Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంస్కృత దినం నాడు దేశ ప్ర‌జ‌ల‌కు సంస్కృత భాష‌లో అభినంద‌న‌లు తెలిపిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ సంస్కృత దినం సంద‌ర్భంగా దేశ ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు. ఆయ‌న సంస్కృత భాష‌లోనే త‌న అభినంద‌న‌లను ప్ర‌జ‌ల‌తో పంచుకొన్నారు.

ఆయన సంస్కృతంలో తెలిపిన శుభాకాంక్ష‌ల పాఠం ఈ కింది విధంగా ఉంది:

“भारतस्य समृद्धः इतिहासः संस्कृतिः परम्परा च संस्कृते अस्ति। संस्कृतस्य ज्ञानम् अस्मान् तेन समृद्ध-वैभवोपेत-अतीतेन सह योजयति।“

“संस्कृतप्रेमिभ्यः तथा च अस्याः सुन्दर्याः भाषायाः पठितृभ्यः सर्वेभ्यः संस्कृतदिवस-सन्दर्भे मम हार्दिक-शुभकामनाः।”

భార‌త‌దేశ సుసంప‌న్న చ‌రిత్ర, సంస్కృతి మ‌రియు సంప్ర‌దాయాలు సంస్కృతంతో ముడిప‌డి ఉన్నాయి. సంస్కృత భాషా జ్ఞానం మ‌న యొక్క సుసంప‌న్న‌మైన‌టు వంటి సాహిత్యంతో, వార‌స‌త్వంతో, విఖ్యాతమైన గ‌తంతో మనలను అనుసంధానిస్తోంది. సంస్కృత దినాన్ని పుర‌స్క‌రించుకొని, ఈ ర‌మ్య‌మైనటువంటి భాష యొక్క పండితుల‌కు, విద్యార్థుల‌కు నేను నా హృద‌య పూర్వ‌క అభినంద‌న‌లను తెలియజేస్తున్నాను అనేదే.. ఈ సందేశం యొక్క భావంగా ఉంది.

******