Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సరిహద్దు భద్రతా దళం ఏర్పాటు దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి శుభాకాంక్షలు


సరిహద్దు భద్రతా దళం  (బీఎస్ఎఫ్) ఏర్పాటు దినోత్సవం ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ బీఎస్ఎఫ్ కు శుభాకాంక్షలు తెలియజేశారు. దేశ రక్షణలో కీలక పాత్రను పోషిస్తూ, ధైర్యసాహసాలకు, అంకితభావానికి, అసామాన్య సేవకు ప్రతీకగా ఉంటున్నందుకుగాను బీఎస్ఎఫ్‌ను ఆయన ప్రశంసించారు.

 

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో పొందుపరిచిన ఒక సందేశంలో ప్రధానమంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:

సరిహద్దు  భద్రతా దళం  (బీఎస్ఎఫ్) ఏర్పాటు  దినోత్సవం సందర్భంగా బీఎస్ఎఫ్‌కు హృదయపూర్వక శుభాకాంక్షలు. దేశ రక్షణలో  బీఎస్ఎఫ్ కీలక పాత్రను పోషిస్తూ, ధైర్యసాహసాలకు, అంకితభావానికి, అసామాన్య సేవకు ప్రతీకగా ఉంటోంది. కంటికి కునుకనేదే ఎరుగకుండా అప్రమత్తంగా ఉంటూ, తన ధైర్యసాహసాలతో మన దేశ ప్రజల సురక్షకు, భద్రతకు పాటు పడుతోంది.

 

 

***

MJPS/SR