Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంయుక్త సంస్థ అయినటువంటి ఇండో-ర‌ష్య‌న్ రైఫల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను అమేఠీ లో దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

సంయుక్త సంస్థ అయినటువంటి ఇండో-ర‌ష్య‌న్ రైఫల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను అమేఠీ లో దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

సంయుక్త సంస్థ అయినటువంటి ఇండో-ర‌ష్య‌న్ రైఫల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను అమేఠీ లో దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి

సంయుక్త సంస్థ అయినటువంటి ఇండో-ర‌ష్య‌న్ రైఫల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ను అమేఠీ లో దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేసిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఉత్త‌ర్ ప్ర‌దేశ్ లోని అమేఠీ లో గ‌ల కహుర్ ను నేడు సంద‌ర్శించారు. కలాశ్నికోవ్ ఎసాల్ట్ రైఫిల్ ఉత్ప‌త్తి కోసం ఉద్దేశించిన సంయుక్త సంస్థ ఇండో-ర‌ష్య‌న్ రైఫల్స్ ప్రైవేటు లిమిటెడ్ ను దేశ ప్ర‌జ‌ల కు ఆయ‌న అంకితం చేశారు.

అమేఠీ లో వివిధ అభివృద్ధి ప‌థ‌కాల ను ఆయ‌న దేశ ప్ర‌జ‌ల కు అంకితం చేశారు; కొన్ని అభివృద్ధి ప‌థ‌కాల కు శంకుస్థాప‌న కూడా చేశారు.

ఈ సంద‌ర్శం గా ర‌ష్య‌న్ ఫెడ‌రేశ‌న్ అధ్య‌క్షులు మాన్య శ్రీ వ్లాదిమీర్ పుతిన్ పంపిన ఒక ప్ర‌త్యేక సందేశాన్ని ర‌క్ష‌ణ శాఖ మంత్రి శ్రీ‌మ‌తి నిర్మ‌ల సీతార‌మ‌ణ్‌ చ‌దివి వినిపించారు. ‘‘ప్రపంచ ప్ర‌ఖ్యాత కలాశ్నికోవ్ ఎసాల్ట్ రైఫల్స్ కు చెందిన అత్యంత నవీనమైన 200 సిరీజ్ ను ఈ సంయుక్త సంస్థ త‌యారు చేస్తుంది. కాల క్ర‌మం లో ఈ రైఫల్స్ పూర్తి స్థాయి లో స్థానికం గానే తయారయ్యే దశ కు ఈ సంస్థ చేరుకొంటుంది. ఆ విధం గా, చిన్న ఆయుధాల కేట‌గిరీ లో దేశ భ‌ద్ర‌త సంస్థ ల‌ యొక్క అవ‌స‌రాల ను పరిపూర్ణంగా నెర‌వేర్చే అవ‌కాశం భార‌తీయ ర‌క్ష‌ణ- పారిశ్రామిక రంగాని కి దక్కనుంద‌’’ని ఆ సందేశం లో పేర్కొన్నారు.

జ‌న స‌మూహాన్ని ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగిస్తూ, ఈ భాగ‌స్వామ్యానికి గాను అధ్య‌క్షులు మాన్య శ్రీ పుతిన్ కు ధ‌న్య‌వాదాలు తెలిపారు. అమేఠీ లోని ఈ స‌దుపాయం లో ల‌క్ష‌లాది రైఫళ్ళ ను త‌యారు చేయ‌డం జ‌రుగుతుంద‌ని, త‌ద్వారా మ‌న భ‌ద్ర‌త ద‌ళాల కు శ‌క్తి ల‌భిస్తుంద‌న్నారు.

ఈ ప‌రిణామం చోటు చేసుకోవ‌డం లో ఎంతో జాప్యం జ‌రిగింద‌ని కూడా ఆయ‌న చెప్పారు. మ‌న సైనికుల కోసం ఆధునిక రైఫళ్ళ ఉత్ప‌త్తి లో చోటుచేసుకొన్న ఈ జాప్యం నిజాని కి జ‌వానుల కు అన్యాయం చేసినట్లే అని ఆయ‌న అన్నారు. 2009వ సంవ‌త్స‌రం లో బులిట్ ప్రూఫ్ జాకెట్ ల ఆవ‌శ్య‌క‌త ను గుర్తించిన‌ప్ప‌టికీ, అటువంటి జాకెట్ లను 2014వ సంవ‌త్స‌రం వ‌ర‌కు కొనుగోలు చేయ‌లేద‌ని ఆయ‌న గుర్తు కు తెచ్చారు. ఈ అవ‌స‌రాన్ని కేంద్ర ప్ర‌భుత్వం ప్ర‌స్తుతం నెర‌వేర్చింద‌ని ఆయ‌న తెలిపారు. ఇంత‌కు ముందు ఇత‌ర అస్త్రాల కొనుగోలు లో సైతం ఈ త‌ర‌హా జాప్యాలు జ‌రుగుతూ వ‌చ్చాయని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భం గా ర‌ఫేల్ యుద్ధ విమానాల ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ఇవి కేంద్ర ప్ర‌భుత్వం యొక్క కృషి ఫ‌లితం గా కొద్ది నెల‌ల్లో వైమానిక ద‌ళం లో చేర‌డం మొద‌ల‌వుతుంద‌ని కూడా ఆయ‌న వెల్ల‌డించారు.

అమేఠీ లో ఇత‌ర అభివృద్ధి ప‌థ‌కాల ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. వీటి కార్య‌క‌లాపాలు ఆరంభం కావ‌డం లో వివిధ అంత‌రాయాలు ఎదుర‌వుతూ ఉండ‌టాన్ని గురించి ఆయ‌న వివ‌రించారు. ఆ అవ‌రోధాల ను తొల‌గించ‌డం జ‌రుగుతోంద‌ని, త‌త్ఫ‌లితం గా ఆ ప‌థ‌కాలు ఆరంభానికి నోచుకొని ప్ర‌జ‌ల కు ఉపాధి ని స‌మ‌కూర్చే అవ‌కాశం ఉంద‌ని ఆయ‌న చెప్పారు. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న, ఉజ్జ్వ‌ల యోజ‌న‌, సౌభాగ్య యోజ‌న‌, ఇంకా టాయిలెట్ ల నిర్మాణం వంటి ప‌థ‌కాలు అమేఠీ లో అమ‌ల‌వుతున్నాయ‌ని, ఈ ప‌థ‌కాలు ప్ర‌జ‌ల కు జీవించడం లో సౌల‌భ్యాన్ని ప్ర‌సాదిస్తున్నాయ‌ని ఆయ‌న అన్నారు.

పేద‌ల కు కేంద్ర ప్ర‌భుత్వం సాధికారిత ను క‌ల్పిస్తోంద‌ని, వారు పేద‌రికం బారి నుండి బ‌య‌ట ప‌డేందుకు తోడ్పడుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఇదే విధం గా రైతు ల‌కు సాధికారిత ను క‌ల్పించ‌డం జ‌రుగుతోంద‌ని ఆయ‌న చెప్పారు. ఈ సంద‌ర్భం గా ‘ప్ర‌ధాన మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి’ని గురించి ఆయ‌న ప్ర‌స్తావించారు. ఈ ప‌థ‌కం రాబోయే ప‌ది సంవ‌త్స‌రాల కాలం లో 7.5 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు రైతుల కు చేరేందుకు పూచీ ప‌డనుంద‌ని ఆయ‌న అన్నారు.