Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

సంప్రదాయ వైద్య విధానాల రంగం లో సహకారాని కి భారతదేశం, గాంబియా ల మధ్య ఎమ్ఒయు కు ఆమోదం తెలిపిన మంత్రిమండలి


సంప్రదాయ వైద్య విధానాల రంగం లో సహకారానికి సంబంధించి భారతదేశం, గాంబియా ల మధ్య కుదిరిన అవగాహనపూర్వక ఒప్పంద పత్రాని కి (ఎమ్ఒయు కు) ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత న సమావేశమైన కేంద్ర మంత్రిమండలి ఎక్స్- పోస్ట్ ఫ్యాక్టో ఆమోదాన్ని తెలిపింది. గాంబియా లో రాష్ట్రపతి రాం నాథ్ కోవింద్ పర్యటన సందర్భం గా ఈ ఎమ్ఒయు పై 2019వ సంవత్సరం జూలై 31వ తేదీ న సంతకాలు అయ్యాయి.

సంప్రదాయ వైద్యవిధానాల లో భారతదేశం, గాంబియా ల మధ్య సహకారం కోసం ఒక ఫ్రేమ్ వర్క్ కు ఈ ఒప్పందం వీలు కల్పిస్తుంది. దీని వల్ల ఈ రంగం లో రెండు దేశాలు లబ్ధి ని పొందుతాయి. సదరు ఎమ్ఒయు లో పేర్కొన్న కార్యకలాపాల వల్ల గాంబియా లో భారత ఆయుష్ మంత్రిత్వ శాఖ పరిధి లోని వైద్య వ్యవస్థల కు ప్రాధాన్యం ఇనుమడిస్తుంది. ఈ ఒప్పందం అమలు లో భాగం గా వైద్య నిపుణులు, శాస్త్రవేత్త ల ఆదాన ప్రదానం తో పాటు సదరు వైద్య విధానాల ను ఆచరించే వారి కి శిక్షణ తో పాటు సంప్రదాయ వైద్య విధానాల పై సంయుక్త పరిశోధనల ను చేపట్టేందుకు వీలు ఉంటుంది. సంప్రదాయ వైద్య విధాన ఆచరణ తో పాటు సరికొత్త ఔషధాల రూపకల్పన కు ఈ ఒప్పందం దోహదపడుతుందని అంచనా.