మంగళప్రదమైన ‘సంవత్సరి’ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ తన సందేశాన్ని సామాజిక ప్రసార మాథ్యమ వేదిక ‘ఎక్స్’ లో పంచుకున్నారు. సామరస్యానికీ, క్షమకీ మన జీవనంలో ఉన్న ప్రాముఖ్యాన్ని ఈ సందేశం లో ఆయన స్పష్టం చేశారు. సహానుభూతినీ, సంఘీభావాన్నీ అక్కున చేర్చుకొని, మన అందరం సాగిస్తున్న ప్రయాణంలో ముందున్న దారిని మనకు చూప గలిగిన దయ, ఏకత్వాల చైతన్యాన్ని పెంచుకోవలసిందంటూ పౌరులకు ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రధాన మంత్రి ఈ కింది విధంగా పేర్కొన్నారు:
‘‘సద్భావనతో జీవనం గడపడానికీ, ఇతరులను క్షమించడానికీ ఎంతటి శక్తి ఉందో ‘సంవత్సరి’ సందర్భం ప్రముఖంగా ప్రకటిస్తోంది. సహానుభూతినీ, ఐకమత్యాన్నీ మనలో ప్రేరణను నింపేవిగా ఎంచి ఆ సద్గుణాలను అవలంబించాలని ఈ సంవత్సరీ మనకు చాటి చెబుతోంది. ఈ చైతన్యాన్ని అలవరచుకొని, సమష్టితత్వం తాలూకు బంధాన్ని గాఢతరంగా మలచుకోవడంతో పాటు ఆ బంధాన్ని మనం నవనీకరించుకొందాం. దయాళుత్వం, ఏకత్వాలు మన భావి జీవన యానంలో మనకు మార్గదర్శనం చేయుగాక. మిచ్చామి దుక్కడమ్.’’
Samvatsari highlights the strength of harmony and to forgive others. It calls for embracing empathy and solidarity as our source of motivation. In this spirit, let us renew and deepen bonds of togetherness. Let kindness and unity shape our journey forward. Michhami Dukkadam!
— Narendra Modi (@narendramodi) September 7, 2024