్శి రాజనీతజ్ఞత తోను మరియు అసాధారణమైనటువంటి అకింత భావం తోను మన దేశం యొక్క భవిష్యత్తు ను తీర్చిదిద్దారు అని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో నమోదు చేసిన ఒక సందేశం లో –

‘‘సర్ దార్ పటేల్ గారి జయంతి నాడు, మనం ఆయన లోని అజేయమైనటువంటి ఉత్సాహాన్ని, దూరదర్శి రాజనీతజ్ఞత ను మరియు అసాధారణమైనటువంటి అంకిత భావాన్ని గుర్తు కు తెచ్చుకొందాం. ఆయన వాటితో మన దేశ భవిష్యత్తు ను తీర్చిదిద్దారు. జాతీయ ఏకత పట్ల ఆయన కు ఉన్నటువంటి నిబద్ధత ఎల్లప్పటికీ మనకు దారి ని చూపిస్తూ ఉంటుంది. ఆయన అందించిన సేవల కు గాను ఆయన కు మనం సదా రుణపడి ఉంటాం.’’ అని పేర్కొన్నారు.

 

 

***

DS/ST