Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సరిహద్దు ప్రాంతాల గ్రామాల ను సందర్శించవలసిందంటూ యువత కు విజ్ఞప్తి చేసిన ప్రధాన మంత్రి


సరిహద్దు ప్రాంతాల గ్రామాల ను సందర్శించాలి అంటూ ప్రతి ఒక్కరి కి, మరీ ముఖ్యం గా భారతదేశం లోని యువతీ యువకులకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు
ఇది వేరు వేరు సంస్కృతుల ను మన యువత కు పరిచయం చేస్తుందని, అంతేకాక వారికి అక్కడ నివసిస్తున్నవారి యొక్క ఆతిథ్యాన్ని అనుభవం లోకి తెచ్చుకొనే అవకాశాన్ని కూడా ఇస్తుందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.

అమృత్ మహోత్సవ్ యొక్క ట్వీటర్ హేండల్ లోని కొన్ని ట్వీట్ లలో ఒడిశా లో యువతీ యువకులు ‘వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్’ లో భాగం గా కిబిథూ మరియు తూతింగ్ గ్రామాల ను సందర్శిస్తున్నారని తెలియజేసింది.

వైబ్రంట్ విలేజెస్ ప్రోగ్రామ్ అనేది యువతీ యువకుల కు దేశ ఈశాన్య ప్రాంతం లోని ప్రజల జీవన శైలి, తెగలు, జానపద సంగీతం మరియు హస్తకళల ను గురించి తెలుసుకొని అక్కడి స్థానిక రుచుల ను ఆస్వాదించేందుకు, అక్కడి ప్రాకృతిక శోభ లో మైమరచేందుకు వీలు ను కల్సిస్తున్నది.

అమృత్ మహోత్సవ్ ట్వీట్ లకు ప్రధాన మంత్రి ప్రతిస్పందిస్తూ –

‘‘తప్పక గుర్తు పెట్టుకోదగ్గ అనుభవమే అయి ఉండి ఉంటుంది అని నేను తలుస్తాను. ఇతరులను సైతం మరీ ముఖ్యం గా భారతదేశం లోని యువతీ యువకులు సరిహద్దు ప్రాంతాలలోని గ్రామాల ను చుట్టిరావలసింది గా నేను కోరుతున్నాను. ఇది మన యువత కు వేరు వేరు సంస్కృతుల ను పరిచయం చేస్తుంది, అంతేకాకుండా వారికి అక్కడ నివసిస్తున్న ప్రజల యొక్క ఆతిథ్యాన్ని గురించి తెలుసుకొనేటటువంటి అవకాశాన్ని కూడా ఇస్తుంది.’’ అని పేర్కొన్నారు.

 

 

***

 

DS/ST