Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సముద్ర గర్భంలోని ద్వారక నగరంలో ప్రధానమంత్రి మోదీ ప్రార్థనలు

సముద్ర గర్భంలోని ద్వారక నగరంలో ప్రధానమంత్రి మోదీ ప్రార్థనలు


   ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ సముద్రం గర్భంలో ద్వారక నగరం మునిగిన లోతైన ప్రదేశానికి చేరుకుని ప్రార్థనలు చేశారు. ఈ అనుభవం భారత ఆధ్యాత్మిక-చారిత్రక మూలాలతో ప్రజానీకానికిగల అరుదైన, లోతైన అనుబంధాన్ని రుజువు చేసింది. సుసంపన్న సాంస్కృతిక, ఆధ్యాత్మిక వారసత్వంతో ఊహకందనంత ఆకర్షణీయ ద్వారకా నగరానికి ప్రధాని మోదీ నివాళి అర్పించారు. ఈ సందర్భంగా జలాంతర్భాగంలో శ్రీకృష్ణ భగవానుని మనసారా స్మరిస్తూ నెమలి ఈకలను వదిలారు.

దీనిపై ప్రధానమంత్రి ‘ఎక్స్’ ద్వారా పంపిన ఒక సందేశంలో:

   ‘‘సముద్ర గర్భంలోని ద్వారకా నగరంలో ప్రార్థనలు చేయడం ఎంతో దివ్యానుభూతి. ఈ సందర్భంగా ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తిప్రపత్తుల ప్రాచీన యుగంతో కొన్ని క్షణాలు మమేకమయ్యాను. శ్రీ కృష్ణ భగవానుడు మనందరినీ ఆశీర్వదించుగాక!’’ అని పేర్కొన్నారు.