Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంప్ర‌దాయ వైద్యం, హోమియోపతి రంగాల‌ లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాని కి సంబంధించి భారతదేశం మరియు గినీ ల మ‌ధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి


సాంప్ర‌దాయక వైద్య విధానాలు మరియు హోమియోప‌తి ల రంగం లో స‌హ‌కారాని కై భార‌తదేశ గణతంత్ర ప్ర‌భుత్వాని కి మరియు గినీ గణతంత్ర ప్రభుత్వానికి మ‌ధ్య కుదిరినటువంటి అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రాని కి (ఎమ్ఒయు కు) ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌ న స‌మావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. రాష్ట్ర‌ప‌తి శ్రీ రాం నాథ్ కోవింద్ గినీ లో 3 రోజుల పాటు జ‌రిపిన ప‌ర్య‌ట‌న కాలం లో 2019వ సంవత్సరం ఆగ‌స్టు 2వ తేదీ న ఎమ్ఒయు పై సంత‌కాలు అయ్యాయి.

ప్ర‌ధాన ప్ర‌భావం:

ఈ ఒప్పందం సాంప్ర‌దాయక వైద్యం లో ఉభ‌య‌ దేశాల మ‌ధ్య ద్వైపాక్షిక స‌హ‌కారాన్ని మ‌రింత ముందుకు తీసుకు పోతుంది. ఉభ‌య దేశాల సాంస్కృతిక వార‌స‌త్వాన్ని గ‌మ‌నం లోకి తీసుకున్న‌ప్పుడు ఈ ఒప్పందం రెండు దేశాల‌కు అమిత ప్ర‌ధాన‌మైంది గా ఉంటుంది.

అమ‌లు వ్యూహం మరియు ల‌క్ష్యాలు:

సంత‌కాలు జరిగిన ఎమ్ఒయు ప్రతి ని అందుకొన్న‌ త‌రువాత రెండు వైపులా కార్య‌క‌లాపాలు మొదలవుతాయి. ఎమ్ఒయు లోని విధి విధానాల ఆధారం గా కార్య‌క‌లాపాల‌ ను చేప‌ట్ట‌డం జ‌రుగుతుంది. ఇది అవ‌గాహనపూర్వక ఒప్పందం అమ‌లు లో ఉన్నంత‌ కాలం కొనసాగే ప్ర‌క్రియ‌ గా ఉంటుంది.

ఇందుకు అయ్యేటటువంటి వ్యయం:

ఈ కార్య‌క్ర‌మాని కి సంబంధించి అద‌న‌పు ఆర్థిక అంతస్సూచన లు ఏవీ లేవు. ప‌రిశోధ‌న‌, శిక్ష‌ణ‌, స‌ద‌స్సు లు, స‌మావేశాలు, నిపుణుల‌ ను డెప్యుటేశన్‌ పై పంప‌డం వంట వాటికి అవ‌స‌ర‌మైన ఆర్థిక వ‌న‌రుల ను ప్ర‌స్తుతం కేటాయించిన బ‌డ్జెటు, ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ ప్ర‌స్తుత ప్ర‌ణాళిక ప‌థ‌కాల‌ నుండి భరిస్తారు.

పూర్వరంగం

భార‌త ప్ర‌భుత్వ ఆయుష్ మంత్రిత్వ‌ శాఖ ఆయుష్ ప్రణాళిక (ఆయుర్వేద‌ం, యోగ‌, ప్రాకృతిక చికిత్స , యునానీ, సిద్ధ‌, సోవా- రిగ్పా, హోమియోప‌తి లు సహా) లను ప్రపంచం అంతటా ప్రోత్సహించడం తో పాటు ప్రచారం చేసేందుకు అధికారాన్ని క‌లిగివుంది. దీనిలో భాగంగా ఆయుష్ శాఖ సంప్ర‌దాయ వైద్యం లో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారాని కి ఆయా దేశాల‌ తో అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రాల పై సంత‌కాలు చేసింది. వివిధ దేశాల‌ లో గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యాల‌ లో ఆయుష్ అక‌డ‌మిక్ చైర్‌ల‌ను కూడా ఏర్పాటు చేసింది.

గినీ లో ఆయుష్ వైద్య వ్య‌వ‌స్థ‌ కు సంబంధించి ప్రోత్సాహం, ప్ర‌చారం క‌ల్పించాల్సిన అవ‌స‌రాన్ని దృష్టి లో పెట్టుకొని సంప్ర‌దాయ వైద్యం , హోమియోప‌తి లలో ప‌ర‌స్ప‌ర స‌హ‌కారానికై మ‌న ప్ర‌మాణీకృత ముసాయిదా అవ‌గాహ‌నపూర్వక ఒప్పంద పత్రాన్ని విదేశీ వ్య‌వ‌హారాల మంత్రిత్వ‌ శాఖ‌ లోని ప‌శ్చిమ ఆఫ్రికా విభాగం ద్వారా గినీ ప్ర‌భుత్వాని కి అంద‌జేయ‌డం జ‌రిగింది.