Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

షహీదాబాద్ ఆర్ఆర్టీఎస్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ వరకూ నమో భారత్ రైలులో ప్రయాణం సందర్భంగా విద్యార్థులు, లోకోపైలట్లతో ప్రధాని సంభాషణ

షహీదాబాద్ ఆర్ఆర్టీఎస్ నుంచి న్యూ అశోక్ నగర్ ఆర్ఆర్టీఎస్ స్టేషన్ వరకూ నమో భారత్ రైలులో ప్రయాణం సందర్భంగా విద్యార్థులు, లోకోపైలట్లతో ప్రధాని సంభాషణ


ప్రధానమంత్రి: అంటే నువ్వు కళాకారుడివి అన్న మాట?

విద్యార్థి: సర్, ఇది మీ కవిత.

ప్రధానమంత్రి: ఓహ్, నా కవిత నువ్వు చదువుతావా?

విద్యార్థి:

‘‘అప్ నే మన్ మే ఏక్ లక్ష్య్ లియే, మంజిల్ అప్ నీ ప్రత్యక్ష్ లియే

హమ్ తోడ్ రహే హై జంజీరే, హమ్ బదల్ రహే హై తకదీరే

యే నవయుగ్ హై, యే నవ భారత్, హమ్ ఖూద్ లిఖేంగే అప్ నీ తకదీర్

హమ్ బదల్ రహే హై తస్వీర్, ఖూద్ లిఖేంగే అప్ నీ తకదీర్

హమ్ నికల్ పడే హై ప్రణ్ కర్ కే, తన్-మన్ అప్ నా అర్పణ్ కర్ కే

జిద్ హై, జిద్ హై ఏక్ సూర్య్ ఉగానా హై, అంబర్ సే ఊంచా జానా హై

ఏక్ భారత్ నయా బనానా హై, అంబర్ సే ఊంచా జానా హై, ఏక్ భారత్ నయా బనానా హై.’’

(మది నిండా ఒక లక్ష్యం, గమ్యం పైనే మన దృష్టంతా..
అవరోధాలను బద్దలు గొడుతూ, మన భవితను రూపుదిద్దుకుంటున్నాం.
ఇది నవశకం, ఇది నవభారతం.. మన తలరాతను మనమే రాసుకుందాం.
దేశ ముఖచిత్రాన్ని మార్చేస్తున్నాం.. మన తలరాతను మనమే రాసుకుందాం.
తనువులనూ, మనస్సులనూ పునరంకితం చేస్తూ సరికొత్తగా ప్రతిన బూనాము –
కొత్త ఆరంభానికి నేను సిద్ధమయ్యాను.. నేను నిశ్చయించాను –
ఆకాశాన్ని దాటి వెళ్లాలి
నవ భారతాన్ని మనం నిర్మించాలి,
ఆకాశం కన్నా ఎత్తుకు మనం ఎదగాలి,
నవ భారతాన్ని మనం నిర్మించాలి).

ప్రధానమంత్రి: వావ్.

ప్రధానమంత్రి: నీ పేరేంటి?

విద్యార్థి: (స్పష్టంగా లేదు.)

ప్రధానమంత్రి: మీకు ఇల్లొచ్చిందా? కొత్త ఇంటితో మంచి జరుగుతుంది — శభాష్!

విద్యార్థి: (స్పష్టంగా లేదు.)

ప్రధానమంత్రి: వావ్, మంచిది.

ప్రధానమంత్రి: యూపీఐ…

విద్యార్థి: అవును సర్. మీ వల్లే ఈరోజు ప్రతి ఇంట్లో యూపీఐ ఉంది.

ప్రధానమంత్రి: ఇది నువ్వే చేస్తావా?

విద్యార్థి: అవును.

ప్రధానమంత్రి: నీ పేరేంటి?

విద్యార్థి: ఆర్ణా చౌహాన్.

ప్రధానమంత్రి: అవునా..

విద్యార్థి: నేను మీ కోసం కవిత కూడా చెప్పాలనుకుంటున్నాను.

ప్రధానమంత్రి: నువ్వు కవిత చెప్తే వినాలనుకుంటున్నాను. చెప్పు..

విద్యార్థి: ‘‘నరేంద్ర మోదీ ఏక్ నామ్ హై, జీ మీత్ కా నయీ ఉడాన్ హై,

ఆప్ లగే హో దేశ్ కో ఉడానే కే లియే, హమ్ భీ ఆప్ కే సాథ్ హై దేశ్ కో బఢానే కే లియే’’
(నరేంద్ర మోదీ అంటే దిగంతాలకూ వినిపించే పేరు మిత్రమా..
దేశాన్ని ఉన్నతంగా నిలిపే మీ కృషిలో
దేశ వృద్ధికి పాటుపడుతూ మీవెంటే మేముంటాం).

ప్రధానమంత్రి: శభాష్.

ప్రధానమంత్రి: మీ అందరి శిక్షణా పూర్తయ్యిందా?

మెట్రో లోకో పైలట్: అయ్యింది సర్.

ప్రధానమంత్రి: మీరు బాగా నడుపుతున్నారా?

మెట్రో లోకో పైలట్: అవును సర్.

ప్రధానమంత్రి: ఈ పని మీకు సంతృప్తినిస్తోందా?

మెట్రో లోకో పైలట్: అవును సర్. మేము భారతదేశంలో మొదటి (స్పష్టంగా లేదు)… మాకు చాలా గర్వంగా ఉంది. ఇది మాకు చాలా మంచి అనుభూతినిస్తోంది సర్.

ప్రధానమంత్రి: మీరంతా తప్పకుండా ప్రత్యేకంగా దీనిపై చాలా దృష్టిపెట్టాలి. మామూలుగా మాట్లాడుకోవడానికి కూడా సమయం ఉండకపోవచ్చు కదా?

మెట్రో లోకో పైలట్: లేదు సర్, అందుకు మాకు సమయం ఉండడం లేదు… (స్పష్టంగా లేదు) అలాంటిదేమీ జరగదు.

ప్రధానమంత్రి: అవునా?

మెట్రో లోకో పైలట్: అవును సర్.

ప్రధానమంత్రి: సరే, అందరికీ శుభాకాంక్షలు.

మెట్రో లోకో పైలట్: ధన్యవాదాలు సర్.

మెట్రో లోకో పైలట్: మిమ్మల్ని కలిసినందుకు మా అందరికీ చాలా సంతోషంగా ఉంది సర్.

గమనిక: నమో భారత్ రైలులో ప్రయాణం సందర్భంగా విద్యార్థులు, లోకో పైలట్లతో ప్రధానమంత్రి సంభాషణకు ఇది ఇంచుమించు అనువాదం. మౌలిక సంభాషణ హిందీలో ఉంది.