Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య కు శ్రద్ధాంజలి ఘటించిన ప్రధాన మంత్రి


ఇంజినీర్స్ డే సందర్భం లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య కు శ్రద్ధాంజలి ని సమర్పించారు.

కష్టించి పని చేస్తున్న ఇంజినీర్ లకు ఈ సందర్భం లో శుభాకాంక్షల ను శ్రీ నరేంద్ర మోదీ వ్యక్తం చేశారు.

సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య నుండి తరాల తరబడి నూతన ఆవిష్కరణ ల సంబంధించినటువంటి మరియు దేశ సేవ కు సంబంధించిన టువంటి ప్రేరణ లభిస్తూ ఉంటుంది అని ప్రధాన మంత్రి అన్నారు. ఈ సంవత్సరం లో చిక్కబళ్ళాపుర కు తాను వెళ్ళిన సందర్భం లో, సర్ ఎమ్. విశ్వేశ్వరయ్య కు శ్రద్ధాంజలి ని సమర్పించినప్పటి దృశ్యాల ను సైతం ప్రధాన మంత్రి శేర్ చేశారు.

 

ప్రధాన మంత్రి ఎక్స్ మాధ్యం లో కొన్ని ట్వీట్ లను పెడుతూ, వాటిలో –

‘‘#EngineersDay రోజు న, మనం ఒక దార్శనికుడైనటువంటి ఇంజినీర్ మరియు వ్యవహారకుశలుడు సర్ శ్రీ ఎమ్. విశ్వేశ్వరయ్య కు శ్రద్ధాంజలి ని సమర్పిస్తూ వస్తున్నాం. ఆయన తరాల తరబడి నూతన ఆవిష్కరణల కు మరియు దేశాని కి సేవ చేయడానికి సంబంధించినటువంటి ప్రేరణ ను అందిస్తూనే ఉంటారు. ఈ సంవత్సరం లో చిక్కబళ్ళాపుర కు నేను వెళ్ళిన సందర్భం లో ఆయన కు శ్రద్ధాంజలి ని సమర్పించినప్పటి కొన్ని దృశ్యాలు ఇవిగో.’’

‘‘కష్టించి పని చేస్తున్నటువంటి ఇంజినీర్ లు అందరి కి #EngineersDay తాలూకు శుభాకాంక్ష లు. వారి యొక్క నూతన ఆవిష్కరణ యుక్త ఆలోచన లు మరియు అలుపు ఎరుగనటువంటి సమర్పణ భావం మన దేశం యొక్క ప్రగతి కి ఊతం గా నిలుస్తున్నాయి. మౌలిక సదుపాయాల రంగం లో అద్భుతాలు మొదలుకొని సాంకేతిక విజ్ఞాన రంగం లో సాఫల్యాల వరకు చూస్తే, వారు అందించినటువంటి తోడ్పాటు లు మన జీవనం లోని ప్రతి ఒక్క పార్శ్వంతో జతపడి ఉన్నాయి.’’ అని పేర్కొన్నారు.