భారతదేశాని కి, రిపబ్లిక్ ఆఫ్ కొరియా కు మధ్య 2019వ సంవత్సరం ఫిబ్రవరి లో సంతకాలు జరిగిన ఒక అవగాహన పూర్వక ఒప్పందం (ఎంఒయు) తాలూకు వివరాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించిన కేంద్ర మంత్రివర్గ సమావేశం దృష్టి కి తీసుకురావడమైంది.
‘‘కొరియా రాణి హుర్ హ్వాంగ్-ఓక్’’కు చెందిన తపాలా బిళ్ళల ను సంయుక్తం గా జారీ చేసే అంశం పై భారత ప్రభుత్వ కమ్యూనికేశన్స్ మంత్రిత్వ శాఖ లోని తపాలా విభాగం మరియు రిపబ్లిక్ ఆఫ్ కొరియా ప్రభుత్వం లోని విజ్ఞాన శాస్త్రం, ఇంకా ఐసిటి మంత్రిత్వ శాఖ (కొరియా పోస్ట్)లు పరస్పరం అంగీకారానికి వచ్చాయి.
సంయుక్త తపాలా బిళ్ళ ను ఉభయ పక్షాల కు అంగీకారం కుదిరిన తేదీ నాడు, 2019వ సంవత్సరం ముగిసే లోపే, విడుదల చేస్తారు.