Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

శ్రీ సుబ్రహ్మణ్య భారతికి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శ్రద్ధాంజలి


 కవి, రచయిత శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి ఈరోజు.  ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు.

 

శ్రీ సుబ్రహ్మణ్య భారతి రచనల సంకలన గ్రంథాన్ని ఈ రోజు మధ్యాహ్నం ఒంటి గంటకు నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో ఆవిష్కరించనున్నట్లు కూడా శ్రీ నరేంద్ర మోదీ ప్రకటించారు.

 

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూ, ఆ సందేశంలో ఈ కింది విధంగా పేర్కొన్నారు:

‘‘మహనీయుడు శ్రీ సుబ్రహ్మణ్య భారతి జయంతి సందర్భంగా ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను.  దార్శనికుడైన కవి, రచయిత, మేధావి, స్వాతంత్య్ర సమరయోధుడు, సంఘ సంస్కర్త శ్రీ సుబ్రహ్మణ్య భారతి రచనలు ఎంతో మంది ప్రజల్లో దేశభక్తి, విప్లవ భావాలను పెంచాయి.   మానవజాతిలో సమానత్వం, మహిళలకు సాధికారిత కల్పన వంటి ఆయన ప్రగతిశీల ఆదర్శాలు కూడా ఎంతో స్ఫూర్తిదాయకమైనవే.

 

ఆయన రచనలతో కూడిన ఒక సంకలన గ్రంథాన్ని ఈరోజు మధ్యాహ్నం ఒంటి గంటకు నంబర్ 7, లోక్ కళ్యాణ్ మార్గ్‌లో ఏర్పాటుచేసిన ఒక కార్యక్రమంలో నేను ఆవిష్కరించబోతున్నాను. ఈ ప్రయత్నానికిగాను శ్రీ శీని విశ్వనాథన్ జీకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను.’’ 

 

 

***

MJPS/RT