Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

షిల్లాంగ్ ఛాంబర్ గాయక బృందానికి చెందిన శ్రీ నీల్ నాంగ్‌ కిన్రిహ్ మృతికి సంతాపం ప్రకటించిన – ప్రధానమంత్రి


షిల్లాంగ్ ఛాంబ‌ర్ గాయక బృందానికి గురువు, నిర్వాహకుడు శ్రీ నీల్ నాంగ్‌ కిన్రిహ్ మృతి పట్ల ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ, విచారం వ్యక్తం చేశారు.

ఈ మేరకు సామాజిక మాధ్యమం ద్వారా ప్రధానమంత్రి ఒక ట్వీట్ చేస్తూ, 

ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న షిల్లాంగ్ ఛాంబర్ గాయక బృందానికి శ్రీ నీల్ నాంగ్‌ కిన్రిహ్ అత్యుత్తమ గురువు. వారి అద్భుతమైన ప్రదర్శనలను నేను కూడా చూశాను. ఆయన చాలా త్వరగా మనల్ని విడిచి వెళ్ళి పోవడం విచారకరం. ఆయన సృజనాత్మకత ఎప్పటికీ గుర్తుండిపోతుంది.  ఆయన కుటుంబ సభ్యులకు, అభిమానులకు నా సానుభూతి తెలియజేస్తున్నాను. వారి పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని ప్రార్ధిస్తున్నాను.” అని పేర్కొన్నారు.

 

*****

 

DS/AKJ